ఓవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్థుల ఎంపికపై సమీక్షలు మీద సమీక్షలు జరుపుతుంటే...మరోవైపు ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురువారం టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవితో పాటు, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.