ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన  ఎంపీ మాగుంట | Ongole MP Magunta Wishes the Prime Minister New delhi | Sakshi
Sakshi News home page

ప్రధానికి శుభాకాంక్షలు తెలిపిన  ఎంపీ మాగుంట

Published Sun, Jun 23 2019 10:24 AM | Last Updated on Sun, Jun 23 2019 10:25 AM

Ongole MP Magunta Wishes the Prime Minister New delhi  - Sakshi

సాక్షి, ఒంగోలు : భారత ప్రధాని నరేంద్ర మోదీని, ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కలిశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో నూతనంగా ఎన్నికైన ఎంపీలు, రాజ్యసభ సభ్యులకు విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న మాగుంట ప్రత్యేకంగా వీరిని కలిశారు. వెంకయ్యనాయుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ప్రత్యేకంగా పరిచయం చేశారు. వెంకయ్యనాయుడు మాగుంట కుటుంబం గురించి సంక్షిప్తంగా ప్రధానికి వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement