సాక్షి, ప్రకాశం జిల్లా: తన కుమారుడు రాఘవరెడ్డి ఏ తప్పు చేయలేదని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారాలు చేస్తోందన్నారు. 10 రాష్ట్రాల్లో తమకు వ్యాపారాలు ఉన్నాయన్నారు. మా కుటుంబం ఎలాంటి తప్పు చేయలేదని ఎంపీ మాగుంట స్పష్టం చేశారు.
మాగుంట కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు: బాలినేని
మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాలో ప్రజలకు ఎంతో సేవ చేసిందని.. అలాంటి కుటుంబంపై రాజకీయ కుట్ర చేయడం బాధాకరమని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.. ఒంగోలులో మాగుంట నివాసంలో ఎంపీ మాగుంటను పరామర్శించిన బాలినేని, అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎవ్వరితో విబేధాలు లేకుండా అందర్ని కలుపుకునిపోయే గుణం మాగుంట కుటుంబానిది అని అన్నారు. రాజకీయంగా మాగుంట కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బాలినేని అన్నారు. మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలతో పాటు పార్టీ అండగా ఉంటుందని బాలినేని భరోసా ఇచ్చారు. ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని బాలినేని అన్నారు.
చదవండి: ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment