ఎంపీ మాగుంటను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? | Question by the Supreme Court during the hearing of Kavita petition | Sakshi

ఎంపీ మాగుంటను నిందితుడిగా ఎందుకు చేర్చలేదు?

Aug 28 2024 5:27 AM | Updated on Aug 28 2024 5:27 AM

Question by the Supreme Court during the hearing of Kavita petition

కవిత పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రశ్న

మాగుంట విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారు?

కవిత నిందితురాలు అయినప్పుడు మాగుంట సాక్షి ఎలా అవుతారు?

మనీ లాండరింగ్‌ కేసులో రాఘవ లేరని ఎలా అంటారు?

నేరారోపణ చేసిన వ్యక్తినే సాక్షిగా మార్చారు

రేపు ఇష్టానుసారం మరోవ్యక్తిని తీసుకువస్తారా?

ఇదా దర్యాప్తు సంస్థల పారదర్శకత?.. మాగుంటతో 

మాట్లాడినందుకే కవిత ఫోన్లు ధ్వంసం: అదనపు సొలిసిటర్‌ జనరల్‌

రాఘవ అప్రూవర్‌గా మారినందుకే బెయిలు వచ్చింది: ముకుల్‌ రోహత్గి  

వాదనల అనంతరం షరతులతో కవితకు బెయిలు

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నిందితురాలు అయినప్పుడు.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకే కేసులో ఉన్న ఇద్దరిలో ఆమె నిందితురాలు అయినప్పుడు ఆయన సాక్షి ఎలా అవుతారో తెలపాలంది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సవాల్‌ చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. 

విచారణలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని, ఆ విషయంలో భిన్నంగా వ్యవహరించారని దర్యాప్తు సంస్థల్ని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు బదులిస్తూ.. కవిత ఫోన్లు ధ్వంసం చేయడానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో మాట్లాడటమే కారణం అని తెలిపారు. మేజి్రస్టేట్‌ ముందు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలంతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పేరు బయటకు వచ్చి0దన్నారు. 

పాలసీలో భాగస్వామ్యం కావడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎంపీ మాగుంట కలిశారని, అయితే కవితను కలవాలని కేజ్రీవాల్‌ సూచించారని తెలిపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో తన నివాసానికి కవిత రమ్మని ఫోను చేశారంటూ ఎంపీ మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవిత ఫోను ధ్వంసం చేయాల్సి వ0చ్చిదని ఎస్‌వీ రాజు తెలిపారు. పాలసీ అనుకూలంగా ఉండడానికి ఆప్‌ నేతలకు రూ. 100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని రూ. 50 కోట్లు తనకు ఇవ్వాలని కవిత చెప్పారని మాగుంట వాంగ్మూలంలో పేర్కొన్నట్లు రాజు కోర్టుకు తెలిపారు. 

ఈ క్రమంలోనే అభిõÙక్‌ బోయినపల్లి, బుచ్చిబాబులకు తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా రూ. 25 కోట్లు అందజేశారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదు అని ప్రశ్నించింది. కవిత నిందితురాలు అయినప్పుడు మాగుంట సాక్షి ఎలా అవుతారో చెప్పాలంది. ఈ సమయంలో కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి కల్పించుకొని మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారడంతోనే బెయిలు వచ్చి0దన్నారు. 

ఇలాంటి ఆరోపణలే తప్ప ఎలాంటి ఆధారాలు లేవని రోహత్గి తెలిపారు. ఈ సమయంలో కేజ్రీవాల్‌కు ఏ కేసులో బెయిలు వచ్చి0దనే విషయాలు జస్టిస్‌ బీఆర్‌ గవాయి ఆరా తీశారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారని మాగుంట రాఘవ రూ. 25 కోట్లు బుచ్చిబాబు, అభిõÙక్‌కు ఇచ్చారని అంటున్నారు మరి మనీలాండరింగ్‌ కేసులో రాఘవ లేరని ఎలా అంటారని జస్టిస్‌ బీఆర్‌ గవాయి ప్రశ్నించారు. నేరారోపణ చేసిన వ్యక్తినే సాక్షిగా మార్చారు? రేపు ఇష్టానుసారం మరో వ్యక్తిని తీసుకొస్తారా? ఇదా దర్యాప్తు సంస్థల పారదర్శకత అని ప్రశి్నంచారు.

కవితకు బెయిల్‌ మంజూరు 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక మహిళగా కవిత బెయిలుకు అర్హురాలని తేల్చి చెప్పింది. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45ను అర్థం చేసుకోవడంలో ఢిల్లీ హైకోర్టు విఫలమైందని పేర్కొంది. సహ నిందితులు, సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు కాకుండా నేరంలో కవిత పాత్ర ఉందన్న ఆధారాలు ఇంకేమీ దర్యాప్తు సంస్థలు చూపకపోవడాన్ని గుర్తు చేస్తూ బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. 

ముఖ్యంగా.. దర్యాప్తు పూర్తి, చార్జిషీటు దాఖ­లు, మహిళ అనే మూడు అంశాల ఆధారంగా బెయిలు మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ఈడీ, సీబీఐ కేసుల్లో హైకోర్టు ఆదేశాలు సవాల్‌ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవా­రం విచారించింది. సుమారు గంటన్నరకు పైగా సుదీర్ఘంగా ఇరుపక్షాలు వాదించాయి. ఇరుపక్షాల వాదనల అనంత­రం షరతులతో కూడిన బెయిలును ధర్మాసనం మంజూరు చేసింది. 

‘‘జులై 1న ఢిల్లీ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు క్వాష్‌ చేస్తున్నాం. రెండు కేసుల్లోనూ చెరో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలి. సాక్షుల్ని బెదిరించడం, ఆధారాలు ట్యాంపర్‌ చేయడం చేయరాదు. ట్రయల్‌ కోర్టులో పాస్‌పోర్టు డిపాజిట్‌ చేయాలి. పిటిషనర్‌ ట్రయల్‌ కోర్టుకు రెగ్యులర్‌గా హాజరవుతూ.. దర్యాప్తు వేగవంతానికి సహకరించాలి’’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement