
సాక్షి, ప్రకాశం జిల్లా: ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది పూర్తిగా సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా వ్యాపారులు చేస్తున్న కుట్రగా భావిస్తున్నట్లు చెప్పారు.
తనకు, తన కుమారుడికి ఆ కంపెనీలో ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు. ఆరోపణలపై త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయని తెలిపారు.
చదవండి: (సోమిరెడ్డి తిప్పలు.. వారందరికీ టికెట్ లేదన్న నారా లోకేష్)