MP Magunta Sreenivasulu Comments On Delhi Liquor Scam Case, Details Inside - Sakshi
Sakshi News home page

లిక్కర్‌ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదు.. ఈడీకి క్లారిటీ ఇచ్చాము: ఎంపీ మాగుంట

Published Mon, Sep 19 2022 12:12 PM | Last Updated on Mon, Sep 19 2022 12:54 PM

MP Magunta Sreenivasulu Comments On Delhi Liquor Scam - Sakshi

సాక్షి, ప్రకాశం: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా పొలిటికల్‌ హీట్‌ పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికీ పలు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అటు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న తప్పుడు ఆరోపణలపై ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు.

తాజాగా ఎంపీ మాగుంట మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో మాకెలాంటి సంబంధం లేదు. 50 ఏళ్లుగా మేము మద్యం వ్యాపారం చేస్తున్నాము. ఢిల్లీ లిక్కర్‌ వ్యాపారంలో మా కుమారుడికి ఒక్క శాతం వాటా కూడా లేదు. లిక్కర్‌ స్కామ్‌లో మాపై కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ లిక్కర్‌ బిజినెస్‌లో నేను, నా కొడుకు డైరెక్టర్లుగా లేము. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే.. మా బంధువులకు రెండో జోన్లలో షాపులు ఉన్నాయి. మా బంధువులకు మాగుంట పేరు ఉండటంతో మాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈడీ అధికారుల అనుమానం నివృత్తి చేశాము అని కామెంట్స్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement