సాక్షి, ఒంగోలు: తమిళనాడు డీఎంకే అధినేత, కాబోయే ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చైన్నైలోని ఆయన నివాసంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మొదటిసారి ఎన్నికైన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను మాగుంట శ్రీనివాసులరెడ్డితో పాటు ఆయన కుమారుడు మాగుంట మాగుంట రాఘవరెడ్డి కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఎంపీ మాగుంటకు రెండో డోసు వ్యాక్సిన్
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బుధవారం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో మోతాదు వేయించుకున్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ప్రజలు కూడా వ్యాక్సిన్‌ను వేయించుకుంటూ వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment