సాక్షి, చెన్నై: టీడీపీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బాలాజీ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలతో పాటు 13 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని మాగుంట గ్రూపు సంస్థల వ్యాపార లావాదేవీలన్నీ చెన్నై బజుల్లా రోడ్డులోని ప్రధాన కార్యాయం ద్వారానే సాగుతుంటాయి. ప్రధాన కార్యాలయంతో పాటు చెన్నై శివారు పూందమల్లిలోని డిస్టిలరీ ఫ్యాక్టరీల్లో అవినీతి నిరోధకశాఖ చేపట్టిన తనిఖీల్లో అత్యంత విలువైన డాక్యుమెంట్లు, డిస్టిలరీ ఫ్యాక్టరీలో శనివారం రూ.40 కోట్లు పట్టుబడ్డాయి. అనధికారిక సమాచారం ప్రకారం రూ.55 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
గత నెల 30వ తేదీన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చెన్నైలోని ఒక స్టార్ హోటల్‌పై నిఘాపెట్టి భారీ స్థాయిలో 7 కిలోల విదేశీ బంగారు బిస్కెట్లు, రూ.16 కోట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా దీంతో సంబంధం ఉన్న కొరియా దేశానికి చెందిన ఇద్దరు యువతులను, చెన్నైకి చెందిన హవాలా వ్యాపారిని అరెస్ట్ చేశారు. వాటికి కొనసాగింపుగానే మాగుంట కార్యాలయంపై దాడులు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. (మాగుంటపై ఐటీ కొరడా)
Comments
Please login to add a commentAdd a comment