సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపినట్టు ఆయన ఢిల్లీలో చెప్పారు. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాగా, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజీనామాను లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ బుధవారం ఆమోదించారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి సైతం ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించినప్పటికీ... స్పీకర్ కార్యాలయానికి అందలేదని లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.