
సాక్షి, ప్రకాశం : జగన్ అనుకుంటే సాధిస్తాడు.. ఇచ్చిన మాట తప్పడని వైయస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ స్పష్టం చేశారు. శుక్రవారం మార్కాపురం ప్రచార సభలో పాల్గొన్న విజయమ్మ ప్రసంగిస్తూ.. జగన్ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోంది.. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను.. చంద్రబాబు మూలకు పడేశారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను వైఎస్సార్ 70 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 30 శాతం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చంద్రబాబుకు మనసు రాలేదని మండి పడ్డారు. పసుపు - కుంకుమ పేరుతో చంద్రబాబు జనాలను మాయ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం దేనికి ఉపయోగపడింది.. రాజధాని నిర్మాణానికా.. ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడానికా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏసీ రూముల్లో కూర్చొని జగన్ నవవరత్నాలను కాపీ కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబు నిర్విర్యం చేసిన ఆరోగ్యశ్రీని పునరుద్ధరిస్తాడని.. ఎంత ఖర్చయిన భరిస్తాడని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే మార్కాపురం పలకల పరిశ్రమకు చేయూతనిస్తాడని పేర్కొన్నారు. చంద్రబాబు అన్ని పార్టీలతో కలస్తూ.. జగన్ మీద నిందలు వేస్తున్నాడంటూ మండిపడ్డారు. జగన్ ఎవరితోనూ కలవడు.. 25 ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేక హోదా తెచ్చుకుందామని తెలిపారు. మార్కాపురం అభ్యర్థిగా కేపీ నాగార్జున రెడ్డిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించడని విజయమ్మ ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment