
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి వంటిదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి తప్పక ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ ఈవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర మూలంగానే రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లకు గాను వైఎస్సార్‌సీపీ 22 ఎంపీ సీట్లు గెల్చుకుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment