కొత్త రైల్వే బడ్జెట్... తొమ్మిది ముఖ్యాంశాలు
కొత్త రైల్వే బడ్జెట్... తొమ్మిది ముఖ్యాంశాలు
Published Tue, Jul 8 2014 3:24 PM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
చిరునవ్వుల మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవరికెన్నిరైళ్లు వచ్చాయి, టికెట్ల ధరలెంత పెరిగాయి వంటి ప్రశ్నలను పక్కనబెడితే రైల్వే బడ్జెట్ లోని అతి ముఖ్యమైన తొమ్మిది అంశాలేమిటో ఒకసారి చూద్దాం.
* రైల్వేలో ఆపరేషన్స్ విభాగం మినహా మిగతా అన్నిటా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు తెరిచారు. క్యాబినెట్ అనుమతి వస్తే ఎఫ్ డీ ఐ వచ్చే అవకాశాలున్నాయి.
* ఇక రైళ్లు వేగంగా పరుగులు తీస్తాయి. తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటలకు 160 కి.మీ నుంచి 200 కిమీకి పెంచుతారు.
* ఇక భారతదేశంలోనూ బుల్లెట్ ట్రెయిన్లు పరుగులు తీస్తాయి. మొదటి బుల్లెట్ ట్రెయిన్ మహారాష్ట్ర నుంచి అహ్మదాబాద్ వరకూ నడుస్తుంది.
* వాజ్ పేయీ హయాంలో స్వర్ణ చతుర్భుజి రోడ్ల లాగా నరేంద్ర మోడీ యుగంలో వజ్ర చతుర్భుజి రైలు మార్గాలు రాబోతున్నాయి.
* 25 లక్షలకు మించి చేసే అన్ని కొనుగోళ్లను ఈ ప్రొక్యూర్ మెంట్ పద్ధతిలోనే ఇకపై చేయాల్సి ఉంటుంది. దీని వల్ల అవినీతి తగ్గి, పారదర్శకత పెరుగుతుంది.
* ఈ ఆర్ధిక సంవత్సరం ప్రభుత్వం 65,450 కోట్లు రైల్వేలపై ఖర్చు చేయబోతోంది. రైల్వేలలో పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా 6,005 కోట్లు సంపాదించబోతోంది.
* మహిళా ప్రయాణికుల భద్రత కోసం 4000 మంది మహిళా పోలీసులను రిక్రూట్ చేయబోతున్నారు.
* ఇక రైల్వే స్టేషన్లలో బ్రాండెడ్ ఆహారం లభిస్తుంది. రైల్వే క్యాంటీన్లలో చెత్త ఆహారం గురించి ఫిర్యాదు చేయడం మానేయొచ్చు.
* ఈ టికెటింగ్ వ్యవస్థ వేగవంతమౌతుంది. మొబైల్ ఫోన్ల ద్వారా, పోస్టాఫీసుల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల ఒకే సమయంలో లక్షకు పైగా ప్రయాణికులు టికెట్లు తీసుకోవచ్చు.
* రైల్వే స్టేషన్లు, అన్ని రైల్వేలలో వైఫై సదుపాయం ఉంటుంది. మనం ఎక్కడున్నా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. రైలు ప్రయాణంలో ఉండగా ఫోన్లు అందక ఇబ్బంది పడటం ఉండదు.
Advertisement
Advertisement