రేప్ కేసు విచారణకు హాజరైన కార్తీక్ | karthik gowda appears before investigating officer | Sakshi
Sakshi News home page

రేప్ కేసు విచారణకు హాజరైన కార్తీక్

Published Fri, Sep 12 2014 12:05 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

రేప్ కేసు విచారణకు హాజరైన కార్తీక్ - Sakshi

రేప్ కేసు విచారణకు హాజరైన కార్తీక్

సినీనటి మైత్రేయిపై అత్యాచారం, మోసం కేసులో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యాడు. కార్తీక్ తన వాంగ్మూలాన్ని శుక్రవారమే రికార్డు చేసే అవకాశముంది., ఇప్పటికే అతడికి బెంగళూరులో వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్తీక్ గౌడకు బెంగళూరు సెషన్స్ కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరుచేసింది.

కార్తీక్ తనను 2013 జూలై నెలలో పెళ్లి చేసుకున్నాడని మైత్రేయి అనే నటి ఆరోపించిన విషయం తెలిసిందే. సరిగ్గా కార్తీక్ నిశ్చితార్థం రోజునే ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగింది. తమ పెళ్లికి ఏకైక సాక్షి కేవలం కార్తీక్ డ్రైవరేనని ఆమె చెప్పింది.

ప్రతినెలా 15, 30వ తేదీలలో పోలీసుల ఎదుగట హాజరవుతానన్న నిబంధనతో, రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు స్థానికుల గ్యారంటీలతో కార్తీక్కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. అతడు తన పాస్పోర్టును కూడా పోలీసులకు అప్పగించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement