కేంద్రమంత్రి సదానంద కుమారుడిపై ‘420’
పెళ్లి చేసుకుని మోసం చేశాడని కార్తీక్‌పై ఫిర్యాదు చేసిన నటి
అన్యాయుంగా ఇరికించారన్న రైల్వేవుంత్రి
సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 సెక్షన్ల కింద బెంగళూరులోని ఆర్‌టీ నగర పోలీసు స్టేషన్‌లో గురువారం కేసు నమోదు చేశారు. తనను వివాహం చేసుకుని మోసం చేశాడంటూ వర్ధమాన నటి మైత్రేయి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మైత్రేయి మాట్లాడుతూ... తనకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, ఇకపై కలిసి ఉండడం కుదరదంటూ కార్తీక్ తేల్చి చెప్పాడని పేర్కొంది.
తనకు న్యాయం జరిగేవరకూ పోరాటం సాగిస్తానని స్పష్టం చేసింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సదానంద గౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం. తన కువూరుడిని అన్యాయుంగా ఇందులో ఇరికించారని గురువారం వుంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. అరుుతే ఈ విషయుంలో తాను జోక్యం చేసుకోనని వుంత్రి పేర్కొన్నారు. వురో పక్క ఈ విషయుం కర్ణాటక వుహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది.
ఆ యువతి సోదరి తవు వద్దకు వచ్చారని కమిషన్ చైర్‌పర్సన్ వుంజులా వూనస తెలిపారు. గత జూన్‌లో వుంగళూరులోని వుంత్రి నివాసంలో కార్తీక్ డ్రైవర్ సవుక్షంలో తావుు వివాహం చేసుకున్నావుని మైత్రేయి ఆరోపిస్తోంది. తాను రెండున్నరేళ్ల కిందట తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయూలతో సంబంధం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలను కర్ణాటక హోంవుంత్రి జార్జి ఖండించారు. దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు ఉంటాయుని, ఈ విషయుంలో ప్రభుత్వం కలుగజేసుకోదని ఆయున పేర్కొన్నారు. కార్తీక్ నిశ్చితార్థం వురో యుువతితో జరిగినరోజే మైత్రేయి ఈ ఫిర్యాదు చేయుడం గవునార్హం.