maitreyi
-
రైల్వే మంత్రి తనయుడికి వారంట్
సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి డీవీ సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడపై స్థానిక కోర్టు గురువారం అరెస్టు వారెంట్‌తో పాటు లుక్ ఔట్ నోటీసు (కనిపిస్తే పట్టివ్వాలని ఆదేశం) జారీ చేసింది. కార్తీక్ తనను అపహరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నటి మైత్రేయి ఇక్కడి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో వారం క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు హాజరు కావాలంటూ పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ కార్తీక్ హాజరు కాలేదు. దీంతో ఇక్కడి ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు లుక్ఔట్ నోటీసును జారీ చేసింది. కార్తీక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఇక్కడి సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గత వారం కార్తీక్‌కు ఓ యువతితో నిశ్చితార్థం జరిగిన రోజే మైత్రేయి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక జూనలో కార్తీక్ తనను వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు మైత్రేయితో తనకు గతంలోనే వివాహం జరిగిందని కన్నడ దర్శకుడు రిషి చెప్పాడు. అయితే తన పరపతిని దెబ్బతీసేం దుకు అతను ప్రయత్నించాడని ఆరోపిస్తూ మైత్రే యి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
పదేళ్ల క్రితమే మైత్రేయితో వివాహం
కేంద్ర రైల్వే మంత్రి సదానంద కుమారుడు కార్తీక్ గౌడ, నటి మైత్రేయి వ్యవహారం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. కార్తీక్ గౌడ తన భర్త అంటూ మైత్రేయి కొద్ది రోజుల క్రితం ఇక్కడి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే మంగళవారం కన్నడ సినీ దర్శకుడు రిషి మైత్రేయిపై ఇక్కడి 8వ ఏసీఎఎం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. పదేళ్ల క్రితమే తాను మైత్రేయిని వివాహం చేసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు రిషి, ఆయన న్యాయవాది కుమార గౌడ విలేకరులతో మాట్లాడుతూ... 2004లో కన్నడ సూర్య ది గ్రేట్ అనే సినిమాలో మైత్రేయి అలియాస్ శ్రుతి హీరోయిన్గా తానే అవకాశం కల్పించానని రిషి చెప్పారు. అదే ఏడాది జూలై 17న ఇక్కడి శేషాద్రిపురంలోని సన్మాన్ హోటల్లో మైత్రేయి తాను వివాహం చేసుకున్నట్లు రిషి చెప్పారు. నాలుగు నెలల పాటు అదే లాడ్జిలో ఉన్నామని, కొద్ది రోజుల తరువాత తన వద్ద రూ. 2 లక్షలు నగదు తీసుకుని మైత్రేయి అదృశ్యమైందని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచి ఆమె కనిపించలేదని చెప్పారు. 2004 ఆగస్టు 27న మైత్రేయి ఉన్న ఇంటికి వెళ్తే తనను దూషించి బయటకు నెట్టి వేసిందని రిషి ఆరోపించారు. అదే రోజు ఒక నెంబర్ నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని, దీంతో తాను ఇక్కడి వయ్యాలికావెల్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. అదే విధంగా 2007లో కూడా వ్యాపారవేత్త అంజన్‌కుమార్ అనే వ్యక్తిని మైత్రేయి బ్లాక్ మెయిల్ చేసి నగదు వసూలు చేసిందని ఆరోపించారు. అంతా అబద్ధం : నటి మైత్రేయి సూర్య ది గ్రేట్ సినిమాలో నటించే సయయంలో తన వయస్సు 16 సంవత్సరాలు అని నటి మైత్రేయి చెప్పారు. మంగళవారం ఆమె ఒక టీవీ చానల్లో మాట్లాడుతూ... షూటింగ్ జరిగే ప్రతి రోజు తాను తల్లితో కలిసి వచ్చానని, అలాంటి సమయంలో తాను తల్లికి తెలియకుండా వివాహం ఎలా చేసుకుంటానని ప్రశ్నించారు. దర్శకుడు రిషి ఒక 420 అని అని మండిపడ్డారు. తాను కార్తీక్ గౌడపై కేసు పెట్టిన తరువాత ఈ ఆరోపణలు చెయ్యడం దారుణమని విలపించారు. కేసు దర్యాప్తులో అసలు విషయాలు వెలుగు చూస్తాయని మైత్రేయి స్పష్టం చేశారు. కార్తీక్ కోసం ప్రత్యేక బృందాలు : బుధవారం లోపు విచారణకు హాజరు కాకుంటే కార్తీక్ అరెస్టు చెయ్యడానికి పోలీసు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేసినా కార్తీక్ నుంచి ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో ఆయన్ను అరెస్ట్ చేయడానికే పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. -
పరారీ ..!
కార్తీక్ కోసం పోలీసుల గాలింపు ఇంటిలో నోటీసులు ఇచ్చిన వైనం మైత్రేయిని పలుమార్లు విచారించిన అధికారులు బెంగళూరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడ కోసం పోలీసులు గాలిస్తున్నారని బెంగళూరు అడిషనల్ పోలీసు కమిషనర్ ఎస్ రవి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం సంజయ్‌నగరలోని సందానందగౌడ ఇంటికి పోలీసులు వెళ్లారని, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని తెలిపారు. దీంతో పోలీసులు ఆ ఇంటిలో పని చేస్తున్న వారికి నోటీసులు అందించారని, విచారణకు హాజరు కావాలని కార్తీక్‌గౌడకు చెప్పాలని సూచించినట్లు వెల్లడించారు. అయితే 24 గంటలైనా కార్తీక్‌గౌడ విచారణ నిమిత్తం సంజయ్‌నగర్ పోలీసుల ముందు హాజరుకాలేదన్నారు. ఆర్టీ నగర్ పోలీసులు సినీ నటి మైత్రేయిని శుక్ర, శనివారాల్లో పలుమార్లు విచారణ చేశారని తెలిపారు. ప్రాథమిక వైద్య పరీక్షలలో మైత్రేయిపై కార్తీక్‌గౌడ అత్యాచారం చేసినట్లు ఎలాంటి ఆధారాలూ లభించలేదని, అయితే వైద్యులిచ్చే ఫైనల్ రిపోర్టులో అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. -
కార్తీక్ నా భర్త
వర్ధమాన నటి మైత్రేయి న్యాయం జరిగే వరకూ పోరాటం మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు 420 సెక్షన్ కింద కార్తీక్‌పై కేసు నమోదు వాస్తవమని తేలితే చర్యలు తప్పవు : సిద్ధు సాక్షి, బెంగళూరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తన భర్త అని వర్ధమాన నటి మైత్రేయి స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. రెండున్నరేళ్ల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, అయితే తాజా ఘటనకు తాను కాంగ్రెస్ కార్యకర్త కావడానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల తనకు దూరంగా ఉంటున్న కార్తీక్ ఫోన్ చేసి ‘వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయింది, ఇకపై నీతో కలిసి ఉండేందుకు వీలుకాదు. మీడియా ముందుకు వెళ్లొద్దు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా’నని చెప్పారని వివరించారు. అయితే తనను భార్యగా అంగీకరించేంత వరకూ న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కాగా, తనకు జరిగిన అన్యాయంపై బుధవారం రాత్రి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో మైత్రేయి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం మైత్రేయికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవమని తేలితే చర్యలు తప్పవు ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే దోషులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి తారతమ్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి సదానందగౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం. మైత్రేయికు నోటీస్ జారీ ఫిర్యాదుకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అందించేందుకు గురువారం మధ్యాహ్నాం 12.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని మైత్రేయికి బుధవారం రాత్రి పోలీసులు సూచించారు. అయితే సాయంత్రం మూడు గంటలు దాటిపోయినా ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. దీనిపై వివరణ కోరుతూ మైత్రేయికి ఆర్టీ నగర పోలీసులు నోటీస్ జారీ చేశారు. కాగా, ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ... దర్యాప్తు పూర్తి అయిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఈ విషయంపై సదానందగౌడతో మాట్లాడినట్లు చెప్పారు. కార్తీక్ గౌడ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన వివరించారని పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి సదానంద కుమారుడిపై ‘420’
పెళ్లి చేసుకుని మోసం చేశాడని కార్తీక్‌పై ఫిర్యాదు చేసిన నటి అన్యాయుంగా ఇరికించారన్న రైల్వేవుంత్రి సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 సెక్షన్ల కింద బెంగళూరులోని ఆర్టీ నగర పోలీసు స్టేషన్లో గురువారం కేసు నమోదు చేశారు. తనను వివాహం చేసుకుని మోసం చేశాడంటూ వర్ధమాన నటి మైత్రేయి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మైత్రేయి మాట్లాడుతూ... తనకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, ఇకపై కలిసి ఉండడం కుదరదంటూ కార్తీక్ తేల్చి చెప్పాడని పేర్కొంది. తనకు న్యాయం జరిగేవరకూ పోరాటం సాగిస్తానని స్పష్టం చేసింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సదానంద గౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం. తన కువూరుడిని అన్యాయుంగా ఇందులో ఇరికించారని గురువారం వుంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. అరుుతే ఈ విషయుంలో తాను జోక్యం చేసుకోనని వుంత్రి పేర్కొన్నారు. వురో పక్క ఈ విషయుం కర్ణాటక వుహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది. ఆ యువతి సోదరి తవు వద్దకు వచ్చారని కమిషన్ చైర్పర్సన్ వుంజులా వూనస తెలిపారు. గత జూన్‌లో వుంగళూరులోని వుంత్రి నివాసంలో కార్తీక్ డ్రైవర్ సవుక్షంలో తావుు వివాహం చేసుకున్నావుని మైత్రేయి ఆరోపిస్తోంది. తాను రెండున్నరేళ్ల కిందట తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయూలతో సంబంధం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలను కర్ణాటక హోంవుంత్రి జార్జి ఖండించారు. దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు ఉంటాయుని, ఈ విషయుంలో ప్రభుత్వం కలుగజేసుకోదని ఆయున పేర్కొన్నారు. కార్తీక్ నిశ్చితార్థం వురో యుువతితో జరిగినరోజే మైత్రేయి ఈ ఫిర్యాదు చేయుడం గవునార్హం.