సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి డీవీ సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడపై స్థానిక కోర్టు గురువారం అరెస్టు వారెంట్‌తో పాటు లుక్ ఔట్ నోటీసు (కనిపిస్తే పట్టివ్వాలని ఆదేశం) జారీ చేసింది. కార్తీక్ తనను అపహరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నటి మైత్రేయి ఇక్కడి ఆర్‌టీ నగర పోలీస్ స్టేషన్‌లో వారం క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు హాజరు కావాలంటూ పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ కార్తీక్ హాజరు కాలేదు. దీంతో ఇక్కడి ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు లుక్‌ఔట్ నోటీసును జారీ చేసింది.
కార్తీక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఇక్కడి సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గత వారం కార్తీక్‌కు ఓ యువతితో నిశ్చితార్థం జరిగిన రోజే మైత్రేయి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక జూనలో కార్తీక్ తనను వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు మైత్రేయితో తనకు గతంలోనే వివాహం జరిగిందని కన్నడ దర్శకుడు రిషి చెప్పాడు. అయితే తన పరపతిని దెబ్బతీసేం దుకు అతను ప్రయత్నించాడని ఆరోపిస్తూ మైత్రే యి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రైల్వే మంత్రి తనయుడికి వారంట్
Published Fri, Sep 5 2014 2:31 AM | Last Updated on Mon, Aug 20 2018 4:35 PM
Advertisement