sadanada gowda
-
సుప్రీంకోర్టు సీజేతో సదానంద భేటీ
న్యూఢిల్లీ : కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి హైకోర్టు విభజన సమస్య పరిష్కారంపై చర్చ జరిగింది. కాగా హైకోర్టు ప్రకటించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాలో తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరిగిందంటూ న్యాయాధికారులు ఆందోళనకు దిగటం, వారిపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. అలాగే కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, పలువురు పార్టీ లీగల్ సెల్ నేతలు హైకోర్టు విభజన, న్యాయాధికారుల అంశాలను మంగళవారం సదానంద దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విభజన అంశంపై సుప్రీంకోర్టు సీజేతో సదానంద గౌడ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు హైకోర్టు విభజన వివాదం, తాజా పరిణామాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. హైకోర్టు విభజనపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని గతేడాది అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. -
కేంద్ర మంత్రిపై న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్: కేంద్ర మంత్రి సదానందగౌడ మోసం చేశారంటూ పలువురు న్యాయవాదులు ఆదివారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మూడు నెలల్లోగా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. ఇంత వరకు ఆ హామీ నెరవేర్చకుండా మోసం చేశారని న్యాయవాదులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రైల్వే మంత్రి తనయుడికి వారంట్
సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి డీవీ సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడపై స్థానిక కోర్టు గురువారం అరెస్టు వారెంట్‌తో పాటు లుక్ ఔట్ నోటీసు (కనిపిస్తే పట్టివ్వాలని ఆదేశం) జారీ చేసింది. కార్తీక్ తనను అపహరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నటి మైత్రేయి ఇక్కడి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో వారం క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు హాజరు కావాలంటూ పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ కార్తీక్ హాజరు కాలేదు. దీంతో ఇక్కడి ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు లుక్ఔట్ నోటీసును జారీ చేసింది. కార్తీక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఇక్కడి సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గత వారం కార్తీక్‌కు ఓ యువతితో నిశ్చితార్థం జరిగిన రోజే మైత్రేయి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక జూనలో కార్తీక్ తనను వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు మైత్రేయితో తనకు గతంలోనే వివాహం జరిగిందని కన్నడ దర్శకుడు రిషి చెప్పాడు. అయితే తన పరపతిని దెబ్బతీసేం దుకు అతను ప్రయత్నించాడని ఆరోపిస్తూ మైత్రే యి పోలీసులకు ఫిర్యాదు చేసింది.