Karthik gowda
-
'కేజీఎఫ్ 3' ఉందా ? లేదా ?.. మరో నిర్మాత ఏమన్నాడంటే ?
Hombale Films Producer Karthik Gowda About KGF 3: యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఓ పక్క కలెక్షన్లు మరోపక్క ప్రేక్షకుల మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక బాలీవుడ్లో అయితే రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ 3' రానుందని శనివారం ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ 3 మూవీని మార్వెల్ తరహాలో తెరకెక్కించనున్నట్లు, అక్టోబర్ తర్వాత షూటింగ్ ప్రారంభం కానున్నట్లు హోంబలే సంస్థ నిర్మాత విజయ్ కిరంగదూర్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వార్తలపై హోంబలో సంస్థకు చెందిన మరో నిర్మాత కార్తిక్ గౌడ స్పందించారు. 'సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మా వద్ద చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిపైనే మా దృష్టి ఉంది. కాబట్టి ఇప్పట్లో హోంబలే సంస్థ 'కేజీఎఫ్ 3'ని తెరకెక్కించలేదు. ఒకవేళ షూటింగ్ ప్రారంభిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన ఇస్తాం.' అని కార్తిక్ గౌడ ట్వీట్ చేశారు. చదవండి: 'కేజీఎఫ్ 3'పై క్లారిటీ.. మార్వెల్ ఫ్రాంచైజీ తరహాలో సినిమా The news doing the rounds are all speculation. With a lot of exciting projects ahead of us , we @hombalefilms will not be starting #KGF3 anytime soon. We will let you know with a bang when we start the work towards it. — Karthik Gowda (@Karthik1423) May 14, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గౌడతో అఫైర్‌పై మైత్రీయ సినిమా
బెంగళూరు: కేంద్ర న్యాయశాఖ మంత్రి జస్టిస్ డీవీ సదానంద గౌడ కుమారుడు కార్తీక గౌడతో నడిచిన తన ప్రేమ కలాపాలను ఇతి వృత్తంగా 'తీసుకొని నిర్మిస్తున్న సినిమాలో కన్నడ వర్ధమాన తార మైత్రీయ గౌడ స్వయంగా నటిస్తున్నారు. 'అక్షితే' పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 23న ప్రారంభమవుతుందని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. కార్తీక గౌడ, తాను చెట్టూ పుట్ట పట్టుకొని ప్రేమించుకున్నామని గతేడాది రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని మైత్రీయ గౌడ పబ్లిగ్గా ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. తనను కార్తీక గౌడ నమ్మించి మోసం చేశారనే ఆమె ఆరోపణలపై బెంగళూరు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కూడా జరుపుతున్నారు. అయితే ఎంతో పరువు ప్రతిష్టలు, పలుకుబడి కలిగిన నిందితుడిపై ఇంతవరకు చార్జిషీటు దాఖలు చేయలేదు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగళూరుకు వచ్చినప్పుడు దీనిపై మైత్రీయ నానా రాద్ధాంతం కూడా చేసింది. చివరకు ఆమెను మహిళా పోలీసుల ద్వారా బయటకు పంపించాల్సి వచ్చింది. 'అక్షితే' చిత్రానికి పెద్దగా పేరులేని రాజ్, కార్తీక్ శెట్టీ లాంటి వారిని ఎంపిక చేసుకున్నారు. అందులో హీరో పాత్రకు కూడా కార్తీక్ అనే పేరే ఖరారు చేశారు. సినిమాలో కార్తీక్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగే మైత్రీయ చివరకు పెల్లి చేసుకోదని సినీ వర్గాల సమాచారం. మైత్రేయ ప్రేమాయణంనే చిత్రంగా తీస్తున్నారా లేక ఫిక్షన్ కథనా? అనేది ఇంకా తెలియడం లేదు. అయితే ఈ పరిణామాలన్నింటిని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఎప్పటికప్పుడు గమనిస్తోంది. నిజ జీవిత పాత్రలపై చిత్రాన్ని నిర్మించాలంటే ఆ అసలు క్యారెక్టర్ల అనుమతి తీసుకోవడం తప్పనిసరని చిత్ర వాణిజ్య మండలి నిబంధనలు తెలియజేస్తున్నాయి. ఈ చిత్ర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సదానంద గౌడ కుటుంబం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే! అవసరమైతే వారు హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు తీసుకోవచ్చని హైకోర్టు న్యాయవాది ఆర్. నాథ్ చెప్పారు. మైత్రీయ ఒత్తిడి రాజకీయాల్లో భాగమే ఈ చిత్రం ఎత్తుగడని గౌడ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. -
మైత్రేయను కాపురానికి రమ్మనండి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: వర్ధమాన నటి మైత్రేయను తాను వివాహం చేసుకున్నానని సంచలన ప్రకటన చేసిన కన్నడ దర్శకుడు రుషి.. మైత్రేయ తనతో కలసి ఉండడం లేదని, తనతో కాపురం చేయాల్సిందిగా ఆమెను ఆదేశించాలని కోరుతూ ఇక్కడి కుటుంబ కోర్టులో అర్జీ దాఖలు చేశారు. రైల్వే మంత్రి సదానందగౌడ తనయుడు కార్తీక్‌గౌడపై అత్యాచారం, వంచన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మైత్రేయ వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. -
నటి మైత్రేయితో ముఖ పరిచయమే
*మైత్రేయాతో సంబంధాలపై కార్తీక్ *పోలీసుల విచారణకు హాజరైన వైనం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వర్ధమాన నటి, మోడల్ మైత్రేయా గౌడ ఫిర్యాదుతో ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడ ఎట్టకేలకు శుక్రవారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. అత్యాచారం, వంచన ఆరోపణల కింద మైత్రేయా చేసిన ఫిర్యాదుపై ఇక్కడి ఆర్టీ నగర పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు హాజరు కావాల్సిందిగా పోలీసులు రెండు సార్లు పంపిన సమన్లపై కార్తీక్ స్పందించక పోవడంతో ఇక్కడి ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. అనంతరం సిటీ సివిల్ కోర్టు అతనికి ముందుస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. మైత్రేయా చెబుతున్నట్లు, తాను ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడలేదని దర్యాప్తు అధికారి, ఏసీపీ ఓంకారయ్యకు కార్తీక్ సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. స్నేహితుల ద్వారా ఆమె పరిచయమైందని, మూడు, నాలుగు పార్టీల్లో మాట్లాడుకున్నామని, తర్వాత స్నేహంగా మారిందని వివరించారు. ఉదయం 6.15 గంటలకే ఆర్టీ నగర పోలీసు స్టేషన్‌కు వచ్చిన కార్తీక్, మైత్రేయా ఫిర్యాదుపై ఏసీపీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంతరం అతనిని వైద్య పరీక్షల కోసం అంబేద్కర్ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. తర్వాత మళ్లీ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు పరిచారు. మైత్రేయా ఫిర్యాదులోని సత్యాసత్యాలను కనుగొనడానికి ఏసీపీ అతనిని పలు విధాలుగా ప్రశ్నించారు. పసుపు కొమ్ముతో తాళి కట్టి కార్తీక్ తనను వివాహమాడాడని మైత్రేయా చేసిన ఫిర్యాదును కార్తీక్ తోసిపుచ్చారు. స్నేహితులుగా ఫోనులో మాట్లాడుకున్న విషయాలను రికార్టు చేసుకుని మైత్రేయా కట్టు కథలు అల్లుతోందని ఆరోపించారు. మంగళూరుకు పిలిపించుకున్నానని, తామిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మైత్రేయాను స్నేహితులకు పరిచయం చేశానని... ఆమె చెబుతున్నదంతా బూటకమేనని కార్తీక్ కొట్టి పారేసినట్లు తెలిసింది. కేంద్ర మంత్రిగా ఉన్న తన తండ్రిని రాజకీయంగా దెబ్బ తీయడానికి ప్రత్యర్థులు పన్నిన కుట్రలో మైత్రేయా పావుగా మారిందని ఆరోపించారు. స్నేహితురాలు కావడంతో పాటు సినీ నటి కనుక సహజంగానే ఆకర్షణ ఉంటుందని వివరణ ఇచ్చారు. తదుపరి దర్యాప్తునకు పిలిస్తే రావాలని సూచిస్తూ, దర్యాప్తు అధికారి అతనిని పంపించివేశారు. కాగా గత నెల 30న కొడగు జిల్లాలోని కుశాల నగరలో పారిశ్రామికవేత్త నాణయ్య కుమార్తె స్వాతితో కార్తీక్‌కు నిశ్చితార్థమైంది. వెనువెంటనే మైత్రేయా అతనిపై అపహరణ, అత్యాచారం, వంచన ఆరోపణల కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రేప్ కేసు విచారణకు హాజరైన కార్తీక్
సినీనటి మైత్రేయిపై అత్యాచారం, మోసం కేసులో రైల్వే మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యాడు. కార్తీక్ తన వాంగ్మూలాన్ని శుక్రవారమే రికార్డు చేసే అవకాశముంది., ఇప్పటికే అతడికి బెంగళూరులో వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్తీక్ గౌడకు బెంగళూరు సెషన్స్ కోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. కార్తీక్ తనను 2013 జూలై నెలలో పెళ్లి చేసుకున్నాడని మైత్రేయి అనే నటి ఆరోపించిన విషయం తెలిసిందే. సరిగ్గా కార్తీక్ నిశ్చితార్థం రోజునే ఈ విషయం బయటకు వచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా గందరగోళం చెలరేగింది. తమ పెళ్లికి ఏకైక సాక్షి కేవలం కార్తీక్ డ్రైవరేనని ఆమె చెప్పింది. ప్రతినెలా 15, 30వ తేదీలలో పోలీసుల ఎదుగట హాజరవుతానన్న నిబంధనతో, రూ. 2 లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఇద్దరు స్థానికుల గ్యారంటీలతో కార్తీక్‌కు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. అతడు తన పాస్‌పోర్టును కూడా పోలీసులకు అప్పగించాడు. -
కేంద్రమంత్రి సదానంద కుమారుడికి ఊరట!
బెంగళూరు: కేంద్రమంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌గౌడకు ఊరట లభించింది. అత్యాచారం, చీటింగ్ కేసులో కార్తీక్ గౌడకు బెంగుళూరు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కార్తీక్ తనను అపహరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నటి మైత్రేయి ఇక్కడి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడపై స్థానిక కోర్టు అరెస్టు వారెంట్‌తో పాటు లుక్ ఔట్ నోటీసు (కనిపిస్తే పట్టివ్వాలని ఆదేశం) జారీ చేసింది. -
'కార్తీక్' అత్యాచార ఆరోపణలపై సదానంద స్పందన!
న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడి కేసుపై రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ స్పందించారు. బీజేపీ వంద రోజుల పాలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో సదానంద గౌడ మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మీడియాతో పలుసార్లు మాట్లాడాను.. చట్టాలున్నాయని.. అవి వాటి పని చేసుకుపోతాయి. అంతకంటే ఎక్కువగా మాట్లాడేది ఏమిలేదు అని అన్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసగించారని, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై కన్నడ నటి మైత్రేయి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వారెంట్ జారీ చేసినప్పటి నుంచి కార్తీక్ గౌడ్ కనిపించకుండా పోయారు. -
రైల్వే మంత్రి తనయుడికి వారంట్
సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి డీవీ సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడపై స్థానిక కోర్టు గురువారం అరెస్టు వారెంట్‌తో పాటు లుక్ ఔట్ నోటీసు (కనిపిస్తే పట్టివ్వాలని ఆదేశం) జారీ చేసింది. కార్తీక్ తనను అపహరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నటి మైత్రేయి ఇక్కడి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో వారం క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తునకు హాజరు కావాలంటూ పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ కార్తీక్ హాజరు కాలేదు. దీంతో ఇక్కడి ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు లుక్ఔట్ నోటీసును జారీ చేసింది. కార్తీక్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఇక్కడి సెషన్స్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గత వారం కార్తీక్‌కు ఓ యువతితో నిశ్చితార్థం జరిగిన రోజే మైత్రేయి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక జూనలో కార్తీక్ తనను వివాహం చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు మైత్రేయితో తనకు గతంలోనే వివాహం జరిగిందని కన్నడ దర్శకుడు రిషి చెప్పాడు. అయితే తన పరపతిని దెబ్బతీసేం దుకు అతను ప్రయత్నించాడని ఆరోపిస్తూ మైత్రే యి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
సదానంద గౌడ కుమారుడికి అరెస్ట్ వారెంట్
-
సదానంద గౌడ కుమారుడికి అరెస్ట్ వారెంట్
బెంగళూరు: కన్నడ నటి వర్ధమాన నటి మైత్రేయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ కు బెంగళూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశంతో అతడిని అరెస్ట్ చేసే అవకాశముంది. కాగా, ముందస్తు బెయిల్ కోసం కార్తీక్- ఆగస్టు 30న సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆర్టీ నగర్ పీఎస్‌లో మైత్రేయి ఫిర్యాదు చేసింది. అయితే మైత్రేయితో పదేళ్ల క్రితమే తనకు పెళ్లైందని కన్నడ సినీ దర్శకుడు రిషి మైత్రేయిపై ఇక్కడి 8వ ఏసీఎఎం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. రిషితో తనకు పెళ్లికాలేదని మైత్రేయి స్పష్టం చేసింది. -
కార్తీక్ నా భర్త
వర్ధమాన నటి మైత్రేయి న్యాయం జరిగే వరకూ పోరాటం మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు 420 సెక్షన్ కింద కార్తీక్‌పై కేసు నమోదు వాస్తవమని తేలితే చర్యలు తప్పవు : సిద్ధు సాక్షి, బెంగళూరు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తన భర్త అని వర్ధమాన నటి మైత్రేయి స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. గురువారం మీడియాతో ఆమె మాట్లాడారు. రెండున్నరేళ్ల క్రితమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని, అయితే తాజా ఘటనకు తాను కాంగ్రెస్ కార్యకర్త కావడానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇటీవల తనకు దూరంగా ఉంటున్న కార్తీక్ ఫోన్ చేసి ‘వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయింది, ఇకపై నీతో కలిసి ఉండేందుకు వీలుకాదు. మీడియా ముందుకు వెళ్లొద్దు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తా’నని చెప్పారని వివరించారు. అయితే తనను భార్యగా అంగీకరించేంత వరకూ న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కాగా, తనకు జరిగిన అన్యాయంపై బుధవారం రాత్రి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో మైత్రేయి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం మైత్రేయికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవమని తేలితే చర్యలు తప్పవు ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే దోషులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి తారతమ్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి సదానందగౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం. మైత్రేయికు నోటీస్ జారీ ఫిర్యాదుకు సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలను అందించేందుకు గురువారం మధ్యాహ్నాం 12.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు రావాలని మైత్రేయికి బుధవారం రాత్రి పోలీసులు సూచించారు. అయితే సాయంత్రం మూడు గంటలు దాటిపోయినా ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకోలేదు. దీనిపై వివరణ కోరుతూ మైత్రేయికి ఆర్టీ నగర పోలీసులు నోటీస్ జారీ చేశారు. కాగా, ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి మాట్లాడుతూ... దర్యాప్తు పూర్తి అయిన తర్వాత వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. ఈ విషయంపై సదానందగౌడతో మాట్లాడినట్లు చెప్పారు. కార్తీక్ గౌడ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన వివరించారని పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి సదానంద కుమారుడిపై ‘420’
పెళ్లి చేసుకుని మోసం చేశాడని కార్తీక్‌పై ఫిర్యాదు చేసిన నటి అన్యాయుంగా ఇరికించారన్న రైల్వేవుంత్రి సాక్షి, బెంగళూరు: రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడపై ఐపీసీ 376, 420 సెక్షన్ల కింద బెంగళూరులోని ఆర్టీ నగర పోలీసు స్టేషన్లో గురువారం కేసు నమోదు చేశారు. తనను వివాహం చేసుకుని మోసం చేశాడంటూ వర్ధమాన నటి మైత్రేయి బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మైత్రేయి మాట్లాడుతూ... తనకు వేరే అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని, ఇకపై కలిసి ఉండడం కుదరదంటూ కార్తీక్ తేల్చి చెప్పాడని పేర్కొంది. తనకు న్యాయం జరిగేవరకూ పోరాటం సాగిస్తానని స్పష్టం చేసింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... మైత్రేయికి అన్యాయం జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సదానంద గౌడను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వివరణ కోరినట్లు సమాచారం. తన కువూరుడిని అన్యాయుంగా ఇందులో ఇరికించారని గురువారం వుంత్రి సదానందగౌడ పేర్కొన్నారు. అరుుతే ఈ విషయుంలో తాను జోక్యం చేసుకోనని వుంత్రి పేర్కొన్నారు. వురో పక్క ఈ విషయుం కర్ణాటక వుహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది. ఆ యువతి సోదరి తవు వద్దకు వచ్చారని కమిషన్ చైర్పర్సన్ వుంజులా వూనస తెలిపారు. గత జూన్‌లో వుంగళూరులోని వుంత్రి నివాసంలో కార్తీక్ డ్రైవర్ సవుక్షంలో తావుు వివాహం చేసుకున్నావుని మైత్రేయి ఆరోపిస్తోంది. తాను రెండున్నరేళ్ల కిందట తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయూలతో సంబంధం లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలను కర్ణాటక హోంవుంత్రి జార్జి ఖండించారు. దర్యాప్తు తర్వాత తదుపరి చర్యలు ఉంటాయుని, ఈ విషయుంలో ప్రభుత్వం కలుగజేసుకోదని ఆయున పేర్కొన్నారు. కార్తీక్ నిశ్చితార్థం వురో యుువతితో జరిగినరోజే మైత్రేయి ఈ ఫిర్యాదు చేయుడం గవునార్హం. -
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్ తగులుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనయుడి వివాదం మరవక ముందే మరో కేంద్రమంత్రి కూడా వార్తల్లో నిలిచారు. తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై రేప్ కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ కార్తీక్‌గౌడపై వర్ధమాన నటి మైత్రేయి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో అతనిపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యాయి. ఈ కేసు విషయంలో కార్తీక్ గౌడ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను సదానంద గౌడ కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమేనని తేల్చిపారేశారు. అయితే పోలీసులు మాత్రం మంత్రి కుమారుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి...తన పని తాము చేసుకు పోతున్నారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్‌పై ఆరోపణల వ్యవహారం రాజకీయ దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతగా ఉన్న పంకజ్ సింగ్ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహంగా ఉన్నారని, అవినీతి ఆరోపణలపై పంకజ్‌ను మందలించారని, దీనిపై రాజ్‌నాథ్ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. కాగా మీడియాలో వచ్చిన ఈ వివాదం వెనుక రాజ్‌నాథ్ అంటే గిట్టని, ఆ హోదాను ఆశిస్తున్న ఓ సీనియర్ నేత ఉన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే రాజకీయాల నుంచి వైదొలగుతానని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించటం విశేషం. ఏది ఏమైనా ఇద్దరు కేంద్ర మంత్రులు తమ సుపుత్రుల ద్వారా ప్రముఖంగా వార్తల్లోకి నిలవటం విశేషం. -
కేంద్రమంత్రి కొడుకుపై రేప్ కేసు
బెంగళూరు : కేంద్ర రైల్వేమంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌గౌడ రేప్ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ కార్తీక్‌గౌడపై వర్ధమాన నటి మైత్రేయి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో కార్తీక్ గౌడపై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదిక అనంతరం కార్తీక్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రేయి నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో కుషాల్ అనే స్నేహితుని ద్వారా కార్తీక్ గౌడ పరిచయమయ్యాడని, అనంతరం జూన్ 5న మంగళూరులోని తన ఇంటికి కార్తీక్ గౌడ పిలుచుకెళ్లి శారీరకంగా దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. పెళ్లికి ముందు ఇలాంటివి తనకు ఇష్టం లేదని చెప్పడంతో అప్పటికప్పడు ఓ పసుపుతాడును మెడలో కట్టాడని తెలిపింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసి తిరిగేవాళ్లమని, అందరికీ తెలిసేలా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో జూలై 25 నుంచి మాట్లాడడం కూడా మానేశాడని వాపోయింది. చివరకు ఈ విషయాన్ని అతని తల్లి దృష్టికి ఈ నెల 11న తీసుకెళ్లానని, అప్పట్లో ఆమె సైతం తనను బెదిరించి పంపినట్లు తెలిపింది. ఇప్పుడు మరో అమ్మాయితో అతడికి నిశ్చితార్థం చేస్తున్నారని, తనను పెళ్లి చేసుకుని ఇలా మోసం చేయడం తగదని ఆమె అంటోంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్టీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ ఖండించారు. తన కుమారుడి నిశ్చితార్థం రోజున ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. మైత్రేయికి అన్యాయమే జరిగి ఉంటే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కాగా కార్తీక్ గౌడపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యింది. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆమె ఆర్టీ నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. మైత్రేయి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు కార్తీక్ గౌడ కూడా మైత్రేయి ఆరోపణలను తోసిపుచ్చాడు. తన తండ్రి ఉన్నతమైన వ్యక్తి అని, వివాదాల్లోకి లాగడం మంచిది కాదని వ్యాఖ్యానించాడు. తనకు అంత తీరిక కూడా లేదని, తన పనుల్లో తాను బిజీగా ఉన్నానని చెప్పాడు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)