సదానంద గౌడ కుమారుడికి అరెస్ట్ వారెంట్ | Karthik Gowda faces arrest after warrant issued in alleged rape case | Sakshi
Sakshi News home page

సదానంద గౌడ కుమారుడికి అరెస్ట్ వారెంట్

Published Thu, Sep 4 2014 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

సదానంద గౌడ కుమారుడికి అరెస్ట్ వారెంట్

సదానంద గౌడ కుమారుడికి అరెస్ట్ వారెంట్

బెంగళూరు: కన్నడ నటి వర్ధమాన నటి మైత్రేయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడ కు బెంగళూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశంతో అతడిని అరెస్ట్ చేసే అవకాశముంది. కాగా, ముందస్తు బెయిల్ కోసం కార్తీక్- ఆగస్టు 30న సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది.

కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆర్‌టీ నగర్ పీఎస్‌లో మైత్రేయి ఫిర్యాదు చేసింది. అయితే మైత్రేయితో పదేళ్ల క్రితమే తనకు పెళ్లైందని కన్నడ సినీ దర్శకుడు రిషి మైత్రేయిపై ఇక్కడి 8వ ఏసీఎఎం కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేయడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. రిషితో తనకు పెళ్లికాలేదని మైత్రేయి స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement