కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత 'డీవీ సదానంద గౌడ'కు బెగళూరు నార్త్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది పార్టీ . దీంతో ఈయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తనను పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
తన స్థానంలో మరొకరికి టికెట్ ఇవ్వడం వల్ల కలత చెందినట్లు పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ తనను సంప్రదించే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తన మద్దతు మోదీకి ఉంటుందని, మళ్ళీ ఆయన ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లు సదానంద గౌడ వెల్లడించారు.
సదానంద గౌడ.. 2004 నుంచి 2019 వరకు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఆ తరువాత ఆగస్టు 2011 నుంచి మే 2013 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఈయన మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం తనకు పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఈయన ఇక రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా? అని పలువురు భావిస్తున్నారు.
BJP leader and former Karnataka CM D.V. Sadananda Gowda holds a press conference in Bengaluru, he says, "I am upset with BJP as the election ticket (from Bangalore North seat) has been given to someone else in my place. Yes, I was invited to join the Congress party, but I will… pic.twitter.com/uhs9fRa6wQ
— ANI (@ANI) March 21, 2024
Comments
Please login to add a commentAdd a comment