'కార్తీక్' అత్యాచార ఆరోపణలపై సదానంద స్పందన! | Law will take its course: Sandananda Gowda on son absconding in rape case | Sakshi
Sakshi News home page

'కార్తీక్' అత్యాచార ఆరోపణలపై సదానంద స్పందన!

Published Mon, Sep 8 2014 3:36 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

'కార్తీక్' అత్యాచార ఆరోపణలపై సదానంద స్పందన! - Sakshi

'కార్తీక్' అత్యాచార ఆరోపణలపై సదానంద స్పందన!

న్యూఢిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడి కేసుపై రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ స్పందించారు. బీజేపీ వంద రోజుల పాలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో సదానంద గౌడ మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని వ్యాఖ్యలు చేశారు. 
 
ఇప్పటికే ఈ వ్యవహారంపై మీడియాతో పలుసార్లు మాట్లాడాను.. చట్టాలున్నాయని.. అవి వాటి పని చేసుకుపోతాయి. అంతకంటే ఎక్కువగా మాట్లాడేది ఏమిలేదు అని అన్నారు. 
 
పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసగించారని, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై కన్నడ నటి మైత్రేయి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వారెంట్ జారీ చేసినప్పటి నుంచి కార్తీక్ గౌడ్ కనిపించకుండా పోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement