కేంద్రమంత్రి సదానంద కుమారుడికి ఊరట!
బెంగళూరు: కేంద్రమంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌గౌడకు ఊరట లభించింది. అత్యాచారం, చీటింగ్ కేసులో కార్తీక్ గౌడకు బెంగుళూరు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కార్తీక్ తనను అపహరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ నటి మైత్రేయి ఇక్కడి ఆర్‌టీ నగర పోలీస్ స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడపై స్థానిక కోర్టు అరెస్టు వారెంట్‌తో పాటు లుక్ ఔట్ నోటీసు (కనిపిస్తే పట్టివ్వాలని ఆదేశం) జారీ చేసింది.