న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ వైఫై సౌకర్యాన్ని రైల్వే మంత్రి సదానంద గౌడ ఇటీవలే ప్రారంభించారు. ప్రయాణికులకు హైస్పీడ్ ఇంటర్‌నెట్‌ను అందించేందుకు కల్పిస్తున్న ఈ వైఫై సౌకర్యాన్ని మొబైల్‌ఫోన్లలో తొలి అరగంట పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత అరగంటకు రూ.25, గంటకు రూ.35 రుసుము వసూలు చేస్తారు. ఇందుకోసం స్టేషన్‌లోని వైఫై హెల్ప్‌డెస్క్‌నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.