High-speed Internet
-
భారత్‌లో 5జీ శకం
న్యూఢిల్లీ: అత్యంత హై–స్పీడ్ ఇంటర్నెట్ సేవలకు చిరునామాగా మారనున్న ఐదోతరం(5జీ) టెలీ సేవలు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. టెలీ సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు, టెలీ వాణిజ్యరంగంలో అనంతమైన అవకాశాలకు నాంది పలికామని 5జీ సేవల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రకటించారు. 5జీ టెలిఫొనీ సర్వీస్‌ల శ్రీకారానికి శనివారం ఢిల్లీలో ఆరో ‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ కార్యక్రమం వేదికైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘టెలికం పరిశ్రమ.. దేశ ప్రజలకు 5జీ రూపంలో కొత్త బహుమతిని తీసుకొచ్చింది. దేశంలోని వందల కోట్ల డివైజ్‌ల మధ్య 4జీని మించిన వేగంతో అనుసంధానానికి 5జీ బాటలు పరిచింది. దీంతో వైద్యం, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యంకానున్నాయి. జియో 5జీ సేవలు 2023 డిసెంబర్‌కల్లా , ఎయిర్టెల్ 5జీ 2024 మార్చికల్లా మొత్తం భారతావనికి అందుబాటులోకి రానున్నాయి. గతంలో 2జీ, 3జీ, 4జీ సేవల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్... నేడు దేశీయ టెక్నాలజీతో విదేశాలు విస్తుపోయేలా 5జీలో సత్తా చాటింది. 5జీ ఒక కొత్త శకానికి నాంది. టెలీ వాణిజ్యంలో అపార వ్యాపార అవకాశాల గని మన ముందుకొచ్చింది’ అని మోదీ అన్నారు. డిజిటల్ భారత్‌కు మూలస్తంభాలు ‘5జీతో దేశం తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంది. డిజిటల్ ఉపకరణాల ధర, కనెక్టివిటీ, డేటా ఖర్చు, డిజిటల్ దిశగా ముందడుగు–– ఇవే డిజిటల్ భారత్‌కు నాలుగు మూలస్తంభాలు. డిజిటల్ ఇండియా పేరుకే ప్రభుత్వ పథకం. వాస్తవానికి ఈ పథకం లక్ష్యం.. సామాన్యునికి మెరుగైన సేవలు అందించడం. ప్రభుత్వ చొరవతోనే ఎనిమిదేళ్ల క్రితం కేవలం రెండు ఉన్న మొబైల్ తయారీయూనిట్లు నేడు 200కుపైగా పెరిగాయి. డేటా చార్జీలనూ నేలకు దించాం. 2014లో 1 జీబీ డేటాకు రూ.300 ఖర్చయ్యేది. ఇప్పుడు కేవలం రూ.10 అవుతోంది’ అని మోదీ అన్నారు. 5జీని బీజేపీ సర్కార్ ఘనతగా పేర్కొంటూ.. గత యూపీఏ హయాం నాటి 2జీ స్పెక్టమ్ స్కామ్‌ను ప్రధాని ప్రస్తావించారు. ‘2జీకి 5జీకి తేడా ఇదే’ అని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలో రెండో అతిపెద్ద టెలి కమ్యూనికేషన్స్ సర్వీసెస్ సంస్థ అయిన భారతీ ఎయిర్టెల్ శనివారం తన 5జీ సేవలను ఈ కార్యక్రమంలో ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, వారణాసి, బెంగళూరుసహా ఎనిమిది నగరాల్లో ఈ సేవలు మొదలయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో టాపర్ అయిన రిలయన్స్ జియో ఈ నెలలోనే 4 మెట్రో నగరాల్లో తన 5జీ సేవలు మొదలుపెట్టనుంది. మరో ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా తన సేవల ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. భిన్న రంగాల్లో 5జీ సేవల ఉపయోగాన్ని ఈ మూడు టెలీ కమ్యూనికేషన్స్ సంస్థలు ‘మొబైల్ కాంగ్రెస్’లో ప్రదర్శించాయి. అగ్యుమెంట్ రియాలిటీ(ఏఆర్) డివైజ్ లేకుండానే ఎగ్యుమెంట్ రియాలిటీని స్కీన్‌పై చూస్తూ 3 వేర్వేరు ప్రాంతాల పాఠశాల విద్యార్థులతో మోదీ మాట్లాడారు. స్వీడన్‌లోని కారును ఢిల్లీ నుంచే నడిపారు ఆరో ‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ వేదికపై 5జీ టెక్నాలజీని ప్రధాని మోదీ పరీక్షించారు. 5జీ లింక్ ద్వారా స్వీడన్‌లోని కారును ఢిల్లీలోని ఎరిక్సన్ మొబైల్ బూత్ నుంచే ప్రధాని మోదీ టెస్ట్‌డ్రైవ్ చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది మార్చికల్లా అన్ని నగరాల్లో ఎయిర్టెల్ 5జీ : మిట్టల్ ‘మార్చి, 2023కల్లా అన్ని నగరాల్లో ఎయిర్టెల్ 5జీ అందుబాటులో ఉంటుంది. సాంకేతికత ప్రాధాన్యతపై ప్రధాని మరింత దృష్టిసారించారు. ఆయనే దేశ పురోభివృద్ధితో టెక్నాలజీని అనుసంధానించారు. 5జీ సాయంతో దేశంలో కొత్తగా వందలాది పటిష్టమైన అంకుర సంస్థలు ఉద్భవిస్తాయి’ అని ప్రారంభకార్యక్రమంలో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అన్నారు. ప్రస్తుతం 4జీ టారిఫ్‌లోనే 5జీ ఇస్తారని, త్వరలో 5జీ కొత్త టారిఫ్ వస్తుందని ఎయిర్టెల్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గ్రామీణ భారతంలో విస్తరిస్తాం: బిర్లా ‘మా కస్టమర్ బేస్ ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవల విస్తృతిపై దృష్టిపెడతాం. కస్టమర్లు, టెక్నాలజీ భాగస్వాములతో మా 5జీ యాత్ర త్వరలోనే మొదలవుతుంది’ అని వొడాఫోన్ ఐడియా అధిపతి, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. అయితే, 5జీ సేవలు ఏ తేదీన మొదలుపెడతారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో 5జీ సేవలను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ 2023 డిసెంబర్‌కల్లా దేశమంతా: ముకేశ్ అంబానీ వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా దేశమంతటికీ 5జీ సేవలను విస్తరిస్తామని రిలయన్స్ జియో చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పారు. ‘దేశీయంగా ప్రతీ రంగంలో 5జీ సేవలతో కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అందుబాటులోకి తెస్తే భారత్ ప్రపంచ మేధో రాజధానిగా మారనుంది. భారీ జనాభాకు విస్తృత డిజిటల్ టెక్నాలజీ తోడైతే 2047కల్లా 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించే వీలుంది’ అని అంబానీ ఆశాభావం వ్యక్తంచేశారు. జియో ట్రూ5జీ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఒడిశాలోని రాష్ట్రపతి ముర్ము స్థాపించిన ఓ పాఠశాల విద్యార్థులతో మోదీ లైవ్‌స్ట్రీమింగ్‌లో మాట్లాడారు. -
ఇంటర్నెట్ చుట్టూ రిలయన్స్ పందెం!!
ఫైబర్ టు హోమ్ నుంచి జియో మనీ దాకా... ♦ మూవీస్, టీవీ, మ్యూజిక్, గాడ్జెట్స్ ఇంకా చాలా ♦ జియో కేంద్రంగా ఆర్ఐఎల్ రకరకాల వ్యాపారాలు అన్నీ అనుకున్నట్లు జరిగితే ఊహించనంత విలువ ♦ కాకపోతే ఆయా రంగాల్లో ఇప్పటికే పలువురు లీడర్లు ఆయా సంస్థలన్నిటికీ విదేశీ నిధుల మద్దతు ♦ వాటన్నిటినీ అధిగమిస్తేనే జియో వ్యాపారాల విజయం!! విజయం సాధించకపోతే మాత్రం భారీ ప్రతికూల ప్రభావం మంథా రమణమూర్తి బహుశా! అన్నీ అనుకున్నట్లు జరిగితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాస్తా ‘రిలయన్స ఇంటర్నెట్ లిమిటెడ్’గా మారుతుందేమో!! ఎందుకంటే ముంబైలోని తన కార్పొరేట్ సామ్రాజ్యం ‘ఆర్సిటీ’లో దాదాపు ఐదువేల చదరపుటడుగుల్లో అదొక ఎక్స్పీరియెన్స జోన్‌ను సృష్టించింది. ఆ గదిలో సాధ్యం చేసిన హైస్పీడ్ ఇంటర్నెట్.. అక్కడ ప్రదర్శించిన అత్యాధునిక గాడ్జెట్లు.. నవతరం వ్యాపారాలైన ఇంటర్నెట్ టీవీ, సినిమాలు, మ్యూజిక్, హెల్త్, ఎడ్యుకేషన్, మనీ వాలెట్... ఇలా ఆ గదిలో చూపించినవన్నీ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నారుు. అవన్నీ దేశవ్యాప్తంగా విస్తరించి.. అన్నిటా ముందుంటే... అపుడు ఇంటర్నెట్ వ్యాపారంపై రిలయన్స ఏకచ్ఛత్రాధిపత్యం కూడా సాధ్యమే. కాకపోతే ఇవన్నీ జరగటం అంత తేలిక్కాదు. ఎందుకంటే పైన చెప్పిన ప్రతి రంగంలోనూ అగ్రశ్రేణి కంపెనీలే లీడర్లుగా ఉన్నారుు. వాటికి నిధుల బలం కూడా ఉంది. వాటన్నిటినీ తోసిరాజని... అన్ని రంగాల్లోనూ లీడర్‌గా ఎదిగి తేనే ఆర్ఐఎల్ పెడుతున్న భారీ పెట్టుబడికి లాభా లొస్తారుు!!. ఆ వ్యూహాలపై ప్రత్యేక కథనమిది.. మూడు నెలల పాటు అపరిమిత 4జీ ఇంటర్నెట్, అపరిమిత కాల్స్... అన్నీ ఉచితం!! అంటూ రిలయన్స జియో రంగప్రవేశం చేయటం టెలికం రంగంలో సంచలనమే. మిగిలిన టెలికామ్ ఆపరేటర్లంతా భయపడ్డారు. ఛార్జీలు తగ్గించారు. ప్లాన్లు మార్చుకున్నారు. ఊహించినట్లే జియో సిమ్ల కోసం జనం ఎగబడ్డారు. జియో కూడా ఇళ్లకు వెళ్లి ఉచితంగా సిమ్లివ్వటం మొదలు పెట్టింది. ఇంతాచేస్తే... అదీ ఉచితంగా ఇస్తే ప్రస్తుతానికి వినియోగదారుల సంఖ్య 5 కోట్లు దాటింది. కానీ ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎరుుర్‌టెల్‌కు ఇప్పటికీ 26 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. పెపైచ్చు ఉచితంగా ఇవ్వటం వల్లో ఏమో!! రిలయన్స సిమ్‌పై ఇంటర్నెట్ వేగం ఆశించిన ంతగా లేదు. 4జీ అని చెప్పినా కొన్ని సందర్భాల్లో 2జీ వేగం కూడా లేదు. ఈ వేగం అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని, స్థానికంగా ఉండే టవర్లు, అక్కడ వాడుతున్న జనం సంఖ్య ఇవన్నీ చూడాల్సి ఉంటుందన్నది రిలయన్స అధికారుల మాట. కాకపోతే కస్టమర్లకు ఇవేవీ అక్కర్లేదన్న విషయం వారికి తెలియంది కాదు. వేగం ఉంటే తను దీన్ని ఉపయోగిస్తాడు. లేదంటే వేరే సిమ్ చూసుకుంటాడు. అరుుతే ఒకసారి పెరుుడ్ కస్టమర్లు ఎంత మందనేది తెలిస్తే అపుడు సర్వీసుల్లో నాణ్యత పెరు గుతుందని, రానురాను తమ నెట్వర్క్ మరింత మెరుగ్గా తయారవుతోందని ఆర్‌జియో చెబుతోంది. దీన్నిబట్టి చూస్తే ఫలితానికి మరో మూడునాలుగు నెలలు ఆగాల్సి ఉంది. నెట్ వేదికగా విభిన్నమైన వ్యాపారాల్లోకి.. ఆర్ఐఎల్కు ఇపుడు దేశవ్యాప్తంగా 4జీ ఇంటర్నెట్ సేవలందించే లెసైన్సుంది. అది చూసుకునే టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇపుడు ఇం టింటికీ ఫైబర్‌నెట్ అందించేలా ‘ఫైబర్ టు హోమ్’ సేవల్ని పరీక్షిస్తోంది. ఇప్పటికే దేశంలోని ఆరు నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ఆరంభించినట్లు రిలయన్స ప్రతినిధి చెప్పారు. వీటిలో హైదరాబాద్ కూడా ఉంది. అత్యంత వేగ వంతమైన ఇంటర్నెట్ను దీనిద్వారా అందించగలుగుతామన్నది జియో ఎక్స్పీరియెన్స జోన్ హెడ్ సందీప్ గర్వాల్ మాట. నెట్ ఎలాగూ ఇస్తారు కనక... దాని ఆధారంగా పలు సినిమాల్ని, ఆన్‌డిమాండ్ మూవీలను కూడా అందించటానికి జియో మూవీస్ ఆరంభమవుతోంది. దాన్ని రిలయన్స ప్రస్తుతం ఇండియన్ నెట్‌ఫ్లిక్స్‌గా అభివర్ణిస్తోంది. దీంతో పాటు వందల చానళ్లను ఇంటర్నెట్ ద్వారా అందించే జియో టీవీ, మ్యూజిక్ కోసం జియో మ్యూజిక్, జియో హెల్త్, జియో ఎడ్యుకేషన్ ఇలా రకరకాల యాప్‌లను ఆర్ఐఎల్ అభివృద్ధి చేస్తోంది. వీటన్నిటితో పాటు తనకు పేమెంట్ బ్యాంక్ లెసైన్‌స వచ్చింది కాబట్టి జియో మనీ వాలెట్‌నూ అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ప్రస్తుతం కొన్ని అందుబాటులో ఉన్నారుు కూడా. ఇవన్నీ కాకుండా... సిమ్ ద్వారా పనిచేసే పలు ఇం టర్నెట్ ఆఫ్ థింగ్స (ఐఓటీ) అత్యాధునిక గాడ్జెట్లను కూడా జియో రూపొందిస్తోంది. కార్లను ఫోన్ ద్వారానే నియంత్రించటం, వీడియో డోర్ కాలింగ్, మ్యాజిక్ రిమోట్ వంటివి జస్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ జీవితాన్నింకా తేలిక చేస్తాయని సంస్థ చెబుతోంది. మున్ముందు వీటిలో చాలా సేవలు సబ్స్క్రిప్షన్ ఉన్నవారికే అందిస్తారు. కొన్ని ఉచితంగా ఇచ్చినా... వాటికి డేటా వినియోగం జరుగుతుంది కనక ఆ రకంగానైనా లబ్ధి పొందవచ్చన్నది సంస్థ వ్యూహం. నిజమే!! ఇవన్నీ సఫలమైతే రిలయన్స ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. కొన్ని సఫలమైనా... విలువ విపరీతంగా పెరుగుతుంది. ఆ రంగాలన్నిట్లో లీడర్లు... ఇక జియో పేరిట రిలయన్స అడుగుపెడుతున్న రంగాలనే చూస్తే... టెలికంలో ఇప్పటికే ఎరుుర్‌టెల్, వొడాఫోన్, ఐడియా చాలా పటిష్ఠంగా ఉన్నారుు. అరుుతే ఇది ఆన్లైన్ వ్యాపారం కాదు కనక జియోకూ కాస్త చోటుంటుంది. జియో మూవీస్‌ను ఇండియన్ నెట్‌ఫ్లిక్స్‌గా అభివర్ణిస్తోంది. కాకపోతే నెట్‌ఫ్లిక్సే ఇండియాలోకి నేరుగా అడుగుపెట్టేసింది. ప్రస్తుతం పరిమిత సేవలందిస్తున్నా... ఇంకా ప్రచారం, విస్తరణపై ఈ సంస్థ పెద్దగా దృష్టిపెట్టినట్లు లేదు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.3.4 లక్షల కోట్లు. ఇది మొత్తం రిలయన్స ఇండస్ట్రీస్ విలువకన్నా (3.24 లక్షల కోట్లు) ఎక్కువ. దేశంలో సినిమాలకు సంబంధించి ప్రస్తుతం లీడర్ ‘హాట్‌స్టార్’. స్టార్ టీవీ నెట్‌వర్క్‌కు సొంతమైన పలు భాషల సినిమాలన్నీ ఉండటం ఈ యాప్ బలం. ఇక స్పూల్, వూట్, హూక్ వంటి యాప్‌లూ తమ సత్తా చూపిస్తున్నారుు. మరి నెట్‌ఫ్లిక్స్, హాట్స్టార్లను మించిన కంటెంట్‌ను జియో ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేని పక్షంలో ఈ యాప్‌ను ఎవరైనా ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారు? ఫైబర్ టు హోమ్‌లోనూ స్థానిక లీడర్లు!! ఇక ఫైబర్ టు హోమ్ విషయానికొస్తే ఎరుుర్‌టెల్ వంటి దిగ్గజాలు సైతం స్థానిక బ్రాండ్లను తట్టుకోలేకపోయారుు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో బీమ్ టెలీ క్రియాశీలకంగా ఉంది. ప్రస్తుతం ఇది యాక్ట్ కార్ప్‌గా మారింది. హయారుు, హాత్వే, యు బ్రాడ్‌బ్యాండ్, డెన్ బూమ్బ్యాండ్, స్పెక్ట్రానెట్, ఏసియా నెట్, జెట్‌స్పాట్ ఫైబర్, ఎరుుర్‌టెల్ వంటివి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ హవా కొనసాగిస్తున్నారుు. అన్నిచోట్లా జియో విస్తరించాలంటే వీటి పోటీని తట్టుకోవాలి. సేవల్లో, వేగంలో, ధరలో వీటిని మించిపోవాలి. సవాళ్లు ఎక్కువే... టెలికామ్, రిటైల్, తయారీ తదితర రంగాల సంగతి వేరు. వాటిలో ఎక్కువ మంది ప్లేయర్లకు అవకాశముంటుంది. మొదటి స్థానం కాకపోతే ఏ పదో స్థానంలో ఉన్నా... పరిమితంగానైనా ఎవరి లాభాలు వారికి వస్తుంటారుు. ఒకవేళ లాభాలు రాని పరిస్థితి ఉన్నా... అప్పటిదాకా పెట్టిన పెట్టుబడితో బోలెడన్ని ఆస్తులు ఏర్పడతారుు. మొత్తమ్మీద సదరు కంపెనీకి విలువంటూ ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే ఆన్లైన్ వ్యాపారాల్లో పరిస్థితి అలా ఉండదు. ఇక్కడ లీడర్‌కు... వినూత్న ఉత్పత్తులందించే మరికొందరికి మాత్రమే స్థానం ఉంటుంది. మిగిలిన వారి పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఒకవేళ విఫలం కావటమంటూ జరిగితే... మొత్తం పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు కిందే లెక్క. ఉదాహరణకు ఆన్లైన్ ఈ-కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లీడర్లుగా ఉన్నారుు. ఎవరికై నా ఏ వస్తువైనా కావాలనుకుంటే ఈ రెండే వెతుకుతారు. ఇక్కడ లేకపోతేనే వేరే సైట్కెళతారు. నిజానికి కొన్ని ప్రత్యేక ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ దొరకవు. అలాంటి ప్రత్యేక ఉత్పత్తులమ్మే వేరే సంస్థలకు ఆ-కామర్స్‌లో చోటుంటుంది. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్టులు విక్రరుుంచే ఉత్పత్తుల్నే... వేరే కంపెనీలు విక్రరుుస్తే జనం అటు వెళ్లటం కాస్త కష్టం. పెపైచ్చు ధరలో కూడా వీటితో పోటీ పడే పరిస్థితి ఉండదు. టీవీ, మ్యూజిక్, గాడ్జెట్స్ అన్నిటా.. గాడ్జెట్ విషయానికొస్తే చైనా దిగుమతులు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నారుు. అక్కడి వెబ్సైట్లలోనే నేరుగా కొనుక్కునే అవకాశమూ ఉంది. తెచ్చి ఇక్కడ అమ్మేవారూ ఉన్నారు. ఒకరకంగా రిలయన్స అరుునా కొన్ని గాడ్జెట్లు అక్కడి నుంచి తెప్పించాల్సిందే. ఇక ఇంటర్నెట్ టీవీకి వచ్చేసరికి యప్ టీవీ, హెలో టీవీ, మొబి టీవీ, హాట్‌స్టార్ ఇలా చాలానే ఉన్నారుు. యప్ టీవీ ఇప్పటికే రూ.400 కోట్ల వరకూ నిధుల్ని కూడా సమీకరించింది. మ్యూజిక్ విషయానికొస్తే టెలికం సంస్థ ఎరుుర్‌టెల్‌కు చెందిన వింక్, గానా, సావన్ వంటివి సంగీత ప్రియుల మొబైళ్లలో పాతుకుపోరుు ఉన్నారుు. కావలసిన ప్రతి పాటా దొరకటం, సబ్స్క్రిప్షన్ ధర తక్కువ ఉండటం లేక ఉచితంగా ఇవ్వటం... సంగీతంలో నాణ్యత ఇవే కస్టమర్ల కొలమానాలు. వీటన్నిటినీ సాధించి జియో తన కస్టమర్లను మెప్పించగిలితే... ఇంటర్నెట్కు సంబంధించిన ప్రతి ఒక్క విభాగం భారీ కంపెనీగా మారుతుంది. ఆర్ఐఎల్ అంటే... సిసలైన రిలయన్స ఇంటర్నెట్ లిమిటెడ్‌గా పిలుచుకునే అవకాశమొస్తుంది. పేటీఎంతో పోటీ పడగలరా? వాలెట్ల విషయానికొస్తే ఇపుడు పేటీఎం ఆగ్రగామి. కాకపోతే మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎంపెసా వంటివీ ప్రభావం చూపిస్తున్నారుు. చెల్లింపులకు సంబంధించి కొన్ని యాప్‌లకు కొన్ని సంస్థలతో సంబంధం ఉండటంతో వివిధ యాప్‌ల అవసరం వస్తోంది. కానీ మున్ముందు ప్రతి సంస్థతోనూ ప్రతి వాలెట్ ఒప్పందం చేసుకునే అవకాశముంది. అదే జరిగితే ఒక్క వాలెట్ చాలు. అన్నీ డౌన్లోడ్ చేసుకుని ఫోన్‌ను నింపేయాలని, అన్నింటా డబ్బులు డిపాజిట్ చేసి వృథాగా పడేయాలని ఎవ్వరూ అనుకోరు. అప్పుడు ఎవరు తక్కువ ఛార్జీలకు ఎక్కువ సేవలందిస్తే ఆ యాప్‌నే ఆదరిస్తారు. జియో మనీకి వివిధ మెట్రో స్టేషన్లతో టిక్కెట్ల ఛార్జీలు చెల్లించేందుకు చేసుకున్న ఒప్పందం కొంత కలిసి రావచ్చు. అరుుతే పేటీఎం ఇప్పటికే రూ.5వేల కోట్ల నిధులను సమీకరించింది. దాని విలువ దాదాపు రూ.35,000 కోట్లు. చైనా దిగ్గజం అలీబాబా మద్దతున్న ఈ కంపెనీని అధిగమించటం అంత సులువు కాదు. ఇక మొబిక్విక్, ఫ్రీచార్జ్ వంటి యాప్‌లతో పాటు ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎంపెసా వంటి వాలెట్ల నుంచీ పోటీ తీవ్రంగానే ఉంటుంది. -
హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం..చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్
అట్లాంటిక్ సముద్రంలో 6,600 కి.మీ. కేబుల్ ఏర్పాటుకు ప్రయత్నం శాన్ఫ్రాన్సిస్కో: హై-స్పీడ్ ఇంటర్నెట్ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు రెండూ చేతులు కలిపాయి. అట్లాంటిక్ సముద్రం అడుగున కేబుల్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఒకే వేదికపైకి వచ్చాయి. హై-స్పీడ్ ఇంటర్నెట్, క్లౌడ్ సేవల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, దాన్ని అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇరు కంపెనీలు 6,600 కిలోమీటర్ల మేర కేబుల్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీనికి ‘మరియా’ అని నామకరణం చేశాయి. దీని సామర్థ్యం 160 టీబీపీఎస్‌గా ఉంటుందని అంచనా. దీంతో అట్లాంటిక్ సముద్రంలో నిర్మితమౌతున్న అత్యధిక సామర్థ్యం ఉన్న కేబుల్‌గా మరియా అవతరించనున్నది. అలాగే అమెరికా, యూరప్‌ను కలుపుతూ ఏర్పాటవుతోన్న తొలి కేబుల్ కూడా ఇదే. కేబుల్ ఏర్పాటు వర్జీనియా బీచ్ (అమెరికా) నుంచి బిల్బావు (స్పెయిన్) వరకు జరగనున్నది. 2017 నాటికి పూర్తి: కేబుల్ నిర్మాణ పనులు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం అవుతాయని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఇక కేబుల్ ఏర్పాటు 2017 అక్టోబర్ నాటికి పూర్తవుతుందని పేర్కొన్నాయి. -
యునినార్ హై స్పీడ్ ఇంటర్నెట్!
- సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యునినార్ కస్టమర్లకు కొద్దిరోజుల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ను అందుబాటులోకి రాబోతోంది. అది కూడా మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరలోనే. ఇందుకు నెట్‌వర్క్‌ను పూర్తిగా నూతన టెక్నాలజీతో ఆధునీకరిస్తున్నామని, తమ ప్రమోటర్ సంస్థ టెలినార్ గ్రూప్ చైనా టెక్నాలజీ దిగ్గజం హువావె టెక్నాలజీస్‌తో చేతులు కలిపిందని యునినార్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ.1,300 కోట్లకు పైమాటే. యునినార్ సేవలందిస్తున్న ఆరు సర్కిల్స్‌లో 2017 చివరినాటికి 24,000 సైట్స్‌లో టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేస్తామని, సాఫ్ట్‌వేర్‌ను జోడించడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ ఆఫర్ చేసేందుకు ఈ టెక్నాలజీతో వీలవుతుందని యునినార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ తెలియజేశారు. మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... మార్కెట్ డిమాండ్ ను బట్టి ఎంతైనా స్పీడ్‌ను అందిస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకల్లా 5,000 సైట్స్ ఆధునీకరణ పూర్తి అవుతుంది. సబ్సే సస్తా కొనసాగిస్తాం.. ‘‘దేశవ్యాప్తంగా యునినార్ చందాదారుల సంఖ ్య 4.8 కోట్లుంది. ఇందులో 24 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ కస్టమర్లు ప్రతినెల 3-4 శాతం పెరుగుతున్నారు. 1 జీబీ డేటాను రూ.100 లోపే అందిస్తున్నాం. కొత్త టెక్నాలజీతో వ్యయాలు గణనీయంగా తగ్గుతాయి’’ అని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ హెడ్ అనురాగ్ ప్రసాద్ తెలిపారు. 2017 నాటికి ఇంటర్నెట్ చందాదారుల సంఖ్యను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. కాగా కంపెనీ కాల్ సెంటర్‌కు కాల్ డ్రాప్స్ ఫిర్యాదులు లేవని శ్రీనాథ్ తెలిపారు. -
తొలి వైఫై రైల్వే స్టేషన్‌గా బెంగళూరు సిటీ స్టేషన్
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ వైఫై సౌకర్యాన్ని రైల్వే మంత్రి సదానంద గౌడ ఇటీవలే ప్రారంభించారు. ప్రయాణికులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు కల్పిస్తున్న ఈ వైఫై సౌకర్యాన్ని మొబైల్ఫోన్లలో తొలి అరగంట పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత అరగంటకు రూ.25, గంటకు రూ.35 రుసుము వసూలు చేస్తారు. ఇందుకోసం స్టేషన్‌లోని వైఫై హెల్ప్డెస్క్నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
‘హైస్పీడ్’ ఎఫెక్ట్!
విజయనగరం టౌన్: హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం వల్ల రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలలో ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. సాధారణం గా దసరా, దీపావళి, శబరిమలై యాత్రకు సంబంధించి ఈ సమయూనికి అధిక సంఖ్యలో ప్రయాణికులు రిజర్వేషన్ కౌటంర్ల వద్ద క్యూ కట్టేవారు. ప్రయూణికులతో రిజ్వరేషన్ కౌంటర్లు కిటకిటలాడేవి. కానీ ప్రస్తుతం కౌంటర్ల వద్ద పట్టుమని పది మంది కూడా ఉండడం లేదు. ఇందుకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయమే కారణం. దీన్ని నెట్ సెంటర్లకు అప్పగించడం వల్ల రైల్వే ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోయింది. రైల్వే ఆన్లైన్ వ్యవస్థ పోగ్రా మింగ్పై నడుస్తోంది. దీని వల్ల ప్రయూణికులు నెట్ సెంటర్లో కూర్చొని తనకు కావాల్సిన బెర్తులు, ఇతర తేదీల్లో ప్రయాణాలు వెంట వెంటనే చెక్ చేసుకుని, కావాల్సిన టికెట్లు తీసుకోవచ్చు. రిజర్వేషన్ కన్ఫర్మ్ కాకపోతే తన సొమ్ము మళ్లీ ఖాతాలోకి జమ అవుతుంది. అరుుతే ఈ విధానం అం దుబాటులోకి వచ్చిన తరువాత రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ఆదాయం పూర్తిగా తగ్గిపోరుుంది. ఈ ఏడాదిలో ఏప్రిల్ నెలలో రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా రూ. 1. 30 కోట్ల ఆదాయం రాగా ఆగస్టు నెలలో కేవలం రూ. 89 లక్షలు మాత్రమే వచ్చింది. తగ్గిపోయిన తత్కాల్ సేవలు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మూడు నెలలుగా తత్కాల్ సేవలు కూడా తగ్గుముఖం పట్టాయి. నెట్ సెంటర్లో కూర్చొని ఆన్లైన్లో సమాచారాన్ని ముందుగానే ఫీడ్ చేసుకుని తత్కాల్ సమయానికి కేవలం కంప్యూటర్‌పై ఉన్న ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. అదే రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో ఉన్న ఆన్లైన్ వ్యవస్థలో అయితే తత్కాల్ ఆన్లైన్ ప్రారంభమైన తరు వాత మొత్తం ప్రాథమిక సమాచారాన్ని ఫీడ్ చేయాలి. అలా చేసిన తర్వాతే టికెట్ కన్ఫర్మేషన్ చేయాలి. మొత్తం ఈ ప్రొసెస్ చేయడానికి 5 నిమి షాల సమయం పడుతుంది. ఈ సమయంలో నెట్ సెంటర్లలో ఒకేసారి తత్కాల్ రిజర్వేషన్లు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లకు వచ్చి టికెట్లు తీసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. రిజర్వేషన్ కౌంటర్లో ఆదాయం వివరాలు (2014-15) ఏప్రిల్ రూ. 1,30,28,528 మే రూ. 1,04,89,137 జూన్ రూ. 86,05,846 జూలై రూ. 99,85,769 ఆగస్టు - రూ. 89,31,100