‘హైస్పీడ్’ ఎఫెక్ట్!
విజయనగరం టౌన్: హైస్పీడ్ ఇంటర్‌నెట్ సదుపాయం వల్ల రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలలో ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. సాధారణం గా దసరా, దీపావళి, శబరిమలై యాత్రకు సంబంధించి ఈ సమయూనికి అధిక సంఖ్యలో ప్రయాణికులు రిజర్వేషన్ కౌటంర్ల వద్ద క్యూ కట్టేవారు. ప్రయూణికులతో రిజ్వరేషన్ కౌంటర్లు కిటకిటలాడేవి. కానీ ప్రస్తుతం కౌంటర్ల వద్ద పట్టుమని పది మంది కూడా ఉండడం లేదు. ఇందుకు హైస్పీడ్ ఇంటర్‌నెట్ సదుపాయమే కారణం.
దీన్ని నెట్ సెంటర్లకు అప్పగించడం వల్ల రైల్వే ఇంటర్‌నెట్ స్పీడ్ తగ్గిపోయింది. రైల్వే ఆన్‌లైన్ వ్యవస్థ పోగ్రా మింగ్‌పై నడుస్తోంది. దీని వల్ల ప్రయూణికులు నెట్ సెంటర్‌లో కూర్చొని తనకు కావాల్సిన బెర్తులు, ఇతర తేదీల్లో ప్రయాణాలు వెంట వెంటనే చెక్ చేసుకుని, కావాల్సిన టికెట్లు తీసుకోవచ్చు. రిజర్వేషన్ కన్‌ఫర్మ్ కాకపోతే తన సొమ్ము మళ్లీ ఖాతాలోకి జమ అవుతుంది. అరుుతే ఈ విధానం అం దుబాటులోకి వచ్చిన తరువాత రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ఆదాయం పూర్తిగా తగ్గిపోరుుంది. ఈ ఏడాదిలో ఏప్రిల్ నెలలో రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా రూ. 1. 30 కోట్ల ఆదాయం రాగా ఆగస్టు నెలలో కేవలం రూ. 89 లక్షలు మాత్రమే వచ్చింది.
తగ్గిపోయిన తత్కాల్ సేవలు
హైస్పీడ్ ఇంటర్‌నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత మూడు నెలలుగా తత్కాల్ సేవలు కూడా తగ్గుముఖం పట్టాయి. నెట్ సెంటర్‌లో కూర్చొని ఆన్‌లైన్‌లో సమాచారాన్ని ముందుగానే ఫీడ్ చేసుకుని తత్కాల్ సమయానికి కేవలం కంప్యూటర్‌పై ఉన్న ఎంటర్ బటన్ ప్రెస్ చేయగానే టికెట్ కన్‌ఫర్మ్ అయిపోతుంది. అదే రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌లో ఉన్న ఆన్‌లైన్ వ్యవస్థలో అయితే తత్కాల్ ఆన్‌లైన్ ప్రారంభమైన తరు వాత మొత్తం ప్రాథమిక సమాచారాన్ని ఫీడ్ చేయాలి. అలా చేసిన తర్వాతే టికెట్ కన్‌ఫర్‌మేషన్ చేయాలి. మొత్తం ఈ ప్రొసెస్ చేయడానికి 5 నిమి షాల సమయం పడుతుంది. ఈ సమయంలో నెట్ సెంటర్లలో ఒకేసారి తత్కాల్ రిజర్వేషన్లు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లకు వచ్చి టికెట్‌లు తీసుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది.
రిజర్వేషన్ కౌంటర్‌లో ఆదాయం
వివరాలు (2014-15)
ఏప్రిల్ రూ. 1,30,28,528
మే రూ. 1,04,89,137
జూన్ రూ. 86,05,846
జూలై రూ. 99,85,769
ఆగస్టు - రూ. 89,31,100