ఇంటర్నెట్ చుట్టూ రిలయన్స్ పందెం!! | reliance jio special story from business desk | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్ చుట్టూ రిలయన్స్ పందెం!!

Published Thu, Nov 24 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

ఇంటర్నెట్ చుట్టూ రిలయన్స్ పందెం!!

ఇంటర్నెట్ చుట్టూ రిలయన్స్ పందెం!!

ఫైబర్ టు హోమ్ నుంచి జియో మనీ దాకా...
మూవీస్, టీవీ, మ్యూజిక్, గాడ్జెట్స్ ఇంకా చాలా 
జియో కేంద్రంగా ఆర్‌ఐఎల్ రకరకాల వ్యాపారాలు అన్నీ అనుకున్నట్లు జరిగితే ఊహించనంత విలువ   
కాకపోతే ఆయా రంగాల్లో ఇప్పటికే పలువురు లీడర్లు ఆయా సంస్థలన్నిటికీ విదేశీ నిధుల మద్దతు  
వాటన్నిటినీ అధిగమిస్తేనే జియో వ్యాపారాల విజయం!! విజయం సాధించకపోతే మాత్రం భారీ ప్రతికూల ప్రభావం 

మంథా రమణమూర్తి
బహుశా! అన్నీ అనుకున్నట్లు జరిగితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాస్తా ‘రిలయన్‌‌స ఇంటర్నెట్ లిమిటెడ్’గా మారుతుందేమో!! ఎందుకంటే ముంబైలోని తన కార్పొరేట్ సామ్రాజ్యం ‘ఆర్‌సిటీ’లో దాదాపు ఐదువేల చదరపుటడుగుల్లో అదొక ఎక్స్‌పీరియెన్‌‌స జోన్‌ను సృష్టించింది. ఆ గదిలో సాధ్యం చేసిన హైస్పీడ్ ఇంటర్నెట్.. అక్కడ ప్రదర్శించిన అత్యాధునిక గాడ్జెట్లు.. నవతరం వ్యాపారాలైన ఇంటర్నెట్ టీవీ, సినిమాలు, మ్యూజిక్, హెల్త్, ఎడ్యుకేషన్, మనీ వాలెట్... ఇలా ఆ గదిలో చూపించినవన్నీ ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉన్నారుు. అవన్నీ దేశవ్యాప్తంగా విస్తరించి.. అన్నిటా ముందుంటే... అపుడు ఇంటర్నెట్ వ్యాపారంపై రిలయన్‌‌స ఏకచ్ఛత్రాధిపత్యం కూడా సాధ్యమే. కాకపోతే ఇవన్నీ జరగటం అంత తేలిక్కాదు. ఎందుకంటే పైన చెప్పిన ప్రతి రంగంలోనూ అగ్రశ్రేణి కంపెనీలే లీడర్లుగా ఉన్నారుు. వాటికి నిధుల బలం కూడా ఉంది. వాటన్నిటినీ తోసిరాజని... అన్ని రంగాల్లోనూ లీడర్‌గా ఎదిగి తేనే ఆర్‌ఐఎల్ పెడుతున్న భారీ పెట్టుబడికి లాభా లొస్తారుు!!. ఆ వ్యూహాలపై

 ప్రత్యేక కథనమిది..
మూడు నెలల పాటు అపరిమిత 4జీ ఇంటర్నెట్, అపరిమిత కాల్స్... అన్నీ ఉచితం!! అంటూ రిలయన్‌‌స జియో రంగప్రవేశం చేయటం టెలికం రంగంలో సంచలనమే. మిగిలిన టెలికామ్ ఆపరేటర్లంతా భయపడ్డారు. ఛార్జీలు తగ్గించారు. ప్లాన్లు మార్చుకున్నారు. ఊహించినట్లే జియో సిమ్‌ల కోసం జనం ఎగబడ్డారు. జియో కూడా ఇళ్లకు వెళ్లి ఉచితంగా సిమ్‌లివ్వటం మొదలు పెట్టింది. ఇంతాచేస్తే... అదీ ఉచితంగా ఇస్తే ప్రస్తుతానికి వినియోగదారుల సంఖ్య 5 కోట్లు దాటింది. కానీ ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న ఎరుుర్‌టెల్‌కు ఇప్పటికీ 26 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. పెపైచ్చు ఉచితంగా ఇవ్వటం వల్లో ఏమో!! రిలయన్‌‌స సిమ్‌పై ఇంటర్నెట్ వేగం ఆశించిన ంతగా లేదు. 4జీ అని చెప్పినా కొన్ని సందర్భాల్లో 2జీ వేగం కూడా లేదు.

ఈ వేగం అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని, స్థానికంగా ఉండే టవర్లు, అక్కడ వాడుతున్న జనం సంఖ్య ఇవన్నీ చూడాల్సి ఉంటుందన్నది రిలయన్‌‌స అధికారుల మాట. కాకపోతే కస్టమర్లకు ఇవేవీ అక్కర్లేదన్న విషయం వారికి తెలియంది కాదు. వేగం ఉంటే తను దీన్ని ఉపయోగిస్తాడు. లేదంటే వేరే సిమ్ చూసుకుంటాడు. అరుుతే ఒకసారి పెరుుడ్ కస్టమర్లు ఎంత మందనేది తెలిస్తే అపుడు సర్వీసుల్లో నాణ్యత పెరు

గుతుందని, రానురాను తమ నెట్‌వర్క్ మరింత మెరుగ్గా తయారవుతోందని ఆర్‌జియో చెబుతోంది. దీన్నిబట్టి చూస్తే ఫలితానికి మరో మూడునాలుగు నెలలు ఆగాల్సి ఉంది.

నెట్ వేదికగా విభిన్నమైన వ్యాపారాల్లోకి..
ఆర్‌ఐఎల్‌కు ఇపుడు దేశవ్యాప్తంగా 4జీ ఇంటర్నెట్ సేవలందించే లెసైన్సుంది. అది చూసుకునే టెలికం వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇపుడు ఇం టింటికీ ఫైబర్‌నెట్ అందించేలా ‘ఫైబర్ టు హోమ్’ సేవల్ని పరీక్షిస్తోంది. ఇప్పటికే దేశంలోని ఆరు నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవల్ని ఆరంభించినట్లు రిలయన్‌‌స ప్రతినిధి చెప్పారు. వీటిలో హైదరాబాద్ కూడా ఉంది. అత్యంత వేగ వంతమైన ఇంటర్నెట్‌ను దీనిద్వారా అందించగలుగుతామన్నది జియో ఎక్స్‌పీరియెన్‌‌స జోన్ హెడ్ సందీప్ గర్వాల్ మాట. నెట్ ఎలాగూ ఇస్తారు కనక... దాని ఆధారంగా పలు సినిమాల్ని, ఆన్‌డిమాండ్ మూవీలను కూడా అందించటానికి జియో మూవీస్ ఆరంభమవుతోంది. దాన్ని రిలయన్‌‌స ప్రస్తుతం ఇండియన్ నెట్‌ఫ్లిక్స్‌గా అభివర్ణిస్తోంది.

దీంతో పాటు వందల చానళ్లను ఇంటర్నెట్ ద్వారా అందించే జియో టీవీ, మ్యూజిక్ కోసం జియో మ్యూజిక్, జియో హెల్త్, జియో ఎడ్యుకేషన్ ఇలా రకరకాల యాప్‌లను ఆర్‌ఐఎల్ అభివృద్ధి చేస్తోంది. వీటన్నిటితో పాటు తనకు పేమెంట్ బ్యాంక్ లెసైన్‌‌స వచ్చింది కాబట్టి జియో మనీ వాలెట్‌నూ అందుబాటులోకి తెచ్చింది. వీటిలో ప్రస్తుతం కొన్ని అందుబాటులో ఉన్నారుు కూడా. ఇవన్నీ కాకుండా... సిమ్ ద్వారా పనిచేసే పలు ఇం టర్నెట్ ఆఫ్ థింగ్‌‌స (ఐఓటీ) అత్యాధునిక గాడ్జెట్లను కూడా జియో రూపొందిస్తోంది. కార్లను ఫోన్ ద్వారానే నియంత్రించటం, వీడియో డోర్ కాలింగ్, మ్యాజిక్ రిమోట్ వంటివి జస్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఇవన్నీ జీవితాన్నింకా తేలిక చేస్తాయని సంస్థ చెబుతోంది. మున్ముందు వీటిలో చాలా సేవలు సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికే అందిస్తారు. కొన్ని ఉచితంగా ఇచ్చినా... వాటికి డేటా వినియోగం జరుగుతుంది కనక ఆ రకంగానైనా లబ్ధి పొందవచ్చన్నది సంస్థ వ్యూహం. నిజమే!! ఇవన్నీ సఫలమైతే రిలయన్‌‌స ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. కొన్ని సఫలమైనా... విలువ విపరీతంగా పెరుగుతుంది.

ఆ రంగాలన్నిట్లో లీడర్లు...
ఇక జియో పేరిట రిలయన్‌‌స అడుగుపెడుతున్న రంగాలనే చూస్తే... టెలికంలో ఇప్పటికే ఎరుుర్‌టెల్, వొడాఫోన్, ఐడియా చాలా పటిష్ఠంగా ఉన్నారుు. అరుుతే ఇది ఆన్‌లైన్ వ్యాపారం కాదు కనక జియోకూ కాస్త చోటుంటుంది.

జియో మూవీస్‌ను ఇండియన్ నెట్‌ఫ్లిక్స్‌గా అభివర్ణిస్తోంది. కాకపోతే నెట్‌ఫ్లిక్సే ఇండియాలోకి నేరుగా అడుగుపెట్టేసింది. ప్రస్తుతం పరిమిత సేవలందిస్తున్నా... ఇంకా ప్రచారం, విస్తరణపై ఈ సంస్థ పెద్దగా దృష్టిపెట్టినట్లు లేదు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ విలువ దాదాపు రూ.3.4 లక్షల కోట్లు. ఇది మొత్తం రిలయన్‌‌స ఇండస్ట్రీస్ విలువకన్నా (3.24 లక్షల కోట్లు) ఎక్కువ. దేశంలో సినిమాలకు సంబంధించి ప్రస్తుతం లీడర్ ‘హాట్‌స్టార్’. స్టార్ టీవీ నెట్‌వర్క్‌కు సొంతమైన పలు భాషల సినిమాలన్నీ ఉండటం ఈ యాప్ బలం. ఇక స్పూల్, వూట్, హూక్ వంటి యాప్‌లూ తమ సత్తా చూపిస్తున్నారుు. మరి నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌లను మించిన కంటెంట్‌ను జియో ఇవ్వగలుగుతుందా? ఇవ్వలేని పక్షంలో ఈ యాప్‌ను ఎవరైనా ఎందుకు డౌన్‌లోడ్ చేసుకుంటారు?

ఫైబర్ టు హోమ్‌లోనూ స్థానిక లీడర్లు!!
ఇక ఫైబర్ టు హోమ్ విషయానికొస్తే ఎరుుర్‌టెల్ వంటి దిగ్గజాలు సైతం స్థానిక బ్రాండ్లను తట్టుకోలేకపోయారుు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో బీమ్ టెలీ క్రియాశీలకంగా ఉంది. ప్రస్తుతం ఇది యాక్ట్ కార్ప్‌గా మారింది. హయారుు, హాత్‌వే, యు బ్రాడ్‌బ్యాండ్, డెన్ బూమ్‌బ్యాండ్, స్పెక్ట్రానెట్, ఏసియా నెట్, జెట్‌స్పాట్ ఫైబర్, ఎరుుర్‌టెల్ వంటివి దేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ హవా కొనసాగిస్తున్నారుు. అన్నిచోట్లా జియో విస్తరించాలంటే వీటి పోటీని తట్టుకోవాలి. సేవల్లో, వేగంలో, ధరలో వీటిని మించిపోవాలి.

సవాళ్లు ఎక్కువే...
టెలికామ్, రిటైల్, తయారీ తదితర రంగాల సంగతి వేరు. వాటిలో ఎక్కువ మంది ప్లేయర్లకు అవకాశముంటుంది. మొదటి స్థానం కాకపోతే ఏ పదో స్థానంలో ఉన్నా... పరిమితంగానైనా ఎవరి లాభాలు వారికి వస్తుంటారుు. ఒకవేళ లాభాలు రాని పరిస్థితి ఉన్నా... అప్పటిదాకా పెట్టిన పెట్టుబడితో బోలెడన్ని ఆస్తులు ఏర్పడతారుు. మొత్తమ్మీద సదరు కంపెనీకి విలువంటూ ఉంటుంది. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే ఆన్‌లైన్ వ్యాపారాల్లో పరిస్థితి అలా ఉండదు. ఇక్కడ లీడర్‌కు... వినూత్న ఉత్పత్తులందించే మరికొందరికి మాత్రమే స్థానం ఉంటుంది. మిగిలిన వారి పరిస్థితి ఘోరంగా తయారవుతుంది.

ఒకవేళ విఫలం కావటమంటూ జరిగితే... మొత్తం పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు కిందే లెక్క. ఉదాహరణకు ఆన్‌లైన్ ఈ-కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లీడర్లుగా ఉన్నారుు. ఎవరికై నా ఏ వస్తువైనా కావాలనుకుంటే ఈ రెండే వెతుకుతారు. ఇక్కడ లేకపోతేనే వేరే సైట్‌కెళతారు. నిజానికి కొన్ని ప్రత్యేక ఉత్పత్తులు మాత్రమే ఇక్కడ దొరకవు. అలాంటి ప్రత్యేక ఉత్పత్తులమ్మే వేరే సంస్థలకు ఆ-కామర్స్‌లో చోటుంటుంది. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్టులు విక్రరుుంచే ఉత్పత్తుల్నే... వేరే కంపెనీలు విక్రరుుస్తే జనం అటు వెళ్లటం కాస్త కష్టం. పెపైచ్చు ధరలో కూడా వీటితో పోటీ పడే పరిస్థితి ఉండదు.

టీవీ, మ్యూజిక్, గాడ్జెట్స్ అన్నిటా..
గాడ్జెట్ విషయానికొస్తే చైనా దిగుమతులు ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్నారుు. అక్కడి వెబ్‌సైట్లలోనే నేరుగా కొనుక్కునే అవకాశమూ ఉంది. తెచ్చి ఇక్కడ అమ్మేవారూ ఉన్నారు. ఒకరకంగా రిలయన్‌‌స అరుునా కొన్ని గాడ్జెట్లు అక్కడి నుంచి తెప్పించాల్సిందే. ఇక ఇంటర్నెట్ టీవీకి వచ్చేసరికి యప్ టీవీ, హెలో టీవీ, మొబి టీవీ, హాట్‌స్టార్ ఇలా చాలానే ఉన్నారుు. యప్ టీవీ ఇప్పటికే రూ.400 కోట్ల వరకూ నిధుల్ని కూడా సమీకరించింది. మ్యూజిక్ విషయానికొస్తే టెలికం సంస్థ ఎరుుర్‌టెల్‌కు చెందిన వింక్, గానా, సావన్ వంటివి సంగీత ప్రియుల మొబైళ్లలో పాతుకుపోరుు ఉన్నారుు. కావలసిన ప్రతి పాటా దొరకటం, సబ్‌స్క్రిప్షన్ ధర తక్కువ ఉండటం లేక ఉచితంగా ఇవ్వటం... సంగీతంలో నాణ్యత ఇవే కస్టమర్ల కొలమానాలు. వీటన్నిటినీ సాధించి జియో తన కస్టమర్లను మెప్పించగిలితే... ఇంటర్నెట్‌కు సంబంధించిన ప్రతి ఒక్క విభాగం భారీ కంపెనీగా మారుతుంది. ఆర్‌ఐఎల్ అంటే... సిసలైన రిలయన్‌‌స ఇంటర్నెట్ లిమిటెడ్‌గా పిలుచుకునే అవకాశమొస్తుంది.

పేటీఎంతో పోటీ పడగలరా?
వాలెట్ల విషయానికొస్తే ఇపుడు పేటీఎం ఆగ్రగామి. కాకపోతే మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎంపెసా వంటివీ ప్రభావం చూపిస్తున్నారుు. చెల్లింపులకు సంబంధించి కొన్ని యాప్‌లకు కొన్ని సంస్థలతో సంబంధం ఉండటంతో వివిధ యాప్‌ల అవసరం వస్తోంది. కానీ మున్ముందు ప్రతి సంస్థతోనూ ప్రతి వాలెట్ ఒప్పందం చేసుకునే అవకాశముంది. అదే జరిగితే ఒక్క వాలెట్ చాలు. అన్నీ డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌ను నింపేయాలని, అన్నింటా డబ్బులు డిపాజిట్ చేసి వృథాగా పడేయాలని ఎవ్వరూ అనుకోరు. అప్పుడు ఎవరు తక్కువ ఛార్జీలకు ఎక్కువ సేవలందిస్తే ఆ యాప్‌నే ఆదరిస్తారు.

జియో మనీకి వివిధ మెట్రో స్టేషన్లతో టిక్కెట్ల ఛార్జీలు చెల్లించేందుకు చేసుకున్న ఒప్పందం కొంత కలిసి రావచ్చు. అరుుతే పేటీఎం ఇప్పటికే రూ.5వేల కోట్ల నిధులను సమీకరించింది. దాని విలువ దాదాపు రూ.35,000 కోట్లు. చైనా దిగ్గజం అలీబాబా మద్దతున్న ఈ కంపెనీని అధిగమించటం అంత సులువు కాదు. ఇక మొబిక్విక్, ఫ్రీచార్జ్ వంటి యాప్‌లతో పాటు ఎరుుర్‌టెల్ మనీ, వొడాఫోన్ ఎంపెసా వంటి వాలెట్ల నుంచీ పోటీ తీవ్రంగానే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement