WiFi facility
-
వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!
ఈ ఫొటోలోని ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ పొద్దుపొద్దున్నే చాలా వెరైటీలను అందిస్తుంది. స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్‌తో క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ మేకర్లో పోచ్డ్ ఎగ్స్, గుంత పొంగనాలు, కుడుములు, పాన్ కేక్స్, గ్రిల్ ఐటమ్స్ వంటివి చాలానే రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైస్‌తో పాటు రెండుమూడు రకాల పాన్ ప్లేట్స్ లభిస్తుంటాయి.అవసరాన్ని బట్టి వాటిని మార్చుకుంటూ ఎన్నో వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఒకవైపు గుంతలు, మరోవైపు పాన్ ప్లేట్ లేదా మొత్తం బాల్స్ పాన్, లేదంటే మొత్తం కట్లెట్స్ పాన్.. ఇలా అటాచ్డ్ గ్రిల్ ప్లేట్స్ మెషి¯Œ తో పాటు లభించడంతో దీనిపై వంట సులభమవుతుంది. ఫైర్‌ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ షెల్ హీట్ ఇన్సులేషన్‌తో తయారైన ఈ మేకర్‌ను సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే అటాచ్డ్ పాన్ లేదా గ్రిల్ ప్లేట్స్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.వైఫై ఎనేబుల్డ్ కాఫీ మేకర్..ఈ స్టైలిష్ కాఫీ మేకర్‌తో వివిధ రకాల కాఫీ ప్లేవర్స్ని ఎంజాయ్ చేయవచ్చు. బ్లాక్ కాఫీ, క్యాపుచినో, లాటె, ఎస్ప్రెస్సో, రిస్ట్రెట్టో వంటి చాలా ప్లేవర్స్ ఇందులో రెడీ చేసుకోవచ్చు. అవర్స్, మినిట్స్, పవర్, టెంపరేచర్, మగ్, కప్స్ వంటి ఆప్షన్స్‌తో డివైస్ ముందు వైపు కింద డిస్ ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని వైఫై సాయంతో స్మార్ట్ ఫో¯Œ కి కనెక్ట్ చేసుకుని కూడా సులభంగా వినియోగించుకోవచ్చు.6 అడ్జస్టబుల్ గ్రైండ్ సెట్టింగులతో రూపొందిన ఈ మేకర్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. సర్వ్ చేసుకోవడం తేలిక. అలాగే ఈ డివైస్‌కి ఎడమవైపు వాటర్ ట్యాంక్ ఉంటుంది. దానిలో నీళ్లు నింపుకుని, కుడివైపు పైభాగంలో మూత తీసి.. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ వేసుకుని పవర్ బటన్ నొక్కితే చాలు. టేస్టీ కాఫీ రెడీ అయిపోతుంది. ఇందులో ఒకేసారి నాలుగు నుంచి పది కప్పుల వరకూ కాఫీని రెడీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.హాట్– కోల్డ్ బ్లెండర్..గ్రెయిన్, పేస్ట్, టీ, జ్యూస్, క్లీన్ అనే ఐదు ఆప్షన్స్‌తో రూపొందిన ఈ హాట్– కోల్డ్ బ్లెండర్ వినియోగదారులకు సౌకర్యవంతమైన మిక్సీలా పని చేస్తుంది. దీనిలో నూక, పిండి తయారు చేసుకోవడంతో పాటు జ్యూసులు, మిల్క్ షేక్స్ వంటివి వేగంగా రెడీ చేసుకోవచ్చు. సుమారు 25 నిమిషాల వ్యవధిలో ఫిల్టర్‌తో పని లేకుండా ఒకేసారి 2 కప్పులు సోయా పాలను సిద్ధం చేసుకోవచ్చు.దీనిలో పదునైన మిక్సింగ్ నైవ్స్ బ్లేడ్స్లా ఉంటాయి. ఈ జ్యూసర్లో 12 అవర్స్ ప్రీసెట్ ఆప్ష¯Œ తో పాటు వన్ అవర్ కీప్ వార్మర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఒకరికి లేదా ఇద్దరికి అనువైనది. దీనిలో ఆటోమేటిక్ క్లీనింగ్ ఆప్షన్ ఉండటంతో. దీని వాడకం చాలా తేలికగా ఉంటుంది. పైగా ఇది తక్కువ శబ్దంతో పని చేస్తుంది. -
వైఫై బూత్‌లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: దేశంలో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ)ల ద్వారా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పీఎం–వాణి’గా వ్యవహరించే ఈ పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేజ్... దేశంలో భారీ వైఫై విప్లవానికి తెరతీయనుంది. పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీఓ), పబ్లిక్ డేటా ఆఫీస్ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో ఈ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పనున్నారు. ‘పీడీఓలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు వంటివి ఏవీ వర్తించవు. చిన్న షాపులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల రూపంలో ఈ పీడీఓలు ఉంటాయి’ అని కేబినెట్ సమావేశం అనంతరం టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. ఎలా పనిచేస్తుందంటే... వైఫై యాక్సెస్ పాయింట్ల ఏర్పాటు, నిర్వహణ, అలాగే సబ్స్క్రయిబర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడం వంటివన్నీ పీడీఓ నిర్వర్తిస్తుంది. పీడీఓలకు అగ్రిగేటర్‌గా వ్యవహరించే పీడీఓఏ... పీడీఓలకు అవసరమైన అనుమతులు, అకౌంటింగ్ సంబంధిత అంశాలను చూస్తుంది. యూజర్లు రిజిస్టర్ చేసుకోవడం, దగ్గర్లో ఉన్న ‘వాణి’ సదుపాయం కలిగిన వైఫై హాట్స్పాట్లను గుర్తించి, డిస్ప్లే చేయడం వంటివన్నీ ఉండే విధంగా అప్లికేషన్‌ను యాప్ ప్రొవైడర్లు అభివృద్ధి చేస్తారు. యాప్ ప్రొవైడర్లు, పీడీఓఏలు, పీడీఓల వివరాలను పొందుపరిచేందుకు ఒక కేంద్రీయ రిజిస్ట్రీ ఉంటుంది. ప్రారంభంలో ఈ కేంద్రీయ రిజిస్ట్రీని సీ–డాట్ నిర్వహిస్తుందని అధికారిక ప్రకటన పేర్కొంది. పీడీఓలకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అయితే, పీడీఓఏలు ఇంకా యాప్ డెవలపర్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా, ఎలాంటి ఫీజు లేకుండానే టెలికం శాఖ వద్ద నమోదు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోపు అనుమతి లభిస్తుంది. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మాయమైపోయిన పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లు.. మళ్లీ కొత్త రూట్లో ప్రజల ముందుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. సందు చివర కిరాణా షాపులు, చిన్నా చితకా టీ కొట్లు, పాన్ షాపుల్లో కూడా పబ్లిక్ వైఫై బూత్‌లు త్వరలో దర్శనమివ్వనున్నాయి. గతంలో పబ్లిక్ కాల్ ఆఫీస్ (పీసీఓ) స్థానంలో ఇప్పుడు పబ్లిక్ డేటా ఆఫీస్(పీడీఓ)లు కొలువుదీరనున్నాయి. మొబైల్ డేటాతో పనిలేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు... ఎక్కడ కావాలంటే అక్కడ... ఎంత కావాలంటే అంత డేటాను లోడ్ చేసుకొని, ఎంచక్కా ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టేయొచ్చన్నమాట!! దేశంలో లక్షలాది వైఫై హాట్స్పాట్లను సృష్టించేందుకు ఈ ‘వాణి’ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. కంటెంట్ పంపిణీలో సమానావకాశాలను అందించడంతో పాటు చౌకగా కోట్లాది మందికి బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దీన్ని కనెక్టివిటీ సేవల్లో యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్)గా చెప్పుకోవచ్చు. – ఆర్ఎస్ శర్మ, ట్రాయ్ మాజీ చైర్మన్ లైసెన్స్ రహిత సంస్థలు అట్టడుగు స్థాయిలో వైఫై సేవలను అందించేందుకు వీలు కల్పించే ఈ కీలక చర్యకు మేం ముందునుంచీ మద్దతిస్తున్నాం. దేశంలో బ్రాడ్‌బ్యాండ్ వ్యాప్తికి ఇది ఎంతగానో చేదోడు అందిస్తుంది. ప్రజలను డిజిటల్ పౌరులుగా మార్చేస్తుంది. అదే సమయంలో వ్యాపారాభివృద్ధితో పాటు కిరాణా స్టోర్లు, టీ షాపులు వంటి చిన్న స్థాయి వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. మొత్తంమీద చూస్తే సామాజిక–ఆర్థికాభివృద్ధితో పాటు గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ దీని ద్వారా సాకారమవుతుంది. – టీవీ రామచంద్రన్, బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ప్రెసిడెంట్ కొత్త కొలువులు పెరుగుతాయ్... ‘వ్యాపారాన్ని మరింత సులభతరం చేసే విధంగా ఈ ప్రక్రియ మొత్తం ఉంటుందని భావిస్తున్నాం. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో దేశంలో స్థిరమైన, మరింత సమర్థవంతమైన హై–స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ (డేటా) సేవలను కోరుకుంటున్న యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. 4జీ మొబైల్ కవరేజీ లేని ప్రాంతాల్లో దీని అవసరం మరింతగా ఉంది. పబ్లిక్ వైఫైను అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఈ అవసరాలను తీర్చగలం’ అని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. అంతేకాకుండా ఈ సేవల ద్వారా ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించింది. -
ఇక ఊరూరా వైఫై
సాక్షి, న్యూఢిల్లీః ఇక త్వరలోనే అన్ని గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2019 మార్చి నాటికి దేశంలోని 5.5 లక్షల గ్రామాలకు వైఫై సమకూర్చేలా రూ 3700 కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తుదిరూపు ఇస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు వైఫై అందుబాటులో తెచ్చేందుకు ఈ నెలలో టెండర్లు పిలుస్తామని టెలికాం అధికారి ఒకరు వెల్లడించారు. ఇది చాలా పెద్ద లక్ష్యమేనని దేశంలోని అన్ని గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించాలంటే 5.5 లక్షల గ్రామాలకు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌ను కల్పించాల్సి ఉంటుందని టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ చెప్పారు. రూ 3700 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో దీన్ని చేపడుతున్నామని ఈ సంవత్సరాంతానికి లక్ష గ్రామ పంచాయితీల్లో సెకనుకు 1000 మెగాబైట్లతో ప్రభుత్వం బ్రాడ్‌బ్యాండ్ సేవలకు శ్రీకారం చుడుతుందన్నారు. భారత్‌నెట్ సర్వీసు ద్వారా వీరికి వైఫై కల్పిస్తామని, ఈ నెట్వర్క్ పూర్తయిన వెంటనే దేశంలోని అన్ని గ్రామాలకూ వైఫైని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. -
త్వరలో నగర వ్యాప్తంగా వై-ఫై సేవలు
యాకుత్‌పురా : హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆరు నెలల్లో వై-ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఆయన చార్మినార్ వద్ద వై-ఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ర్టంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రతీకైన చార్మినార్‌ను చూసేందుకు వచ్చే పర్యాటకుల సౌకర్యార ్థం వై-ఫై సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఆరు నెలల్లో వీటని నగరమంతటా విస్తరిస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ... పాతబస్తీలో వై-ఫై సేవలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, బీఎస్ఎన్ఎల్ జీఎం దామోదర్ రావు, మాజీ కార్పొరేటర్లు మీర్ జుల్ఫీకర్ అలీ, మోసీన్ బలాల, మహ్మద్ ముఖరం అలీ, సున్నం రాజ్‌మోహన్, మీర్జా రియాజుల్ హసన్ హఫందీ తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్లో వైఫై వసతి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రస్తుతం ప్రతి వ్యక్తి వద్దా సెల్‌ఫోన్ సర్వసాధారణమైపోయింది. గత కొంతకాలంగా ఆండ్రాయిడ్, స్మార్ట్ సెల్ఫోన్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. సుమారు 60 శాతం వినియోగదారులు ప్రపంచం మొత్తాన్ని అంతర్జాలం ద్వారా అరచేతుల్లోనే చూసేం దుకు అలవాటు పడ్డారు. ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లకు ఎటువంటి కేబుల్, డేటాకార్డ్ అనుసంధానం లేకుం డానే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే వైఫై స్మార్ట్ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు తోడైంది. ఇదిలా ఉండగా,రెల్వేకు సంబంధించిన అన్నిరకాల సేవలు ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. రైలు వేళలు, టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్లను మొబైల్, ల్యాప్‌టాప్‌ల నుంచే చేసుకోవచ్చు. అంతేగాక ఆఫీసుకు సం బంధించిన పనులను ఈమెయిల్ ద్వారా స్వీకరించి పూర్తిచేయడం పరుగుల ప్రపంచంలో మరింత సాధారణమైపోయింది. ఇటువంటి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తమిళనాడులోనే ఏ-1 రైల్వేస్టేషన్‌గా నిలిచి ఉన్నందున వైఫై వసతికి సెంట్రల్ రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి రైల్వేమంత్రి సదానందగౌడ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో పథకాన్ని సూత్రప్రాయంగా ప్రారంభించారు. వైఫై పథక పనులను రైల్‌టెల్ కార్పొరేషన్ సంస్థ చేపట్టగా సెంట్రల్లో కంట్రోలు రూమును సైతం ఏర్పాటు చేశారు. వైఫై సౌకర్యం అమలులోని సాధకబాధకాలపై సర్వే జరుపుతున్నారు. నవంబర్ ఆఖరుకల్లా వైఫై సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు హామీ ఇచ్చి ఉన్నారు. అయితే డిసెంబర్ పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో వైఫై రాలేదు. ప్రయోగాత్మకంగా వైఫైను అందుబాటులోకి తెచ్చినా ఈ సౌకర్యం వినియోగంపై నియమ నిబంధనల ను రూపొందించలేదు. సెంట్రల్ రైల్వే స్టేషన్ లో వైఫై వసతిని అరగంటపాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని, నిర్ణీత సమయం దాటితే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంద ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే రుసుము వసూలుపై రైల్‌టెల్ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంలో జాప్యం చేస్తోందని అన్నారు. అయినా ప్రయోగాత్మకంగా ప్రవే శపెట్టిన వైఫై సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చని తెలిపారు. రైల్‌టెల్ నుంచి ఆదేశాలు రాగానే పూర్తిస్థాయి సేవలను విస్తరిస్తూ ప్రచారం చేస్తామని ఆయన వెల్లడించారు. -
తొలి వైఫై రైల్వే స్టేషన్‌గా బెంగళూరు సిటీ స్టేషన్
న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారిగా బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు వైఫై సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ వైఫై సౌకర్యాన్ని రైల్వే మంత్రి సదానంద గౌడ ఇటీవలే ప్రారంభించారు. ప్రయాణికులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు కల్పిస్తున్న ఈ వైఫై సౌకర్యాన్ని మొబైల్ఫోన్లలో తొలి అరగంట పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత అరగంటకు రూ.25, గంటకు రూ.35 రుసుము వసూలు చేస్తారు. ఇందుకోసం స్టేషన్‌లోని వైఫై హెల్ప్డెస్క్నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.