ఇక ఊరూరా వైఫై
ఇక ఊరూరా వైఫై
Published Thu, Sep 7 2017 7:50 PM | Last Updated on Sun, Sep 17 2017 6:32 PM
సాక్షి, న్యూఢిల్లీః ఇక త్వరలోనే అన్ని గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2019 మార్చి నాటికి దేశంలోని 5.5 లక్షల గ్రామాలకు వైఫై సమకూర్చేలా రూ 3700 కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తుదిరూపు ఇస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు వైఫై అందుబాటులో తెచ్చేందుకు ఈ నెలలో టెండర్లు పిలుస్తామని టెలికాం అధికారి ఒకరు వెల్లడించారు. ఇది చాలా పెద్ద లక్ష్యమేనని దేశంలోని అన్ని గ్రామాలకు వైఫై సౌకర్యం కల్పించాలంటే 5.5 లక్షల గ్రామాలకు మొబైల్ బ్రాడ్‌బ్యాండ్‌ను కల్పించాల్సి ఉంటుందని టెలికాం కార్యదర్శి అరుణా సుందరరాజన్ చెప్పారు.
రూ 3700 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో దీన్ని చేపడుతున్నామని ఈ సంవత్సరాంతానికి లక్ష గ్రామ పంచాయితీల్లో సెకనుకు 1000 మెగాబైట్లతో ప్రభుత్వం బ్రాడ్‌బ్యాండ్ సేవలకు శ్రీకారం చుడుతుందన్నారు. భారత్‌నెట్ సర్వీసు ద్వారా వీరికి వైఫై కల్పిస్తామని, ఈ నెట్‌వర్క్ పూర్తయిన వెంటనే దేశంలోని అన్ని గ్రామాలకూ వైఫైని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
Advertisement