త్వరలో నగర వ్యాప్తంగా వై-ఫై సేవలు
యాకుత్‌పురా : హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆరు నెలల్లో వై-ఫై సేవలను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఆయన చార్మినార్ వద్ద వై-ఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ర్టంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు.
హైదరాబాద్ నగరానికి ప్రతీకైన చార్మినార్‌ను చూసేందుకు వచ్చే పర్యాటకుల సౌకర్యార ్థం వై-ఫై సేవలను అందుబాటులోకి తెచ్చామని, ఆరు నెలల్లో వీటని నగరమంతటా విస్తరిస్తామన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మాట్లాడుతూ... పాతబస్తీలో వై-ఫై సేవలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం దామోదర్ రావు, మాజీ కార్పొరేటర్లు మీర్ జుల్ఫీకర్ అలీ, మోసీన్ బలాల, మహ్మద్ ముఖరం అలీ, సున్నం రాజ్‌మోహన్, మీర్జా రియాజుల్ హసన్ హఫందీ తదితరులు పాల్గొన్నారు.