వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..! | | Sakshi
Sakshi News home page

వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!

Published Sun, Jun 16 2024 2:33 PM | Last Updated on Sun, Jun 16 2024 2:33 PM

These Are The New Devices That Change According To The Weather

ఈ ఫొటోలోని ఇంటెలిజెంట్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ పొద్దుపొద్దున్నే చాలా వెరైటీలను అందిస్తుంది. స్మార్ట్‌ టెంపరేచర్‌ కంట్రోల్‌తో క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ మేకర్‌లో పోచ్డ్‌ ఎగ్స్, గుంత పొంగనాలు, కుడుములు, పాన్‌ కేక్స్, గ్రిల్‌ ఐటమ్స్‌ వంటివి చాలానే రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైస్‌తో పాటు రెండుమూడు రకాల పాన్‌ ప్లేట్స్‌ లభిస్తుంటాయి.

అవసరాన్ని బట్టి వాటిని మార్చుకుంటూ ఎన్నో వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఒకవైపు గుంతలు, మరోవైపు పాన్‌ ప్లేట్‌ లేదా మొత్తం బాల్స్‌ పాన్, లేదంటే మొత్తం కట్లెట్స్‌ పాన్‌.. ఇలా అటాచ్డ్‌ గ్రిల్‌ ప్లేట్స్‌ మెషి¯Œ తో పాటు లభించడంతో దీనిపై వంట సులభమవుతుంది. ఫైర్‌ప్రూఫ్, హీట్‌ రెసిస్టెంట్‌ షెల్‌ హీట్‌ ఇన్సులేషన్‌తో తయారైన ఈ మేకర్‌ను సులభంగా క్లీన్‌ చేసుకోవచ్చు. అయితే అటాచ్డ్‌ పాన్‌ లేదా గ్రిల్‌ ప్లేట్స్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

వైఫై ఎనేబుల్డ్‌  కాఫీ మేకర్‌..
ఈ స్టైలిష్‌ కాఫీ మేకర్‌తో వివిధ రకాల కాఫీ ప్లేవర్స్‌ని ఎంజాయ్‌ చేయవచ్చు. బ్లాక్‌ కాఫీ, క్యాపుచినో, లాటె, ఎస్ప్రెస్సో, రిస్ట్రెట్టో వంటి చాలా ప్లేవర్స్‌ ఇందులో రెడీ చేసుకోవచ్చు. అవర్స్, మినిట్స్, పవర్, టెంపరేచర్, మగ్, కప్స్‌ వంటి ఆప్షన్స్తో డివైస్‌ ముందు వైపు కింద డిస్‌ ప్లే ఉంటుంది. ఆ డిస్‌ప్లేలో ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని వైఫై సాయంతో స్మార్ట్‌ ఫో¯Œ కి కనెక్ట్‌ చేసుకుని కూడా సులభంగా వినియోగించుకోవచ్చు.

6 అడ్జస్టబుల్‌ గ్రైండ్‌ సెట్టింగులతో రూపొందిన ఈ మేకర్‌ని యూజ్‌ చేసుకోవడం చాలా ఈజీ. సర్వ్‌ చేసుకోవడం తేలిక. అలాగే ఈ డివైస్‌కి ఎడమవైపు వాటర్‌ ట్యాంక్‌ ఉంటుంది. దానిలో నీళ్లు నింపుకుని, కుడివైపు పైభాగంలో మూత తీసి.. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్‌ వేసుకుని పవర్‌ బటన్‌ నొక్కితే చాలు. టేస్టీ కాఫీ రెడీ అయిపోతుంది. ఇందులో ఒకేసారి నాలుగు నుంచి పది కప్పుల వరకూ కాఫీని రెడీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్‌ కూడా ఇందులో ఉంది.

హాట్‌– కోల్డ్‌ బ్లెండర్‌..
గ్రెయిన్, పేస్ట్, టీ, జ్యూస్, క్లీన్‌ అనే ఐదు ఆప్షన్స్తో రూపొందిన ఈ హాట్‌– కోల్డ్‌ బ్లెండర్‌ వినియోగదారులకు సౌకర్యవంతమైన మిక్సీలా పని చేస్తుంది. దీనిలో నూక, పిండి తయారు చేసుకోవడంతో పాటు జ్యూసులు, మిల్క్‌ షేక్స్‌ వంటివి వేగంగా రెడీ చేసుకోవచ్చు. సుమారు 25 నిమిషాల వ్యవధిలో ఫిల్టర్‌తో పని లేకుండా ఒకేసారి 2 కప్పులు సోయా పాలను సిద్ధం చేసుకోవచ్చు.

దీనిలో పదునైన మిక్సింగ్‌ నైవ్స్‌ బ్లేడ్స్‌లా ఉంటాయి. ఈ జ్యూసర్‌లో 12 అవర్స్‌ ప్రీసెట్‌ ఆప్ష¯Œ తో పాటు వన్‌ అవర్‌ కీప్‌ వార్మర్‌ అనే ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఇది ఒకరికి లేదా ఇద్దరికి అనువైనది. దీనిలో ఆటోమేటిక్‌ క్లీనింగ్‌ ఆప్షన్‌ ఉండటంతో. దీని వాడకం చాలా తేలికగా ఉంటుంది. పైగా ఇది తక్కువ శబ్దంతో పని చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement