Equipment sales
-
వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!
ఈ ఫొటోలోని ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ పొద్దుపొద్దున్నే చాలా వెరైటీలను అందిస్తుంది. స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్‌తో క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ మేకర్లో పోచ్డ్ ఎగ్స్, గుంత పొంగనాలు, కుడుములు, పాన్ కేక్స్, గ్రిల్ ఐటమ్స్ వంటివి చాలానే రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైస్‌తో పాటు రెండుమూడు రకాల పాన్ ప్లేట్స్ లభిస్తుంటాయి.అవసరాన్ని బట్టి వాటిని మార్చుకుంటూ ఎన్నో వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఒకవైపు గుంతలు, మరోవైపు పాన్ ప్లేట్ లేదా మొత్తం బాల్స్ పాన్, లేదంటే మొత్తం కట్లెట్స్ పాన్.. ఇలా అటాచ్డ్ గ్రిల్ ప్లేట్స్ మెషి¯Œ తో పాటు లభించడంతో దీనిపై వంట సులభమవుతుంది. ఫైర్‌ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ షెల్ హీట్ ఇన్సులేషన్‌తో తయారైన ఈ మేకర్‌ను సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే అటాచ్డ్ పాన్ లేదా గ్రిల్ ప్లేట్స్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.వైఫై ఎనేబుల్డ్ కాఫీ మేకర్..ఈ స్టైలిష్ కాఫీ మేకర్‌తో వివిధ రకాల కాఫీ ప్లేవర్స్ని ఎంజాయ్ చేయవచ్చు. బ్లాక్ కాఫీ, క్యాపుచినో, లాటె, ఎస్ప్రెస్సో, రిస్ట్రెట్టో వంటి చాలా ప్లేవర్స్ ఇందులో రెడీ చేసుకోవచ్చు. అవర్స్, మినిట్స్, పవర్, టెంపరేచర్, మగ్, కప్స్ వంటి ఆప్షన్స్‌తో డివైస్ ముందు వైపు కింద డిస్ ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని వైఫై సాయంతో స్మార్ట్ ఫో¯Œ కి కనెక్ట్ చేసుకుని కూడా సులభంగా వినియోగించుకోవచ్చు.6 అడ్జస్టబుల్ గ్రైండ్ సెట్టింగులతో రూపొందిన ఈ మేకర్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. సర్వ్ చేసుకోవడం తేలిక. అలాగే ఈ డివైస్‌కి ఎడమవైపు వాటర్ ట్యాంక్ ఉంటుంది. దానిలో నీళ్లు నింపుకుని, కుడివైపు పైభాగంలో మూత తీసి.. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ వేసుకుని పవర్ బటన్ నొక్కితే చాలు. టేస్టీ కాఫీ రెడీ అయిపోతుంది. ఇందులో ఒకేసారి నాలుగు నుంచి పది కప్పుల వరకూ కాఫీని రెడీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.హాట్– కోల్డ్ బ్లెండర్..గ్రెయిన్, పేస్ట్, టీ, జ్యూస్, క్లీన్ అనే ఐదు ఆప్షన్స్‌తో రూపొందిన ఈ హాట్– కోల్డ్ బ్లెండర్ వినియోగదారులకు సౌకర్యవంతమైన మిక్సీలా పని చేస్తుంది. దీనిలో నూక, పిండి తయారు చేసుకోవడంతో పాటు జ్యూసులు, మిల్క్ షేక్స్ వంటివి వేగంగా రెడీ చేసుకోవచ్చు. సుమారు 25 నిమిషాల వ్యవధిలో ఫిల్టర్‌తో పని లేకుండా ఒకేసారి 2 కప్పులు సోయా పాలను సిద్ధం చేసుకోవచ్చు.దీనిలో పదునైన మిక్సింగ్ నైవ్స్ బ్లేడ్స్లా ఉంటాయి. ఈ జ్యూసర్లో 12 అవర్స్ ప్రీసెట్ ఆప్ష¯Œ తో పాటు వన్ అవర్ కీప్ వార్మర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఒకరికి లేదా ఇద్దరికి అనువైనది. దీనిలో ఆటోమేటిక్ క్లీనింగ్ ఆప్షన్ ఉండటంతో. దీని వాడకం చాలా తేలికగా ఉంటుంది. పైగా ఇది తక్కువ శబ్దంతో పని చేస్తుంది. -
March-3: జపాన్ ‘హినామత్సురి’ వేడుక ప్రత్యేకత ఏంటో తెలుసా!
మన దేశంలో కొన్నిచోట్ల ఏటా దసరా నవరాత్రుల సందర్భంగా ఇళ్లల్లో బొమ్మల కొలువులు పెట్టడం, వాటిని చూడటానికి బంధుమిత్రులను ఆహ్వానించడం ఆచారంగా ఉంది. జపాన్‌లో కూడా ఇలాంటి ఆచారమే ఉండటం విశేషం. జపాన్‌లో ఏటా మార్చి 3న ‘హినామత్సురి’ పేరుతో బొమ్మల కొలువుల వేడుకను జరుపుకొంటారు. జపాన్‌లోని షింటో మతస్థులు ఏటా జరుపుకొనే ఐదు రాచవేడుకల్లో ఇదొకటి. ఇదివరకు చైనీస్ కేలండర్ లెక్కల ప్రకారం ప్రతిఏటా మూడో నెలలోని మూడో రోజున ఈ వేడుకను జరుపుకొనేవారు. ఇంగ్లిష్ కేలండర్ వాడుక అలవాటైన తర్వాత ఈ వేడుకను మార్చి 3న జరుపుకోవడం మొదలు పెట్టారు. ‘హినామత్సురి’ వేడుకను ‘డాల్స్ ఫెస్టివల్’ అని, ‘గర్ల్స్ ఫెస్టివల్’ అని కూడా అంటారు. ఈ వేడుకలో ఇళ్లల్లో బొమ్మల కొలువు పెట్టడానికి అంచెలంచెలుగా వేదికను ఏర్పాటు చేసి, దానిపై ఎర్రని తివాచీ పరిచి, చక్కగా అలంకరించిన బొమ్మలను కొలువులో పెడతారు. ఈ బొమ్మల కొలువులో జపాన్ చక్రవర్తి, మహారాణి బొమ్మలతో పాటు రాచప్రాసాదంలో సంగీత వాద్యాలను వాయించేవారు, నృత్యం చేసేవారు సహా రకరకాల పనులు చేసేవారి బొమ్మలను సంప్రదాయబద్ధంగా పెడతారు. వీటితో పాటు ఆధునిక జీవనశైలిని ప్రతిబింబించే బొమ్మలను కూడా కొలువులో పెడతారు. ఈ కొలువుల్లో బొమ్మలను అమర్చడంలో ఒక క్రమాన్ని, పద్ధతిని పాటిస్తారు. ఈ బొమ్మల కొలువులను ఏర్పాటు చేయడంలో సందడంతా అమ్మాయిలదే! ఐదు అంచెల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేయడానికి దాదాపు 1500–2500 డాలర్ల (రూ.1.24 లక్షల నుంచి రూ. 2.07 లక్షలు) వరకు ఖర్చు చేస్తారు. ఇళ్లల్లో బోషాణాల్లోను, బీరువాల్లోను దాచిపెట్టిన బొమ్మలను ఈ వేడుక కోసం బయటకు తీసి, వాటిని శ్రద్ధగా అలంకరిస్తారు. వేడుక మరుసటి రోజునే ఈ బొమ్మలను కొలువు నుంచి తీసేసి యథాప్రకారం దాచేస్తారు. వేడుక ముగిసినా బొమ్మలను తీసి దాచేయకుంటే, ఇళ్లలోని అమ్మాయిలకు ఆలస్యంగా పెళ్లి జరుగుతుందని షింటో మతస్థుల నమ్మకం. సంప్రదాయ ప్రకారం ఈ బొమ్మల కొలువులను కనీసం ఐదు అంచెల్లో ఏర్పాటు చేస్తారు. సంపన్నులైతే, ఏడు అంచెల్లో కూడా బొమ్మల కొలువులు పెడతారు. ఈ ఆచారం పదిహేడో శతాబ్ది నుంచి కొనసాగుతోంది. అప్పటి జపాన్ యువరాణి మీషో పీచ్ ఫెస్టివల్ సమయంలో తొలిసారిగా బొమ్మల కొలువును ఏర్పాటు చేసింది. బొమ్మల కొలువులను ఏర్పాటు చేసిన వారు ఇళ్లకు అతిథులను ఆహ్వానించి విందు భోజనాలు పెడతారు. ఇవి చదవండి: ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా.. -
స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ:తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు
కరోనా మహమ్మారి చాలామంది జీవితాల్లో తీరని దుఃఖాన్ని, సంక్షోభాన్ని మిగిల్చింది. కానీ కొంతమందిలో మాత్రం వినూత్న ఆలోచనలకు పునాది వేసింది. అలా లాక్డౌన్లో లాక్ అయిన ఒక కొత్త జంట సరికొత్త ఆలోనచలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. అతికొద్ది సమయంలోనే కోట్ల ఆదాయాన్ని ఆర్జించారు. ఇదే రియా అండ్ రౌనక్ సక్సెస్ స్టోరీ. రియా నిహాల్ సింగ్, రౌనక్ సింగ్ ఆనంద్ వివాహ బంధంలోకి అలా అడుగు పెట్టారో లేదో 2020లో దేశం కరోనా కారణంగా దేశవ్యాప్త లాక్డౌన్ మొదలైంది. దీంతో కొత్త జంట ఇంటికే పరిమితం కావడంతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారి ఆశయానికి బ్రేక్ పడింది. కానీ బిజినెస్ చేయాలన్న ఆలోచన వారిని ఊరికే ఉండనీయ లేదు. ఫిట్నెస్ ఔత్సాహికులైన ఇద్దరూ హోమ్ జిమ్ని స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ తాము కాలేజీ రోజుల్లో అమెరికాలో ఉపయోగించిన స్మార్ట్ ఫిట్నెస్ పరికరాలు మార్కెట్లో అందుబాటులో లేవు. మరోవైపు పెద్దగా నాణ్యతలేని ఉత్పత్తులను కొనుగోలు చేయడమా, లేదంటే లక్షల రూపాయలు వెచ్చించి దిగుమతి చేసుకోవడమా అనే రెండు ఆప్షన్లు మాత్రమే కనిపించడంతో మీమాంసలో పడి పోయారు. ఈ క్రమంలో మార్కెట్లో తమలాంటి చాలామంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని గ్రహించారు. అప్పటికే తండ్రి ఆటో కాంపోనెంట్స్ తయారీ సంస్థకు బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రౌనక్, మార్కెట్ డిమాండ్నుచూసి, తన సొంతహోమ్ ఫిట్నెస్ పరికరాల కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అలా భార్యతో కలిసి డైరెక్ట్-టు-కస్టమర్ బ్రాండ్ ఫ్లెక్స్‌నెస్ట్ ని ప్రారంభించారు. ఈ కంపెనీ ద్వారా ఇంటర్నెట్లో నాణ్యమైన ఫిట్నెస్ పరికరాలను విక్రయిస్తూ పాపులర్ అవ్వడమే కాదు. కేవలం మూడేళ్లలో ఒక బ్రాండ్ నేమ్‌ను తీసుకొచ్చారు. 2021లో ఫ్లెక్స్నెస్ట్ను ఆవిష్కృతమైంది. యోగా మ్యాట్లు,ఎడ్జస్టబుల్ డంబెల్లతో ప్రారంభమై ఆ తరువాత తొలి బ్లూటూత్ కనెక్టెడ్ ఎక్సర్సైజ్ స్పిన్ బైక్, ఫ్లెక్స్‌నెస్ట్ రోవర్స్ ట్రెడ్మిల్స్ను పరిచయం చేశారు.అలా ఏడాదిన్నరలో వారి పోర్ట్‌ఫోలియోలో దాదాపు 12 ఉత్పత్తులను జోడించారు. గుర్గావ్లో కేవలం అయిదుగురి స్టాఫ్‌తో కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే కంపెనీ రూ.37.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) 2022 జనవరిలోనే వారి ఆదాయం రికార్డు ఆదాయం రూ.3.83 కోట్లను సాధించారు. హోమ్ వర్కౌట్ జిమ్ ఉత్పత్తులతో టాప్‌లో నిలిచింది. ఇపుడిక రూ. 100 కోట్ల ఆదాయాన్ని ఈ జంట ఆశిస్తోంది. వీరి ఉత్పత్తుల్లో దాదాపు సగం టైర్ 1 నగరాల్లో అమ్ముడవుతున్నాయి. ప్రధానం జర్మనీ, చైనా, తైవాన్‌ల ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ సేల్స్‌లో 70 శాతం వెబ్సైట్, 30శాతం ఇతర ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ల నుండే జరుగుతాయి. 70వేలకు పైగా కస్టమర్లను సొంతం చేసుకున్న కంపెనీ, యాప్ ద్వారా వర్చువల్ శిక్షణ తరగతులను అందిస్తారు. (జియో సినిమా షాకిచ్చిందిగా: ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ షురూ) ఫిట్నెస్ బ్రాండ్ ఫ్లెక్స్ నెస్ట్ FlexDubs లాంచ్‌తో ఆడియో మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. జర్మనీలో తయారైన AI- ఎనేబుల్డ్ వాయిస్ అసిస్టెన్స్ బ్లూటూత్ ఇయర్ఫోన్లు లాంచ్ చేసింది. అమెరికాలో పరిచయం, ప్రేమ రియా నిహాల్ సింగ్ ఎమోరీ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్ పట్టా, జార్జియా విశ్వవిద్యాలయం నుంచి థియేటర్ స్టడీస్ (2012-2016)లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసింది. పాఠశాల విద్యను ఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్ నుండి పూర్తి చేసింది. వ్యాపారవేత్త కావడానికి ముందు, రియా ఎన్డీటీవీలోనూ, పబ్లిక్ రిలేషన్స్ విభాగంలోనూ పనిచేసింది. రౌనక్ బర్కిలీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ , డ్యూక్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్లో పీజీ చేశారు. 2015లో కాలేజీలో చదువుతున్నప్పుడు అమెరికాలో పప్రేమలో పడిన ఈ లవ్‌బర్డ్స్ 2020 జనవరిలో వివాహం చేసుకున్నారు. రౌనక్ తండ్రి కార్ కాంపోనెంట్ తయారీ కంపెనీ యజమాని. రియా కూడా ఢిల్లీలోని ప్రముఖ వ్యాపార కుటుంబం నుండి వచ్చింది. ఆమె తండ్రి గుర్మీత్ నిహాల్ సింగ్ బట్టల ఎగుమతిదారు. అలా ఇద్దిరిదీ వ్యాపార కుటుంబాల నేపథ్యం కావడంతో ఈ జంటకు మరింత కలిసి వచ్చింది. -
ఇదో రకం దోపిడీ!
- ప్రైవేటు స్కూళ్లలో నోట్‌బుక్స్, ఇతర సామగ్రి అమ్మకాలు - బహిరంగ మార్కెట్ కంటే రెండింతలు అధిక ధరలు - నిబంధనలు ఉల్లంఘన - చలనం లేని విద్యాశాఖాధికారులు సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు స్కూళ్ల దోపిడీ పరాకాష్టకు చేరుతోంది. పిల్లల నుంచి దోచుకునేందుకు అనువైన ఏ అవకాశాన్నీ వదలడం లేదు. ఇప్పటికే ట్యూషన్, అడ్మిషన్, డొనేషన్ ఫీజుల పేరిట పిండుకుంటున్నా.. వారి ధనదాహం తీరడం లేదు. చిన్నపాటి ప్రైవేటు పాఠశాల మొదలుకొని కార్పొరేట్ స్కూళ్ల వరకు ఇదే పరిస్థితి. బడుల్లో ఏ వస్తువూ విక్రయించకూడదని నిబంధలు స్పష్టం చేస్తున్నా... హద్దు మీరుతున్నారు. నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, పెన్సిళ్లు, చార్టులు, పెన్నులు, యూనిఫాంలు, సాక్సులు తదితర వాటిని బలవంతంగా విద్యార్థులకు అంటగడుతున్నారు. బయట కొనుగోలు చేస్తామని తల్లిదండ్రులు వారించినా.. యాజమాన్యాలు వదిలిపెట్టడం లేదు. దీంతో చేసేదేమీలేక ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తూ చేతి చమురు వదిలించుకుంటున్నారు. రెండింతలు అధికం స్కూల్ పేరు, చిరునామా ముద్రించి మరీ కొన్ని యాజమాన్యాలు నోట్‌బుక్స్ విక్రయిస్తున్నాయి. ఒక్కో నోట్‌బుక్ పై ధర రూ.40- రూ.50 వేసి దండుకుంటున్నారు. అదే నోట్‌బుక్ బహిరంగ మార్కెట్లో రూ.20- రూ.30కు మించి ఉండదు. వారు నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయని పిల్లల పట్ల యాజమాన్యాలు కర్కశంగా వ్యవహరిస్తున్నాయి. విభిన్న రూపాల్లో దండిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తొమ్మిదో తరగతికి అవసరమయ్యే 25 నోట్‌బుక్స్‌కు రూ.1100కు పైడి, పదో తరగతిలో 30 నోట్‌బుక్స్‌కు రూ.1300 - రూ.1700 వరకు వసూలు చేస్తుండడం ప్రైవేటు స్కూళ్ల నిలువు దోపిడీకి నిదర్శనం. ప్రత్యామ్నాయం లేక ఖర్చు ఎక్కువైనా ఆ స్కూళ్లలో కొనుగోలు చేస్తున్నారు విద్యార్థులు. కొన్ని ప్రాంతాల్లో బయట లభించే నోట్బుక్స్నే స్కూళ్లలో అధిక ధరలకు అంటగడుతున్నారు. ఇంకొన్ని బడులలో ఏడాదికి సరిపడే నోట్‌బుక్స్, అట్టలు, పేరు స్టిక్కర్లు, రంగులతోపాటు సాధారణ పెన్సిళ్లు, పెన్నులు, చార్టులకు ధర నిర్ణయించి ప్యాకేజీలా అమ్ముతున్నారు. వీటికి తోడు ఏమాత్రం నాణ్యత లేని వర్క్‌బుక్స్‌ని వందల రూపాయలకు విక్రయిస్తున్నారు. అధికారుల మొద్దు నిద్ర ప్రైవేటు స్కూళ్ల అక్రమ వ్యవహారమంతా విద్యాశాఖాధికారులకు తెలిసినా... చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు అందితేనే తప్ప తనిఖీలకు కదలని పరిస్థితి దాపురించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న స్కూళ్ల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయి. కొన్నిచోట్ల స్కూళ్ల లొసుగులు తెలిసినా అధికారులు చర్యలకు ఉపక్రమించే ధైర్యం చేయడం లేదు. యాజమాన్యాలు అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తుండడంతో చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. జంట విద్యాశాఖలకు సిబ్బంది కొరత వేధిస్తోందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలకు ప్రత్యేక వ్యవస్థ లేదు. ఈ కారణంగా వారు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. పున:ప్రారంభానికి ముందు... ఆ తర్వాత కొన్ని నెలల వరకు ప్రైవేటు స్కూళ్ల నిర్వహణపై విద్యాశాఖాధికారులు ఓ కన్నేస్తే మంచిది. కొంతవరకైనా వాటి ఆగడాలను అదుపుచేయవచ్చు. ఉపేక్షించం ప్రైవేటు స్కూళ్లలో నోట్‌బుక్స్ విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. స్కూళ్లలో తనిఖీలు చేపడతాం. ఒకవేళ అమ్ముతున్నట్లు సమాచారం అందితే ఆ స్కూళ్లపై చర్యలు తప్పవు. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఏ వస్తువూ అమ్మకూడదు. గీత దాటితే ఉపేక్షించేది లేదు. - సోమిరెడ్డి, హైదరాబాద్ డీఈఓ యూనిఫాంలపైనా... ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు యూనిఫాంలూ కాసులు కురిపిస్తున్నాయి. పాఠశాలల్లో నేరుగా యూనిఫాంలు విక్రయిస్తే అధికారులతో ఇబ్బంది ఎదురవుతుందని భావించిన యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. స్కూల్ ఉన్న సమీప ప్రాంతంలోనే ఓ వ స్త్ర దుకాణంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. తమ యూనిఫారాలు అక్కడే లభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే కొనుగోలు చేసేలా చూస్తున్నాయి. దీనిపై వస్త్ర దుకాణాల నుంచి కమీషన్ల రూపంలో భారీగా వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.