సెంట్రల్‌లో వైఫై వసతి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రస్తుతం ప్రతి వ్యక్తి వద్దా సెల్‌ఫోన్ సర్వసాధారణమైపోయింది. గత కొంతకాలంగా ఆండ్రాయిడ్, స్మార్ట్ సెల్‌ఫోన్లు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. సుమారు 60 శాతం వినియోగదారులు ప్రపంచం మొత్తాన్ని అంతర్జాలం ద్వారా అరచేతుల్లోనే చూసేం దుకు అలవాటు పడ్డారు. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లకు ఎటువంటి కేబుల్, డేటాకార్డ్ అనుసంధానం లేకుం డానే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే వైఫై స్మార్ట్‌ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు తోడైంది. ఇదిలా ఉండగా,రెల్వేకు సంబంధించిన అన్నిరకాల సేవలు ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి.
రైలు వేళలు, టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్లను మొబైల్, ల్యాప్‌టాప్‌ల నుంచే చేసుకోవచ్చు. అంతేగాక ఆఫీసుకు సం బంధించిన పనులను ఈమెయిల్ ద్వారా స్వీకరించి పూర్తిచేయడం పరుగుల ప్రపంచంలో మరింత సాధారణమైపోయింది. ఇటువంటి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో వైఫై సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తమిళనాడులోనే ఏ-1 రైల్వేస్టేషన్‌గా నిలిచి ఉన్నందున వైఫై వసతికి సెంట్రల్ రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి రైల్వేమంత్రి సదానందగౌడ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో పథకాన్ని సూత్రప్రాయంగా ప్రారంభించారు. వైఫై పథక పనులను రైల్‌టెల్ కార్పొరేషన్ సంస్థ చేపట్టగా సెంట్రల్‌లో కంట్రోలు రూమును సైతం ఏర్పాటు చేశారు. వైఫై సౌకర్యం అమలులోని సాధకబాధకాలపై సర్వే జరుపుతున్నారు. నవంబర్ ఆఖరుకల్లా వైఫై సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు హామీ ఇచ్చి ఉన్నారు. అయితే డిసెంబర్ పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో వైఫై రాలేదు. ప్రయోగాత్మకంగా వైఫైను అందుబాటులోకి తెచ్చినా ఈ సౌకర్యం వినియోగంపై నియమ నిబంధనల ను రూపొందించలేదు.
సెంట్రల్ రైల్వే స్టేషన్ లో వైఫై వసతిని అరగంటపాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని, నిర్ణీత సమయం దాటితే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంద ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే రుసుము వసూలుపై రైల్‌టెల్ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంలో జాప్యం చేస్తోందని అన్నారు. అయినా ప్రయోగాత్మకంగా ప్రవే శపెట్టిన వైఫై సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చని తెలిపారు. రైల్‌టెల్ నుంచి ఆదేశాలు రాగానే పూర్తిస్థాయి సేవలను విస్తరిస్తూ ప్రచారం చేస్తామని ఆయన వెల్లడించారు.