Central Railway Station
-
సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు
కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. వివరాలు.. చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పోలీసు కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి సెంట్రల్ రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు సమాచారం అందించాడు. కాసేపట్లో బాంబు పేలుతుందని చెప్పి కట్ చేశాడు. దీంతో సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన ఫ్లవర్‌బజార్ అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ విశ్వనాథన్ భాగ్యరాజ్ నేతృత్వంలో పోలీసులు విచారించారు. ఫోన్ కాల్ నంబర్ కీల్పాక్కం మెంటల్ హెల్త్ షెల్టర్ నుంచి వచ్చినట్లు తెలిసింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యాసార్పాడికి చెందిన రామలింగం కుమారుడు మణికంఠన్ (21)గా గుర్తించారు. అతను ఏడేళ్లుగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. అలాగే తన వద్ద బాంబు ఉందని రెండుసార్లు ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌ను బెదిరించాడు. స్టేషన్లో బాంబు లేదని నిర్ధారించిన పోలీసులు మరోసారి ఇలాంటివి పునావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
హై అలర్ట్
సెంట్రల్ రైల్వే స్టేషన్లో మూడంచెల భద్రత జాగిలాలతో తనిఖీలు కాశిమేడులో యువకుడి చొరబాటు? టీనగర్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సెంట్రల్ రైల్వేస్టేషన్లో మూడంచెల భద్రత కల్పించారు. పోలీసు జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నారు. ఇలావుండగా కాశిమేడులోగల కోస్ట్‌గార్డ్ కార్యాలయంలోకి ఒక యువకుడు హద్దులు దాటి ప్రవేశించాడు. అతని వద్ద పోలీసు లు తీవ్ర విచారణ జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలు జరుగనున్నాయి. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం, పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలోకి తీవ్రవాదులు చొరబడి దాడులకు పాల్పడడం, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తీవ్రవాదుల చొరబాటు వంటి చర్యలతో ఈ భద్రతను పెంచారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు భగ్నం కలిగించే రీతిలో ఉగ్రవాదులు హింసాత్మక చర్యలకు పాల్పడనున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలోను భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో తీరప్రాంతాల్లోనే కాకుండా, అనేక ముఖ్య నగరాలను భద్రతా వలయం కిందికి తెచ్చారు. చెన్నైలో వాణిజ్య సముదాయాలు, ఆలయాలు, రద్దీ ప్రాంతాల్లోను నిఘా ఏర్పాటు చేశారు. సెంట్రల్ రైల్వే స్టేషన్లో.. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో మూడంచెల పోలీసు భద్రత కల్పించారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలోగల రెండు ప్రవేశ ద్వారాలు, సబర్బన్ రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణీకులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.70 మందికి పైగా పోలీసులు భద్రతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు అన్నింటిలోను తీవ్రంగా తనిఖీలు జరుపుతున్నారు. ఇదే విధంగా ఎగ్మూరు రైల్వే స్టేషన్లోను భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయంలో.. చెన్నై విమానాశ్రయంలో ఐదంచెల భద్రతా ఏర్పాట్లు కల్పించారు. ఇక్కడ సందర్శకులకు అనుమతి నిరాకరించారు. సీఐఎస్ఎఫ్ జవానులు, స్థానిక పోలీసులు విమానాశ్రయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. కోయంబేడు బస్టాండులోను అదనపు పోలీసు భద్రత కల్పించారు. 27వ తేదీ వరకు ఈ భ ద్రత కొనసాగుతుందని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
సెంట్రల్లో వైఫై వసతి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రస్తుతం ప్రతి వ్యక్తి వద్దా సెల్‌ఫోన్ సర్వసాధారణమైపోయింది. గత కొంతకాలంగా ఆండ్రాయిడ్, స్మార్ట్ సెల్ఫోన్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. సుమారు 60 శాతం వినియోగదారులు ప్రపంచం మొత్తాన్ని అంతర్జాలం ద్వారా అరచేతుల్లోనే చూసేం దుకు అలవాటు పడ్డారు. ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లకు ఎటువంటి కేబుల్, డేటాకార్డ్ అనుసంధానం లేకుం డానే ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే వైఫై స్మార్ట్ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు తోడైంది. ఇదిలా ఉండగా,రెల్వేకు సంబంధించిన అన్నిరకాల సేవలు ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. రైలు వేళలు, టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్లను మొబైల్, ల్యాప్‌టాప్‌ల నుంచే చేసుకోవచ్చు. అంతేగాక ఆఫీసుకు సం బంధించిన పనులను ఈమెయిల్ ద్వారా స్వీకరించి పూర్తిచేయడం పరుగుల ప్రపంచంలో మరింత సాధారణమైపోయింది. ఇటువంటి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. తమిళనాడులోనే ఏ-1 రైల్వేస్టేషన్‌గా నిలిచి ఉన్నందున వైఫై వసతికి సెంట్రల్ రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అప్పటి రైల్వేమంత్రి సదానందగౌడ చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్లో పథకాన్ని సూత్రప్రాయంగా ప్రారంభించారు. వైఫై పథక పనులను రైల్‌టెల్ కార్పొరేషన్ సంస్థ చేపట్టగా సెంట్రల్లో కంట్రోలు రూమును సైతం ఏర్పాటు చేశారు. వైఫై సౌకర్యం అమలులోని సాధకబాధకాలపై సర్వే జరుపుతున్నారు. నవంబర్ ఆఖరుకల్లా వైఫై సౌకర్యం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు హామీ ఇచ్చి ఉన్నారు. అయితే డిసెంబర్ పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో వైఫై రాలేదు. ప్రయోగాత్మకంగా వైఫైను అందుబాటులోకి తెచ్చినా ఈ సౌకర్యం వినియోగంపై నియమ నిబంధనల ను రూపొందించలేదు. సెంట్రల్ రైల్వే స్టేషన్ లో వైఫై వసతిని అరగంటపాటు ఉచితంగా వినియోగించుకోవచ్చని, నిర్ణీత సమయం దాటితే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంద ని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే రుసుము వసూలుపై రైల్‌టెల్ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంలో జాప్యం చేస్తోందని అన్నారు. అయినా ప్రయోగాత్మకంగా ప్రవే శపెట్టిన వైఫై సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చని తెలిపారు. రైల్‌టెల్ నుంచి ఆదేశాలు రాగానే పూర్తిస్థాయి సేవలను విస్తరిస్తూ ప్రచారం చేస్తామని ఆయన వెల్లడించారు. -
తీవ్రవాదుల టార్గెట్ ‘మోదీ’
సాక్షి, చెన్నై : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ బహిరంగ సభ విచ్చిన్నం లక్ష్యం గానే గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో బాం బులు అమర్చినట్టు తీవ్రవాదుల వద్ద జరిపిన విచారణలో వెలుగు చూసింది. ఈ మేరకు పట్టుబడిన తీవ్రవాదుల వద్ద బెంగళూరులో తీవ్ర విచారణ సాగుతోంది. మరి కొన్ని రోజుల్లో వీరిని చెన్నైకు తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఈ ఏడాది మే ఒకటో తేదీ పేలుడు జరిగిం ది. బెంగళూరు నుంచి వచ్చిన గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకున్న ఈ పేలుళ్ల కేసును ఓ సవాల్‌గా తీసుకున్న సీబీసీఐడీ విచారణను నెలల తరబడి సాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో బెంగళూరులో రెండు రోజుల క్రితం ముగ్గురు తీవ్రవాదులు పట్టుబడడం, వారికి ఈ కేసుకు సంబంధం ఉన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో చెన్నై నుంచి సీబీసీఐడీ డీఎస్పీలు విజయరాఘవన్, ఆనందకుమార్ బెంగళూరు వెళ్లారు. అక్కడ కర్ణాటక పోలీసులతో కలసి విచారణలో నిమగ్నం అయ్యారు. ఆ తీవ్రవాదులు పట్టుబడ్డ ధర్వార్ నగర్ పరిసరాల్లో విచారణ జరుపుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయి తే, ఆ ముగ్గురు తీవ్రవాదులు అన్న సమాచారంతో ఆ పరిసరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు. మోదీ టార్గెట్ ఆ తీవ్రవాదుల చెప్పిన వివరాల మేరకు ఆ పేలుళ్లు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేష న్ను టార్గెట్ చేయలేదన్న విషయం స్పష్ట అవుతోంది. ఇదే విషయాన్ని ఘటన జరిగిన సందర్భంలో అప్పటి డీజీపీ రామానుజం సైతం వ్యాఖ్యానించారు. రైలు ఆలస్యంగా రావడం వల్లే ఇక్కడ పేలిందని, లేకుంటే ఆంధ్రప్రదేశ్ వైపుగా రైలు పరుగులు తీస్తున్న సమయంలో పేలుడు జరిగి ఉండేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తాజాగా తీవ్ర వాదులు సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పర్యటనలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఉన్న విషయం తెలిసిందే. నెల్లూరు సభకు ఏర్పాట్లు చేసి ఉన్న దృష్ట్యా, ఆ సభ విచ్చిన్నం లక్ష్యంగా ఈ పేలుడుకు వ్యూహ రచన జరిగినట్టు గతంలో వ్యక్తమైన అనుమానాలు తాజా విచారణలో నిజమయ్యూయి. మోదీని టార్గెట్ చేసి గుహవాటి ఎక్స్‌ప్రెస్‌లో టైమర్లను అమర్చిన ఈ ముగ్గురు తీవ్ర వాదులు నిషేదిత ‘సిమి’కి చెందిన వాళ్లుగా తేల్చారు. సిమి కార్యకలాపాలు చాప కింద నీరు లా రాష్ట్రంలో సాగుతుండడం ఇటీవల వెలుగు చూసిన దృష్ట్యా, ఈ కేసుకు సహకరించిన వాళ్లెవ్వరైనా ఇక్కడ నక్కి ఉన్నారా..? అన్న అనుమానాలు మొదలయ్యూయి. ఆ ముగ్గురినీ త్వరితగతిన తమ కస్టడీకి తీసుకునే చర్యల్ని సీబీసీఐడీ డీఎస్పీలు వేగవంతం చేశారు. మరి కొన్ని రోజుల్లో వారిని చెన్నై తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. -
మెట్రోకు రూ.3 వేల కోట్లు
మెట్రో రైలు పనులకు మరో మూడు వేల కోట్లు అనివార్యమైంది. తిరువొత్తియూరు వరకు విస్తరించడంతో అదనపు నిధుల కోసం అంచనా వ్యయం సిద్ధమైంది. 9 కి.మీ. దూరం మేరకు పనులు చేపట్టనున్నారు. ఈ మార్గంలో 8 రైల్వే స్టేషన్లు ఏర్పాటు కాబోతున్నారుు. త్వరలో స్థల సేకరణకు రంగం సిద్ధమవుతోంది. మెట్రో పథకాన్ని తిరువొత్తియూరు వరకు పొడిగించడంతో ఆ పరిసర వాసుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. సాక్షి, చెన్నై: రాజధాని నగరం చెన్నైలో ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించే విధంగా మెట్రో రైలు ప్రాజెక్టును రూ.15 వేల కోట్లతో శ్రీకారం చుట్టింది. చాకలిపేట నుంచి అన్నాసాలై వైపుగా జెమిని, సైదా పేట, గిండి మీదుగా మీనంబాక్కం వరకు ఓ మార్గం, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబేడు మీదుగా వడపళని, గిండిలను కలుపుతూ సెయింట్ థామస్ మౌంట్ వరకు మరో మార్గంలో మెట్రో రైలు సేవలకు నిర్ణయించారు. ఈ మార్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రెజిల్లో రూపుదిద్దుకున్న మెట్రో రైలు బోగీలు చెన్నై చేరాయి. కోయంబేడు-ఆలందూరు మధ్య పనులు దాదాపుగా ముగింపు దశకు చేరాయి. ఈ మార్గంలో ట్రయల్ రన్ సాగుతోంది. ఇక స్టేషన్ల నిర్మాణం పూర్తి కాగానే, ఈ మార్గంలో సేవలకు కొత్త ఏడాదిలో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, తొలి నాళ్లలో ఈ ప్రాజెక్టును ప్రకటించగానే, తిరువొత్తియూరు పరిసరాల్లో పెద్ద ఉద్యమం బయలుదేరింది. చాకలిపేట నుంచి కాకుండా తిరువొత్తియూరు వరకు పొడిగించాలన్న డిమాండ్‌తో సాగిన ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తిరువొత్తియూరులోని విమ్కోనగర్ వరకు ఈ ప్రాజెక్టును పొడిగించేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆమోదముద్ర వేయడంతో తిరువొత్తియూరు పరిసరవాసులు ఆనందంలో మునిగారు. ఈ పరిస్థితుల్లో తాజాగా తిరువొత్తియూరు వరకు ప్రాజెక్టు పొడిగించడం ద్వారా అయ్యే అదనపు వ్యయంపై ఆ ప్రాజెక్టు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. రైలుసేవల విస్తరణకు సంబంధించి స్థల సేకరణ లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. 20వేల కోట్లకు చేరిన వ్యయం: మెట్రో రైలు ప్రాజెక్టుకు వ్యయం తొలుత 15 వేల కోట్లు అంచనా వేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రస్తుతం సుమారు ఇరవై వేల కోట్లకు సమీపించింది. తిరువొత్తియూరు విమ్కో నగర్ వరకు పొడిగించనుండడంతో అదనంగా మరో రూ.3వేల కోట్లు అనివార్యమైంది. ఇందుకు సంబంధించిన అంచనా, ఆ మార్గం లో చేపట్టబోయే పనులకు సంబంధించిన అన్ని అంశాలతో నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చెంతకు చేరింది. ఆ నివేదిక ఆధారంగా చాకలి పేట నుంచి తిరువొత్తియూరు విమ్కో నగర్‌కు 9 కి.మీ. దూరం మేరకు పనులు చేపట్టనున్నారు. 2.2కి.మీ భూగర్భ మార్గంలో, 6.8 కి.మీ. వంతెన మార్గం లో రైలు పయనించనుంది. కొరుక్కుపేటతో పాటు మరోచోట స్టేషన్లు భూగర్భ మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. తండయార్ పేట, టోల్ గేట్, తాంగల్, గౌరిఆశ్రమం, తిరువొత్తియూరు, విమ్కోనగర్ స్టేషన్లు వంతెన మార్గం లో ఉంటాయి. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కేంద్రానికి పంపనున్నారు. కేం ద్రం ఆమోదంతో స్థలసేకరణకు, వెనువెంటనే 9 కి.మీ. దూరం పనులకు శ్రీకారం చుట్టేందుకు మెట్రో ప్రాజెక్టు వర్గాలు కార్యాచరణను సిద్ధం చేశాయి. -
ఏటీవీఎం సిబ్బంది తొలగింపుతో ఇక్కట్లు
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వేస్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం)ల వద్ద ప్రయాణికులకు సాయమందించేందుకు నియమించిన సిబ్బందిని రైల్వే శాఖ తొలగించింది. ఏటీవీఎంల ద్వారా టికెట్ల విక్రయ వ్యవహారాల నిర్వహణ కష్టం గా మారడం వల్లే వీరిని తొలగించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను ఆ శాఖ విడుదల చేసింది. దీంతో ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్ర ల్ రైల్వే పరిధిలో 382 ఏటీవీఎంలు ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులకు టికెట్ పొందేందుకు సహకరించేందుకు గతంలో 600 మంది సిబ్బందిని నియమించారు. వీరు సెంట్రల్ రైల్వే కార్యాలయా ల్లో పనులు ముగించుకుని షిఫ్టుల వారీగా ఆయా ఏటీవీఎంల వద్ద విధులు నిర్వర్తించేవారు. వీరు తమ స్మార్ట్ కార్డ్‌ల ద్వారా ప్రయాణికులకు ఏటీవీఎంల నుంచి టికెట్ తీసి ఇచ్చేవారు. ఈ సిబ్బంది తమ స్మార్ట్ కార్డ్ రీచార్జ్ చేసుకున్నప్పుడు ఐదు శాతం బోనస్ లభిస్తుంది. కార్డు లేని ప్రయాణికులకు వీరు తమ స్మార్ట్‌కార్డ్ ద్వారా టికెట్ తీసి ఇస్తారు. దీంతో వీరికి అదనంగా కమీషన్ లభించేది. వీరిని తొలగించడంతో టికెట్ విండోల వద్ద రద్దీ భారీగా పెరిగిపోయింది. కాగా, ఈ సిబ్బంది రోజుకు దాదాపు ఆరు లక్షల మంది ప్రయాణికులకు టికెట్లను కొనుగోలు చేసేవారు. ఈ సందర్భంగా సెం ట్రల్ రైల్వే పీఆర్వో నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. సెంట్రల్ రైల్వేలో దాదాపు 85 మంది రిటైర్డ్ సిబ్బంది ఇప్పటికీ ఈ విధులు నిర్వహిస్తున్నారన్నా రు. వీరు హాజరు కాని సమయంలో టికెట్ విండోల వద్ద భారం పడుతోందని తెలిపారు. -
రైళ్లు రద్దు చేయడం సబబే
హైకోర్టు ఉత్తర్వులు జారీ ప్యారీస్, న్యూస్‌లైన్: తగిన ఆదాయం రాకపోవడంతో చెన్నై అన్నానగర్, పాడి వరకు నడిపిన రైలును దక్షిణ రైల్వే నిలిపివేయడంలో తప్పేమి లేదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ఎస్.పట్టాభిరామన్ ఒక లేఖ పంపారు. అందులో చెన్నై అన్నానగర్‌లో నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్, చెన్నై బీచ్ రైల్వే స్టేషన్లకు మధ్య నడుపుతూ వచ్చినైరెళ్ల సేవను నిలిపివేశారు. దీంతో నిరుపయోగంగా ఉన్న అన్నానగర్ రైల్వే స్టేషన్‌ను కొందరు సంఘ విద్రోహులు అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. చెన్నై సెంట్రల్ నుంచి అన్నానగర్‌కు ైరె ళ్లను కొనసాగించే విధంగా రైల్వే నిర్వాహకులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ లేఖను ప్రజావ్యాజ్యంగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి సతీష్ కుమార్ అగ్నిహోత్రి, న్యాయమూర్తి ఎం.ఎస్.సుందరేష్ ఈ పిటిషన్‌కు బదులు పిటిషన్ దాఖలు చేయాలని దక్షిణ రైల్వే ప్రధానాధికారికి నోటీసులు పంపారు. దీంతో రైల్వే శాఖ బదులు పిటిషన్ ఇచ్చింది. అందులో చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్, బీచ్ రైల్వే స్టేషన్ల నుంచి విల్లివాక్కం మీదుగా అన్నానగర్‌లోని పాడి వరకు 2003లో రైలు సేవలను ప్రారంభించామని, విల్లివాక్కం నుంచి అన్నానగర్‌కు రైళ్లను నడిపేందుకు ఒక రోజుకు 30 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే ఈ రైలులో తక్కువ మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. రోజుకు వెయ్యి కూడా ఆదాయం అందడం లేదని పేర్కొన్నారు. దీంతో 2006లో అన్నానగర్ రైలు సేవను రద్దు చేశామని తెలిపారు. అలాగే నిరుపయోగంగా ఉన్న అన్నానగర్ రైల్వేస్టేషన్‌కు పోలీసులు ప్రతిరోజూ గస్తీకి వెళుతున్నారని తెలిపారు. పిటిషన్‌దారు పట్టాభిరామన్ తెలిపిన విధంగా ఈ రైల్వే స్టేషన్లో సంఘ విద్రోహుల చర్యలు వంటి ఎటువంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు అందలేదని తెలిపారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు వెలువరించిన ఉత్తర్వులలో తగిన ఆదాయం లేకపోవడంతో దక్షిణ రైల్వే అన్నానగర్ వరకు నడుస్తున్న రైలును రద్దు చేయడంలో తప్పేమి లేదన్నారు.