సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం)ల వద్ద ప్రయాణికులకు సాయమందించేందుకు నియమించిన సిబ్బందిని రైల్వే శాఖ తొలగించింది. ఏటీవీఎంల ద్వారా టికెట్ల విక్రయ వ్యవహారాల నిర్వహణ కష్టం గా మారడం వల్లే వీరిని తొలగించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను ఆ శాఖ విడుదల చేసింది. దీంతో ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్ర ల్ రైల్వే పరిధిలో 382 ఏటీవీఎంలు ఉన్నాయి.
ఇక్కడ ప్రయాణికులకు టికెట్ పొందేందుకు సహకరించేందుకు గతంలో 600 మంది సిబ్బందిని నియమించారు. వీరు సెంట్రల్ రైల్వే కార్యాలయా ల్లో పనులు ముగించుకుని షిఫ్టుల వారీగా ఆయా ఏటీవీఎంల వద్ద విధులు నిర్వర్తించేవారు. వీరు తమ స్మార్ట్ కార్డ్‌ల ద్వారా ప్రయాణికులకు ఏటీవీఎంల నుంచి టికెట్ తీసి ఇచ్చేవారు. ఈ సిబ్బంది తమ స్మార్ట్ కార్డ్ రీచార్జ్ చేసుకున్నప్పుడు ఐదు శాతం బోనస్ లభిస్తుంది. కార్డు లేని ప్రయాణికులకు వీరు తమ స్మార్ట్‌కార్డ్ ద్వారా టికెట్ తీసి ఇస్తారు.
దీంతో వీరికి అదనంగా కమీషన్ లభించేది. వీరిని తొలగించడంతో టికెట్ విండోల వద్ద రద్దీ భారీగా పెరిగిపోయింది. కాగా, ఈ సిబ్బంది రోజుకు దాదాపు ఆరు లక్షల మంది ప్రయాణికులకు టికెట్లను కొనుగోలు చేసేవారు. ఈ సందర్భంగా సెం ట్రల్ రైల్వే పీఆర్వో నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. సెంట్రల్ రైల్వేలో దాదాపు 85 మంది రిటైర్డ్ సిబ్బంది ఇప్పటికీ ఈ విధులు నిర్వహిస్తున్నారన్నా రు. వీరు హాజరు కాని సమయంలో టికెట్ విండోల వద్ద భారం పడుతోందని తెలిపారు.
ఏటీవీఎం సిబ్బంది తొలగింపుతో ఇక్కట్లు
Published Sun, Jun 29 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM
Advertisement
Advertisement