automatic ticket vending machine
-
ఏటీవీఎం సిబ్బంది తొలగింపుతో ఇక్కట్లు
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వేస్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం)ల వద్ద ప్రయాణికులకు సాయమందించేందుకు నియమించిన సిబ్బందిని రైల్వే శాఖ తొలగించింది. ఏటీవీఎంల ద్వారా టికెట్ల విక్రయ వ్యవహారాల నిర్వహణ కష్టం గా మారడం వల్లే వీరిని తొలగించినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను ఆ శాఖ విడుదల చేసింది. దీంతో ప్రయాణికు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెంట్ర ల్ రైల్వే పరిధిలో 382 ఏటీవీఎంలు ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులకు టికెట్ పొందేందుకు సహకరించేందుకు గతంలో 600 మంది సిబ్బందిని నియమించారు. వీరు సెంట్రల్ రైల్వే కార్యాలయా ల్లో పనులు ముగించుకుని షిఫ్టుల వారీగా ఆయా ఏటీవీఎంల వద్ద విధులు నిర్వర్తించేవారు. వీరు తమ స్మార్ట్ కార్డ్‌ల ద్వారా ప్రయాణికులకు ఏటీవీఎంల నుంచి టికెట్ తీసి ఇచ్చేవారు. ఈ సిబ్బంది తమ స్మార్ట్ కార్డ్ రీచార్జ్ చేసుకున్నప్పుడు ఐదు శాతం బోనస్ లభిస్తుంది. కార్డు లేని ప్రయాణికులకు వీరు తమ స్మార్ట్‌కార్డ్ ద్వారా టికెట్ తీసి ఇస్తారు. దీంతో వీరికి అదనంగా కమీషన్ లభించేది. వీరిని తొలగించడంతో టికెట్ విండోల వద్ద రద్దీ భారీగా పెరిగిపోయింది. కాగా, ఈ సిబ్బంది రోజుకు దాదాపు ఆరు లక్షల మంది ప్రయాణికులకు టికెట్లను కొనుగోలు చేసేవారు. ఈ సందర్భంగా సెం ట్రల్ రైల్వే పీఆర్వో నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ.. సెంట్రల్ రైల్వేలో దాదాపు 85 మంది రిటైర్డ్ సిబ్బంది ఇప్పటికీ ఈ విధులు నిర్వహిస్తున్నారన్నా రు. వీరు హాజరు కాని సమయంలో టికెట్ విండోల వద్ద భారం పడుతోందని తెలిపారు. -
మొబైల్‌తో ‘లోకల్’ టికెట్
సాక్షి, ముంబై: లోకల్ రైళ్ల టికెట్లను మొబైల్ ఫోన్లో కొనుగోలు చేసేందుకు మార్గం సుగమమైంది. మే లేదా జూన్ నుంచి దీన్ని అమలుచేసే అవకాశాలున్నాయని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. సెంట్రల్, హార్బర్, పశ్చిమ రైల్వే మార్గాల ద్వారా ప్రతిరోజూ దాదాపు 75 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఏ స్టేషన్లో చూసినా టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలు ఉంటాయి. అయితే వీటివల్ల ప్రయాణికుల విలువైన సమయం వృథా అవుతోందని భావించిన రైల్వే అధికారులు కూపన్ వేలిడేటింగ్ మెషీన్ (సీవీఎం), ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ (ఏటీవీఎం)లు అందుబాటులో ఉంచారు. కాని అనేక సందర్భాలలో అవి పనిచేయడంలేదు. దీంతో రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. నేటి ఆధునిక కాలంలో సాధారణంగా మొబైల్ ఫోన్లు అందరి వద్దా ఉంటున్నాయి. త్వరలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారిలో వెళుతుండగానే తమవద్ద ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా లోకల్ రైలు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ)లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రయాణికులకు సేవలందించే విషయంపై చర్చ జరిగింది. అందులో మొబైల్ ఫోన్లో టికెట్ల సేవలు ప్రారంభించాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఇరు రైల్వేల జనరల్ మేనేజర్లు హేమంత్ కుమార్, సునీల్‌కుమార్ సూద్, రీజినల్ రైల్వే జనరల్ మేనేజర్లు ముఖేష్ నిగం, శైలేంద్రకుమార్, ప్రజా సంబంధాల అధికారి శరత్ చంద్రాయన్ తదితరులు పాల్గొన్నారు.