రైళ్లు రద్దు చేయడం సబబే
హైకోర్టు ఉత్తర్వులు జారీ
ప్యారీస్, న్యూస్‌లైన్: తగిన ఆదాయం రాకపోవడంతో చెన్నై అన్నానగర్, పాడి వరకు నడిపిన రైలును దక్షిణ రైల్వే నిలిపివేయడంలో తప్పేమి లేదని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ఎస్.పట్టాభిరామన్ ఒక లేఖ పంపారు. అందులో చెన్నై అన్నానగర్‌లో నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్, చెన్నై బీచ్ రైల్వే స్టేషన్‌లకు మధ్య నడుపుతూ వచ్చినైరెళ్ల సేవను నిలిపివేశారు. దీంతో నిరుపయోగంగా ఉన్న అన్నానగర్ రైల్వే స్టేషన్‌ను కొందరు సంఘ విద్రోహులు అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.
చెన్నై సెంట్రల్ నుంచి అన్నానగర్‌కు ైరె ళ్లను కొనసాగించే విధంగా రైల్వే నిర్వాహకులు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ లేఖను ప్రజావ్యాజ్యంగా స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి సతీష్ కుమార్ అగ్నిహోత్రి, న్యాయమూర్తి ఎం.ఎస్.సుందరేష్ ఈ పిటిషన్‌కు బదులు పిటిషన్ దాఖలు చేయాలని దక్షిణ రైల్వే ప్రధానాధికారికి నోటీసులు పంపారు.
దీంతో రైల్వే శాఖ బదులు పిటిషన్ ఇచ్చింది. అందులో చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్, బీచ్ రైల్వే స్టేషన్‌ల నుంచి విల్లివాక్కం మీదుగా అన్నానగర్‌లోని పాడి వరకు 2003లో రైలు సేవలను ప్రారంభించామని, విల్లివాక్కం నుంచి అన్నానగర్‌కు రైళ్లను నడిపేందుకు ఒక రోజుకు 30 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే ఈ రైలులో తక్కువ మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు.
రోజుకు వెయ్యి కూడా ఆదాయం అందడం లేదని పేర్కొన్నారు. దీంతో 2006లో అన్నానగర్ రైలు సేవను రద్దు చేశామని తెలిపారు. అలాగే నిరుపయోగంగా ఉన్న అన్నానగర్ రైల్వేస్టేషన్‌కు పోలీసులు ప్రతిరోజూ గస్తీకి వెళుతున్నారని తెలిపారు. పిటిషన్‌దారు పట్టాభిరామన్ తెలిపిన విధంగా ఈ రైల్వే స్టేషన్‌లో సంఘ విద్రోహుల చర్యలు వంటి ఎటువంటి ఫిర్యాదులు ఇప్పటి వరకు అందలేదని తెలిపారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు వెలువరించిన ఉత్తర్వులలో తగిన ఆదాయం లేకపోవడంతో దక్షిణ రైల్వే అన్నానగర్ వరకు నడుస్తున్న రైలును రద్దు చేయడంలో తప్పేమి లేదన్నారు.