
యూపీలో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela) మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దీంతో బీహార్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకుంటున్న భక్తులు పలు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పట్నా జంక్షన్‌తోపాటు బీహార్‌లోని పలు రైల్వేస్టేషన్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
ప్రయాగ్‌రాజ్ వెళ్లే రైళ్లలోకి ఎలాగైనా ఎక్కాలని పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని నిలువరించడం రైల్వే పోలీసులకు కష్టంగా మారింది. కాగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైళ్లు ఊహకందనంత లేటుగా నడుస్తున్నాయి.
బీహార్(Bihar)లోని పట్నా మీదుగా 10 రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ చాలా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ నుంచి పట్నా వచ్చే ప్రత్యేక రైలు (23320) ఏకంగా 37 గంటలు లేటుగా గమ్యస్థానానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 12:30కు ప్రయాగ్‌రాజ్ నుంచి బయలుదేరిన ఈ రైలు శనివారం రాత్రి 10:18కి పట్నా జంక్షన్ చేరుకుంది. ఇదేవిధంగా సిక్కిం ఎక్స్‌ప్రెస్ కూడా శనివారం 20 గంటలు లేటుగా పట్నా చేరుకుంది. అనన్‌సోల్ మహాకుంభ్ రైలు 9 గంటలు ఆలస్యంగా నడిచింది. కామాఖ్య నుంచి బయలుదేరిన కుంభమేళా స్పెషల్ రైలు నాలుగు గంటలు లేటుగా గమ్యస్ణానానికి చేరుకుంది.
ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన