రైల్వేట్రాక్‌ల పునరుద్ధరణకురూ. 19 వేల కోట్లు
న్యూఢిల్లీ: రైల్వే భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వేట్రాక్‌ల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 19 వేల కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి సదానందగౌడ తెలిపారు. రైల్వేశాఖ ప్రాధాన్యత అంశాల్లో భద్రత కూడా ఒకటని...అందువల్ల ట్రాక్‌ల పునరుద్ధరణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని...దాన్ని ఆపబోమని గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు. నిధుల లభ్యత, ట్రాక్‌ల పరిస్థితినిబట్టి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మరోవైపు రైళ్లలో క్యాటరింగ్ సేవలపై చాలా ఫిర్యాదులు అందుతున్న విషయం వాస్తవమేనని గౌడ అంగీకరించారు.
రైళ్లలో ఇకపై నాణ్యమైన ఆహారాన్ని అందరికీ అందుబాటు ధరలో అందిస్తామన్నారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రయాణికుల స్పందన తెలుసుకునేందుకు ఐదు రైళ్ల లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు వివరించా రు. రైల్వేస్టేషన్లు, రైళ్లలో రోజూ 25లక్షల లీటర్ల మంచి నీరు అవసరమవుతోందన్నారు. మిగతా అవసరాల కు బయటి నుంచి మంచినీటిని కొనుగోలు చేస్తున్నామన్నారు. మహిళా ప్రయాణికుల భద్రతకు మహిళా బోగీల్లో సీసీటీవీల ఏర్పాటు చేస్తామన్నారు.