సాక్షి, చెన్నై: దక్షిణ రైల్వే టైం టేబుల్ మారింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త టేబుల్ అమల్లోకి రానున్నది. ఈ టేబుల్‌లో పేర్కొన్న అంశాల మేరకు రాష్ట్రంలోకి పది రైళ్లు, ఆరు ప్రీమియం రైళ్లు రాబోతున్నాయి. నాలుగు ప్యాసింజర్లు దక్షిణాది జిల్లాల్లో పట్టాలెక్కనున్నాయి. 31 రైళ్ల వేగాన్ని పెంచారు. రైల్వే బడ్జెట్‌లో ఆ శాఖ మంత్రి సదానంద గౌడ్ చిన్నచూపు చూశారు. దక్షిణాది జిల్లాలకు ఒక్క రైలు కూడా ఇవ్వకుండా హ్యాండిచ్చారు. కంటి తుడుపు చర్యగా ఇతర రాష్ట్రాలకు చెన్నై నుంచి ఐదు రైళ్లను నడుపుతూ ప్రకటించారు. రైల్వే బడ్జెట్‌పై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పించారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏటా రైల్వే టైం టేబుల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం సహజం.
ఈ టేబుల్ ఆధారంగా కేంద్ర ప్రకటించిన కొత్త రైళ్ల వివరాలు తెలియరావడం ఖాయం. ఆ దిశగా సదానంద చేసిన ప్రకటన కన్నా, దక్షిణ రైల్వే టైంటేబుల్‌లో కొన్ని కొత్త రైళ్ల వివరాలు ప్రకటించడం ప్రజలకు కాస్త ఊరట నిచ్చే అవకాశం ఉంది. దక్షిణాది జిల్లాల మీదుగా సాగే కొన్ని రైళ్లు ఇందులో ఉండటం విశేషం. అలాగే, దక్షిణాది జిల్లాల్లో నడిపేందుకు కొన్ని ప్యాసింజర్ రైళ్ల వివరాల్ని పొందు పరిచారు. అయితే, ఈ కొత్త రైళ్లు ఎప్పటి నుంచి పట్టాలు ఎక్కుతాయోనన్న తేదీని మాత్రం అధికారులు ప్రకటించలేదు. అలాగే, కొన్ని రైళ్లు బయలుదేరే సమయాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. చెన్నై ఎగ్మూర్ నుంచి సెంగోట్టైకు వెళ్లే పొదుగై ఎక్స్‌ప్రెస్ ఇది వరకు రాత్రి 8.50 గంటలకు బయలు దేరగా, ప్రస్తుతం టేబుల్ మేరకు ఐదు నిమిషాలు ఆలస్యంగా పరుగులు తీయనుంది.
కొత్త రైళ్లు : కొత్త టైం టేబుల్ మేరకు పది కొత్త రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నారుు. అలాగే, నాలుగు ప్యాసింజర్లు, ఆరు ప్రీమియం రైళ్లను ప్రకటించారు. 31 రైళ్ల వేగాన్ని పెంచారు. అయితే, ఈ కొత్త రైళ్లు ఎప్పటి నుంచి పట్టాలెక్కనున్నాయో అన్న తేదీల్ని మాత్రం ప్రకటించలేదు. అహ్మదాబాద్ - చెన్నై సెంట్రల్ (వారంలో ఒక రోజు), లోక్‌మాన్య- చెన్నై సెంట్రల్(వారంలో ఒక రోజు), బెంగళూరు - చెన్నై (ప్రతి రోజూ), విశాఖ - చెన్నై (వారంలో ఒక రోజు), మన్నార్ కుడి - చెన్నై జోద్ పూర్( వారంలో ఒక రోజు), తిరువనంత పురం-కోయంబత్తూరు-హజరత్ నిజాముద్దీన్ (వారంలో ఒక రోజు), తిరువనంత పురం-కోయంబత్తూరు-అలపుల (వారంలో ఒక రోజు), నాగుర్ కోవిల్ - మదురై-నామక్కల్-కాట్పాడి-కాచీగూడ(వారంలో ఒక రోజు) తదితర రైళ్లు ఉన్నాయి.
ప్రీమియం రైళ్లు: సెంట్రల్ ఏసీ సౌకర్యంతో కూడిన ఆరు ప్రీమియం రైళ్లను ఈ కొత్త టైం టేబుల్లో పొందుపరిచారు. ఇందులో గయ- చెన్నై (వారంలో ఒక రోజు), హౌరా-చెన్నై (వారంలో ఒక రోజు), పాట్నా-చెన్నై-బెంగళూరు (వారంలో ఒక రోజు), జైపూర్-చెన్నై-మదురై (వారంలో ఒక రోజు), గయ-చెన్నై-పనబన్న హల్లి (వారంలో ఒక రోజు), తిరువనంతపురం-కోయంబత్తూరు-ఈరోడ్, తిరుప్పూర్-బెంగళూరు(వారంలో ఒక రోజు) ఉన్నాయి. ఇక ప్యాసింజర్ రైళ్లు ప్రతి రోజు నడవనున్నాయి. ఇందులో మన్నార్‌గుడి-మైలాడుతుైరె , పునలూరు-కన్యాకుమారి, తిరుచెందూరు-తిరునల్వేలి, కాసర గోడు-ముక్కాంబిక రోడ్డు ఉన్నాయి. ఇక, నాగర్ కోవిల్-బెంగళూరు, కన్యాకుమారి- బెంగ ళూరు, రామేశ్వరం, లోకమాన్య-మదురై, మైలాడుతురై-మైసూర్, చెన్నై-హుబ్లీ, మదురై-నిజాముద్దీన్, చెన్నై-కోవై-మైలాడుతురై, హౌరా-తిరుచ్చి, ఎగ్మూర్-జోద్ పూర్, కోయంబత్తూరు- చెన్నై తదితర 31 రైళ్ల వేగాన్ని పెంచారు.
పది కొత్త రైళ్లు
Published Thu, Aug 28 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM
Advertisement