ఉద్యమకారులపై కేసులు ఉపసంహరించాలి
రైల్వే శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా రైల్‌రోకో తదితర ఆందోళనల్లో పాల్గొన్న ఉద్యమకారులపై రైల్వే అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడను కోరారు. ఈ మేరకు ఆయన మంత్రికి లేఖ రాశారు. 60 ఏళ్ల తెలంగాణ పోరాటంలో భాగంగా ఎంతోమంది బలిదానాలకు సిద్ధపడ్డారని, అలాంటి ఉద్యమంలో రైల్ రోకోలు కూడా భాగమయ్యాయని తెలిపారు. ఆందోళనల సందర్భంగా నమోదైన కేసులు ఉద్యమకారులను ఇప్పటికీ వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.