
కిషన్ రెడ్డి అరెస్టు
వరంగల్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రాజెక్టుల బాట చేపట్టిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలోని కంతనపల్లి నుంచి దేవాదుల వరకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు.
ఈ క్రమంలో అక్కడి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు ఆయన చేపడుతున్న యాత్రకు అనుమతి లేదని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు చివరకు ఆయనను అరెస్టు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్తో కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర చేపట్టారు.