గోల్కొండ కోటలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు బుధవారం అడ్డుకుని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ : గోల్కొండ కోటలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు బుధవారం అడ్డుకుని అరెస్ట్ చేశారు. కోటపై జెండా ఎగురవేసందేకు వెళ్లిన బీజేపీ నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, చింతల రామచంద్రారెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, ఎంపీ బండారు దత్రాత్తేయ, పార్టీ సీనియర్ నేత బద్దం బాల్రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని లంగర్హౌస్ పోలీస్ స్టేషన్కు తరలించారు.