projectula bata
-
కిషన్ రెడ్డి అరెస్టు
వరంగల్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రాజెక్టుల బాట చేపట్టిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలోని కంతనపల్లి నుంచి దేవాదుల వరకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు ఆయన చేపడుతున్న యాత్రకు అనుమతి లేదని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు చివరకు ఆయనను అరెస్టు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్‌తో కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర చేపట్టారు. -
కిషన్ రెడ్డి అరెస్టు
-
'కేసీఆర్ మాట తప్పారు'
మహబూబ్‌నగర్ : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట తప్పారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా నెట్టంపాడు ఎత్తిపోతల పథకం పనులను బుధవారం నాడు నాగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పిన మాటను కేసీఆర్ తప్పారని నాగం ఆరోపించారు. ఎత్తిపోతల పనుల్లో జాప్యం జరుగుతోందని ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాజెక్టు పనులు పరిశీలించిన నాగం విమర్శించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటానికైనా సిద్ధమని నాగం పేర్కొన్నారు.