
'కేసీఆర్ మాట తప్పారు'
మహబూబ్నగర్ : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు ఇచ్చిన మాట తప్పారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా నెట్టంపాడు ఎత్తిపోతల పథకం పనులను బుధవారం నాడు నాగం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పిన మాటను కేసీఆర్ తప్పారని నాగం ఆరోపించారు.
ఎత్తిపోతల పనుల్లో జాప్యం జరుగుతోందని ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాజెక్టు పనులు పరిశీలించిన నాగం విమర్శించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటానికైనా సిద్ధమని నాగం పేర్కొన్నారు.