హైకోర్టు విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ సూచించారు.
న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ సూచించారు. విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు వెళ్తుందని చెప్పారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
కొత్త హైకోర్టు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ రెండు వివేదికలను ఇచ్చినట్టు ఆయన చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని లా కమిషన్ సూచించినట్టు సదానంద గౌడ తెలిపారు.