
సదానంద గౌడ
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పాకిస్తాన్‌కు తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని బీజేపీ నేత సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి కావాల్సిన మెజార్టీ ఉందని, లేకుంటే ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌పై తరలించడంపై స్పందిస్తూ.. అది వారి హక్కు అని, వారందరిని ఎక్కడికి తీసుకెళ్లినా.. చివరకు పాకిస్తాన్‌కు తీసుకెళ్లిన తమకొచ్చిన ఇబ్బందేమి లేదన్నారు.
ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా... కర్ణాటకలో అధికార పీఠం కోసం రాజకీయ పార్టీల మధ్య రసవత్తర పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ వారం గడువు ఇవ్వడంతో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా నిరోధించేందుకు కాంగ్రెస్, జేడీఎస్‌లు సమాయత్తమయ్యాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించింది.
Comments
Please login to add a commentAdd a comment