కాంగ్రెస్‌-జేడీఎస్‌ పదవుల కొట్లాట | JDS Rejects Congress Pleas To Share 5 Years | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌-జేడీఎస్‌ పదవుల కొట్లాట

Published Sun, May 20 2018 1:23 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

JDS Rejects Congress Pleas To Share 5 Years - Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ప్రభుత్వ ఏర్పాటుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో పదవుల కేటాయింపు ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి కుమారస్వామికి కాంగ్రెస్‌ ఝలక్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ జేడీఎస్‌ను డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయితే, ఇందుకు జేడీఎస్‌ నిరాకరించినట్లు తెలిసింది. ఉపముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్‌ శివకుమార్‌ పేరును సూచించగా, కుమారస్వామి అందుకు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం.

హోం మంత్రి పదవిని సైతం కాంగ్రెస్‌కు ఇవ్వడానికి కుమారస్వామి సిద్ధంగా లేనట్లు తెలిసింది. కాంగ్రెస్‌ తరఫు డిప్యూటీ సీఎం పదవి కోసం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ టాప్ లిస్టులో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement