కుమారస్వామి(ఎడమ), యడ్యూరప్ప(కుడి)
సాక్షి, బెంగళూరు : కన్నడనాట అధికారం చేపట్టబోయే పార్టీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీల సమీకరణాలు క్షణక్షణానికి మారుతుండటంతో ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి ఏర్పడింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు కూడా తమకే ఉందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పేర్కొంది. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఇద్దరు చొప్పున నలుగురు రెబెల్స్‌గా మారారు.
దీంతో బీజేపీ సంఖ్యా బలం 109కి చేరినట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి మిస్సింగ్‌లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడలు అసెంబ్లీకి గైర్హాజరు అయ్యారు. అయితే, ప్రమాణస్వీకారానికి ఇంకా హాజరుకాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లేందుకు ఐజీ నీలమణి రాజు వారు బస చేస్తున్న హోటల్‌కు వెళ్లారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి కూడా విధానసభకు హాజరుకాలేదు. కాగా, ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా ఉండేందుకు పార్టీలు తిప్పలుపడుతున్నాయి.
విధానసభలోకి ఎమ్మెల్యేలు మొబైల్స్‌ను తీసుకురానివ్వకుండా పార్టీలు చర్యలు తీసుకున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే వద్ద ఇద్దరు పార్టీ వ్యక్తులను ఉంచాయి. కాగా, బలపరీక్షలో నెగ్గుతామని అధికార బీజేపీ ధీమాతో ఉంది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. మద్దతు పలికిన వారికి రూ. 50 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నారని ఆరోపిస్తోంది.ýకాగా, ప్రలోభాల పేరుతో కాంగ్రెస్ విడుదల చేసిన టేపులన్నీ తప్పేనని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. బీజేపీ నేతల గొంతును మిమిక్రీ చేశారని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా బల పరీక్షలో సంఖ్యాబలం కలిగిన మేమే నెగ్గుతామని కాంగ్రెస్ నేత శివ కుమార్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే వ్యూహం కాంగ్రెస్‌కు ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment