కేంద్ర రైల్వే మంత్రికి టీఆర్‌ఎస్ ఎంపీల విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వరంగల్ జిల్లాలోని కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎంపీల బృందం కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానందగౌడను కలిసింది. బుధవారం టీఆర్‌ఎస్ ఎంపీలు ఏపీ జితేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కవిత, బి.వినోద్‌కుమార్, బీబీ పాటిల్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి రైల్‌భవన్‌లో ఆయనకు కలిసి వినతిపత్రం అందజేశారు. కాజీపేటను రైల్వే డివిజన్‌గా అభివృద్ధి చేయాలని కోరారు. 2012-13 రైల్వే బడ్జెట్‌లో కాజీ పేట వద్ద వ్యాగన్ల ఫ్యాక్టరీకి రూ.152 కోట్లు మం జూరు చేసినా పనులు ప్రారంభంకాలేదన్నారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని వెంటనే చేపట్టండి
Published Thu, Jun 12 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
Advertisement