
సాక్షి, తాడేపల్లి : కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని (సీపెట్) గురువారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి సదానందగౌడ విచ్చేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనను మర్యాదపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించి శాలువ కప్పి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ఇచ్చిన ఆతిద్యాన్ని సదానందగౌడ గౌరవంగా స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment